అన్ని ఫీచర్లు ఇచ్చి తక్కువ ధరకే అమ్ముతున్నారు.. ఈ రేటుకి వేరే స్కూటర్ కోసం చూడాల్సిన అవసరమే లేదు!
VLF కంపెనీ నుండి సరికొత్త శక్తివంతమైన అప్‌డేట్‌తో టెన్నిస్ 1500 ఎలక్ట్రిక్ స్కూటర్ (Tennis 1500) విడుదల అయింది. ఇప్పటికే మంచి సేల్స్ హైప్ అందుకున్న ఈ మోడల్‌ను కంపెనీ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మార్చింది. 2025 సంవత్సరానికి ప్రత్యేకంగా, స్టైలిష్ డిజైన్, కొత్త కలర్ ఆప్షన్లు, స్మార్ట్ ఫీచర్లతో ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. విభిన్న కలర్స్‌లలో విడుదలైన ఈ మోడల్, యూత్‌కు ప్రత్యేకంగా నచ్చేలా రూపొందించబడింది. స్కూటర్ ముందు భాగాన్ని శార్ప్‌గా డిజైన్ చేయగా, బాడీపై కొత్త గ్రాఫిక్స్, ప్రీమియం పేఇంట్ స్కీమ్‌ను ఉపయోగించడం వలన ఇది రోడ్డుపై స్పెషల్ లుక్ ఇస్తుంది.
టెక్నాలజీ పరంగా కూడా VLF పలు మార్పులు చేసింది, ఇన్‌ఫో డిస్‌ప్లే మరింత సమగ్రంగా మారింది, కనెక్టివిటీ ఫీచర్లు స్మార్ట్‌ఫోన్ యాప్‌తో సింక్ అయ్యేలా ఉన్నాయి. ఇంతకీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అప్‌డేట్ వచ్చినా కూడా స్కూటర్ ధర మాత్రం మార్చలేదు. ముందు వర్షన్‌కి ఉన్న రూ.1.29 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరకే కొత్త వర్షన్‌ను కూడా అందిస్తున్నారు. అంటే, అదనపు ఖర్చు లేకుండానే మెరుగైన డిజైన్, టెక్నాలజీ లభిస్తోంది.

ఇది ఖచ్చితంగా మార్కెట్‌లో ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడేలా చేస్తుంది. త్వరలో ఈ మోడల్ మార్కెట్లో హాట్ టాపిక్ అవడం ఖాయం. ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్‌ను చూస్తే, టెన్నిస్ 1500 వంటి స్కూటర్లు స్టైల్, ప్రాక్టికాలిటీ, ఫీచర్లు అన్నింటినీ కలిపే బెస్ట్ చాయిస్ అవుతాయి. కొత్తగా అప్‌డేట్ చేసిన VLF టెన్నిస్ 1500 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో, కేవలం డిజైన్ మాత్రమే కాదు... పనితీరులోనూ గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది.
ముఖ్యంగా బ్యాటరీ పరిధిలో ఈ స్కూటర్ ముందు మోడల్‌తో పోలిస్తే మరింత బలంగా నిలుస్తోంది. ఇంతకుముందు ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత గరిష్టంగా 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇప్పుడు అది ఏకంగా 150 కి.మీల వరకు పెరిగింది. అంటే సుమారు 20 కిలోమీటర్ల అదనపు రేంజ్‌ను స్కూటర్ అందిస్తోంది, ఇది రోజువారీ ప్రయాణాలకు మరింత ఉపయోగకరంగా మారుతుంది.

ఈ పెరిగిన రేంజ్ వెనుక కారణం, కొత్తగా అందించిన లిథియం మాంగనీస్ ఐరన్ ఫాస్ఫేట్ (LMIP) బ్యాటరీ ప్యాక్. ఇది అల్యూమినియం హౌసింగ్‌లో అమర్చబడిన ఆధునిక టెక్నాలజీతో తయారైంది. ఈ బ్యాటరీ కేవలం ఎక్కువ దూరం ప్రయాణించడమే కాదు, స్కూటర్ నిర్వహణను సులభతరం చేస్తుంది, భద్రతాపరంగా కూడా మెరుగైన రక్షణను కల్పిస్తుంది. రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త ఫీచర్లను కూడా చేర్చారు.
వాటిలో ముఖ్యమైనదిగా మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సౌకర్యం ప్రత్యేకంగా నిలుస్తోంది. మీరు స్కూటర్ మీద ప్రయాణిస్తున్నపుడు ఫోన్ ఛార్జ్ అయిపోతుందనే టెన్షన్ ఇక లేదు. కలర్స్ విషయానికి వస్తే, ఇప్పుడు ఇది రెండు స్టైలిష్ న్యూ కలర్ ఆప్షన్లలో స్లేట్ బ్లూ, ఎబోనీ బ్లాక్‌లలో లభిస్తుంది.

వీటితో పాటు, మునుపటి నుంచే అందుబాటులో ఉన్న రెండు రెగ్యులర్ కలర్స్ ఫైర్ ఫ్యూరీ డార్క్, స్నోఫ్లేక్ వైట్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా, కొత్త టెన్నిస్ 1500 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పాత మోడల్‌కు ఉన్న అన్ని ముఖ్యమైన లక్షణాలు అలాగే కొనసాగుతున్నాయి. ఈ స్కూటర్‌ను తేలికైన ఫ్రేమ్‌పై నిర్మించారు, నగర ట్రాఫిక్‌లో స్మూత్‌గా రైడ్ చేయడానికి సహాయపడుతుంది.


Click it and Unblock the Notifications








