లక్షలోపే అదిరిపోయే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఓలా-ఏథర్‌కు గట్టి షాక్! స్టైల్‌తో కట్టిపడేస్తుంది

ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు బాగా ఊపందుకున్నాయి. ఇటీవలి కాలంలో మార్కెట్లోకి విడుదల అవుతున్న టూవీలర్స్‌లలో ఎక్కువ భాగం ఈవీలే ఉంటున్నాయి. పోటీ పెరిగిన నేపథ్యంలో తయారీదారులు పోటా పోటీగా కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు. తాజాగా ఇటలీకి చెందిన వెలోసిఫెరో సంస్థ, మన దేశానికి చెందిన VLF ఇండియా కలిసి, ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపిందించి తాజాగా ప్రారంభించాయి. ఈ కొత్త స్కూటర్ పేరు "VLF టెన్నిస్ మిలానో ఎడిషన్ (vlf tennis milano edition)". ఈ స్కూటర్ ప్రత్యేక ఎడిషన్ అయినప్పటికీ, దానిని అందరూ కొనగలిగే విధంగా అందుబాటు ధరలోనే అమ్మాలని VLF నిర్ణయించింది. స్టాండర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు భిన్నంగా, ఇది ప్రత్యేకమైన డిజైన్, స్టైల్, ఆకర్షణీయమైన లుక్స్‌తో రూపొందించబడింది

ఇటలీ మార్కెట్ నుండి స్ఫూర్తి పొంది, భారతీయ రోడ్లకు అనుగుణంగా మోడిఫై చేయబడిన ఈ స్కూటర్, సౌకర్యం, మైలేజ్, మరియు ఆర్టిస్టిక్ డిజైన్‌తో ప్రత్యేకతను చాటుతుంది. VLF టెన్నిస్ మిలానో ఎడిషన్ ధర విషయానికి వస్తే, రూ. 99,999గా ఉంది. ఇది ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే. ఆన్‌రోడ్ వచ్చేసరికి రూ. 1.20 లక్షలకు పైగా ఉంటుంది. రోజువారీ పట్టణ ప్రయాణాలను చాలా అనువుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

Tennis Milano Edition Price

ఇండియా మార్కెట్లో VLF ఇండియా ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ను అందిస్తోంది. దీనికి మరింత ప్రీమియం టచ్ ఇవ్వడానికి, కంపెనీ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. టెన్నిస్ మిలానో ఎడిషన్‌గా పేరు పొందిన ఈ ప్రత్యేక స్కూటర్ కేవలం 200 యూనిట్లు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఇది స్టాండర్డ్ వెర్షన్‌తో పాటు విక్రయించబడుతూ, స్కూటర్ లవర్స్‌కు మరింత యూనిక్, ఎక్స్‌క్లూజివ్ ఆప్షన్‌ను అందిస్తోంది.

టెన్నిస్ మిలానో ఎడిషన్‌లో 2.6 kWh కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఇది పూర్తి ఛార్జింగ్‌తో 130 కి.మీ.కు పైగా ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రత్యేకంగా పట్టణ ప్రయాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్, లేటెస్ట్ డిజైన్‌తో పాటు, మెరుగైన పనితీరును కలిగి ఉంది. మరో విషయం ఏమిటంటే ఇది ఇది తొలగించగల బ్యాటరీ ప్యాక్‌లో లభించింది. దీంతో బ్యాటరీని స్కూటర్ నుంచి తొలగించి ఛార్జ్ చేసుకోవచ్చు.

Tennis Milano Edition Launch

దీని వలన కస్టమర్లు బ్యాటరీని ఇళ్లు లేదా ఆఫీస్ లేదంటే కంఫర్ట్‌గా ఉన్న చోటుకి తీసుకెళ్లి ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు లేటెస్ట్ సాంకేతికతను అందిస్తోంది. కంపెనీ ప్రకారం, కేవలం మూడు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అయ్యే ఈ స్కూటర్, ఓ సినిమా ముగిసేలోపు రైడ్‌కు సిద్ధమవుతుంది. ఇది అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులని ఆకట్టుకోనుంది.

ఈ స్కూటర్‌లో 5-అంగుళాల TFT డిజిటల్ డిస్‌ప్లే అందించబడింది, ఇది కేవలం స్క్రీన్ మాత్రమే కాకుండా, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ వ్యవస్థ. దీని ద్వారా మీరు నోటిఫికేషన్లు పొందడం, కాల్స్‌ను యాక్సెస్ చేయడం, స్కూటర్ పనితీరును మానిటర్ చేయడం వంటి అనేక ఫీచర్లకు యాక్సెస్ పొందవచ్చు. ఇది మూడు రైడింగ్ మోడ్స్‌లను కలిగి ఉంది. అల్యూమినియం స్వింగార్మ్‌‌ను స్కూటర్‌లో ఉపయోగించారు.

Vlf India Launches New Stylish Electric Scooter

దీంతో దీని బరువు తక్కువగా ఉండటంతో పాటు, రైడింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది ముందుభాగంలో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్క్, వెనుక భాగంలో హైడ్రాలిక్ మోనోషాక్ అబ్జార్బర్‌తో వచ్చింది. ఈ సస్పెన్షన్ వ్యవస్థ కంఫర్ట్‌గా ఉంటుంది. స్మూత్ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. రాత్రిపూట డ్రైవింగ్ మరింత సురక్షితంగా ఉండేలా ఇందులో శక్తివంతమైన LED లైట్లను అమర్చారు.

More from DriveSpark

Article Published On: Thursday, April 3, 2025, 17:45 [IST]
English summary
Vlf india launches new electric scooter tennis milano edition starting price at rs 99999
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+