బైక్ కొనేవారికి బంపర్ ఆఫర్.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ వేలకు వేలు పెట్టాల్సిందే.. భారీగా తగ్గించిన యమహా

మీరు పండుగ సీజన్‌లో టూ వీలర్ కొనాలనుకుంటున్నారా? అయితే యమహా మోటార్స్ ఒక శుభవార్త చెప్పింది. జీఎస్‌టీ పన్ను తగ్గించిన ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు నేరుగా అందించాలని యమహా నిర్ణయించింది. దీంతో సెప్టెంబర్ 22 నుండి యమహా బైక్‌లు, స్కూటర్ల ధరలు రూ.7,759 నుంచి రూ.17,581 వరకు తగ్గనున్నాయి.

యమహా మోటార్స్ తమ వినియోగదారులకు పెద్ద ఉపశమనం కల్పిస్తూ, జీఎస్‌టీ పన్ను తగ్గింపు ప్రయోజనాలను నేరుగా బదిలీ చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల సెప్టెంబర్ 22, 2025 నుండి భారత మార్కెట్లో విక్రయించే యమహా వాహనాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

Yamaha Bikes and Scooters Get Cheaper by up to Rs 17 500 After GST Cut

ముఖ్యంగా 350సీసీ కంటే తక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్‌లు, స్కూటర్లపై ఈ ధరల తగ్గింపు వర్తిస్తుంది. ప్రస్తుతం 28 శాతం ఉన్న పన్ను స్థానంలో 18 శాతం పన్ను మాత్రమే విధించబడుతుంది. దీంతో, యమహా వాహనాల ధరలు రూ.7,759 నుండి రూ.17,581 వరకు తగ్గుతాయి. ఈ ధరల తగ్గింపుతో కస్టమర్లు వివిధ యమహా మోడళ్లపై గణనీయమైన ప్రయోజనాలను పొందవచ్చు.

Yamaha Bikes and Scooters Get Cheaper by up to Rs 17 500 After GST Cut

యమహా R15 స్పోర్ట్స్ బైక్ ధర రూ.17,581 తగ్గి, ఇప్పుడు రూ.1,94,439 కు లభిస్తుంది. యమహా MT 15: MT 15 బైక్ ధర రూ.14,964 తగ్గి, రూ.1,65,536 కు చేరుకుంటుంది. యమహా FZ-S Fi హైబ్రిడ్ మోడల్ ధర రూ.12,031 తగ్గి, రూ.1,33,159 కు లభిస్తుంది. యమహా FZ-X హైబ్రిడ్ ధర రూ.12,430 తగ్గి, రూ.1,37,560 కు లభిస్తుంది. యమహా ఏరాక్స్ 55 వెర్షన్ ఎస్ స్కూటర్ ధర రూ.12,753 తగ్గి, రూ.1,41,137 కు లభిస్తుంది.

Yamaha Bikes and Scooters Get Cheaper by up to Rs 17 500 After GST Cut

యమహా రే ZR స్కూటర్ ధర రూ.7,759 తగ్గి, రూ.86,001 కు అందుబాటులో ఉంటుంది. యమహా ఫాసినో స్కూటర్: ఫాసినో స్కూటర్ ధర రూ.8,509 తగ్గి, రూ.94,281 కు లభిస్తుంది. ఈ ధరల తగ్గింపు వల్ల ముఖ్యంగా కొత్తగా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇది టూ-వీలర్ మార్కెట్‌కు ఊతమివ్వడమే కాకుండా, యమహా బ్రాండ్‌కు కొత్త కస్టమర్లను తీసుకురావడానికి సహాయపడుతుంది.

Yamaha Bikes and Scooters Get Cheaper by up to Rs 17 500 After GST Cut

ప్రస్తుతం టూ వీలర్ల పై 28 శాతం పన్ను విధిస్తుండగా, సెప్టెంబర్ 22 నుండి అది 18 శాతానికి తగ్గుతుంది. అంటే 10 శాతం పన్ను తగ్గుతుంది. ఈ తగ్గింపుతో కంపెనీలు తమ వాహనాలను తక్కువ ధరకు విక్రయించగలవు. ఫలితంగా, కస్టమర్‌లు ఇప్పుడున్న ధరల నుంచి 7-7.5 శాతం తక్కువ ధరకే వాహనాలను కొనుగోలు చేయవచ్చు.

పండుగ సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని ఆసక్తి చూపుతారు. ఈ సమయంలో ధరలు తగ్గడం వల్ల టూ వీలర్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 22 తర్వాత అమ్మకాలు భారీగా జరుగుతాయని భావిస్తున్నారు.

ఈ ధరల తగ్గింపు యమహా వాహనాల అమ్మకాలను మరింత పెంచుతుంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు నిర్ణయం కారణంగా పండుగ సీజన్లో బైక్ కొనాలని అనుకున్న సామాన్యులకు భారీ ఊరట లభిస్తుందని చెప్పొచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 10, 2025, 16:33 [IST]
English summary
Yamaha bikes and scooters get cheaper by up to rs 17 500 after gst cut
Read more on: #yamaha #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+