రూ.1.5 లక్షలకే హైబ్రిడ్ బైక్.. లీటర్ పెట్రోల్‌కు 48 కి.మీ మైలేజ్! యమహా కొత్త బైక్‌తో యువత ఫుల్ ఖుష్!

జపాన్‌కు చెందిన ప్రసిద్ధ టూవీలర్ సంస్థ యమహా (Yamaha) భారత మార్కెట్లో తన బైక్‌లతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. హీరో, హోండా వంటి ప్రముఖ కంపెనీలకు ధీటుగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ అమ్మకాల పరంగా మెరుగ్గా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపెనీ తన మోడళ్లను మరింత కొత్త అప్‌డేట్‌లతో విడుదల చేస్తుంది. ఇదే క్రమంలో యమహా తన FZ-X మోడల్‌ను మారుతున్న కాలానికి అనుగుణంగా 2025 మోడల్‌లో హైబ్రిడ్ టెక్నాలజీతో మరింత ఆధునికంగా మారి కస్టమర్లు ముందుకు వచ్చింది. FZ-X మోడల్‌కు ఇప్పటికే యువతలో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు, 2025 మోడల్‌లో హైబ్రిడ్ టెక్నాలజీతో మరింత కొత్తగా మారడంతో పాటు కొత్త ఫీచర్లు, టెక్నాలజీ, డిజైన్ అప్డేట్స్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ బైక్‌పై కస్టమర్లలో మంచి ఆసక్తి నెలకొంది.

కొత్తగా విడుదలైన 2025 యమహా ఎఫ్‌జెడ్ ఎక్స్ హైబ్రిడ్ (Yamaha FZ-X Hybrid) వెర్షన్‌లో ముఖ్యమైన ఆకర్షణగా నిలుస్తోంది TFT కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్ సదుపాయాన్ని అందిస్తుంది. అంటే, GPS ఆధారితంగా రైడింగ్ మరింత సౌకర్యవంతంగా మారుతుంది. స్క్రీన్‌పై రూట్ గైడెన్స్, కాల్ అలెర్ట్స్, మెసేజ్ నోటిఫికేషన్ వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని ధర కూడా దాదాపుగా అందుబాటులో ఉంది.

Fz X Hybrid Bike Launched At Rs 1 50 Lakh

FZ-X Hybrid ధర రూ. 1,49,990 (ఎక్స్-షోరూమ్). అదే బైక్‌లో నాన్-హైబ్రిడ్ వెర్షన్ ధర రూ. 1,29,990 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. హైబ్రిడ్ మోడల్‌లో ఉండే స్టార్ట్/స్టాప్ సిస్టమ్, బ్యాటరీ అసిస్టెడ్ యాక్సిలరేషన్ వంటి ఫీచర్లు నగర ప్రయాణాల్లో మైలేజ్‌ను మెరుగుపరుస్తాయని యమహా చెబుతోంది. ఇది పెట్రోల్ ఖర్చును తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది. వీటితో పాటు, బైక్ డిజైన్ పరంగా కూడా కాస్త స్టైలిష్ టచ్‌కి లోనైంది.

కొత్త కలర్ ఆప్షన్లు, మెటాలిక్ ఫినిషింగ్, మరింత స్పోర్టీ లుక్స్ అందించబడ్డాయి. మైలేజ్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఈ రోజుల్లో ఈ కొత్త FZ-X హైబ్రిడ్ వేరియంట్ మంచి ఎంపికగా నిలుస్తోంది. ప్రత్యేకించి సిటీ రైడింగ్‌కు సరిపోయేలా తయారవడమే కాకుండా, కొత్త టెక్నాలజీతో యమహా తన క్లాస్‌ను మరోసారి నిరూపించుకుంది. ఈ బైక్‌లో 149cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌‌ను ఉపయోగిస్తున్నారు. ఇది పెట్రోల్+ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

Fz X Hybrid Bike Launched

తక్కువ వేగాల్లో బ్యాటరీ సహాయం అందడం వల్ల ఫ్యూయల్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇంజిన్ పరంగా చూస్తే, 7,250 rpm వద్ద 12.2 bhp హార్స్‌పవర్, 5,500 rpm వద్ద 13.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేశారు. ఇది స్మూత్ షిఫ్టింగ్‌కు తోడ్పడుతుంది. FZ X హైబ్రిడ్ స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG), స్టాప్ & స్టార్ట్ సిస్టమ్ (SSS) వంటి వాటితో వచ్చింది.

ముఖ్యంగా ఇది హైబ్రిడ్ కాబట్టి మైలేజ్ విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు. ఇది సగటున 48 kmpl వరకు మైలేజ్ ఇవ్వగల కెపాసిటీ కలిగి ఉంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో బాదపడుతున్న వారు ఈ కొత్త బైకును హాయిగా ఎంచుకోవచ్చు. బైక్ రైడింగ్ కంఫర్ట్, భద్రత పరంగా కూడా Yamaha ఏ మాత్రం తగ్గలేదు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో 7-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అమర్చారు.

Fz X Hybrid Bike

అలాగే, సింగిల్-ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది పలు స్మార్ట్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. Y-కనెక్ట్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లకు సులభంగా కనెక్ట్ అవుతుంది. దీనితో పాటు, టర్న్-బై-టర్న్ (TBT) నావిగేషన్ Google Mapsతో అనుసంధానించబడి ఉంది. ఎక్కువ మైలేజ్ కావాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

More from DriveSpark

Article Published On: Monday, July 14, 2025, 18:33 [IST]
English summary
Yamaha 2025 model new fz x hybrid bike launched at rs 1 50 lakh in india
Read more on: #yamaha #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+