మహిళల ఫేవరెట్ స్కూటర్..70కి.మీ మైలేజీ ఇచ్చినా కొనేదిక్కులేదు..యమహా సీటు కింద బాంబు పేల్చిన రిపోర్ట్
యమహా మోటార్స్ నుంచి వచ్చిన స్టైలిష్ స్కూటర్ ఫాసినో 125 (Yamaha Fascino 125) గురించి తెలియని వారు ఉండరు. ముఖ్యంగా దాని రెట్రో లుక్, అదిరిపోయే మైలేజీకి మహిళలు, యువత ఫిదా అయిపోయారు. అయితే తాజాగా విడుదలైన 2025 నవంబర్ సేల్స్ రిపోర్ట్ చూస్తుంటే ఫాసినో జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ స్కూటర్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. అసలు ఫాసినో సేల్స్ ఎందుకు తగ్గాయి? మార్కెట్లో దీని పరిస్థితి ఏంటి? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
యమహా మోటార్స్ ఇండియా(Yamaha Motor India) పోర్ట్‌ఫోలియోలో అత్యంత స్టైలిష్ స్కూటర్‌గా పేరుగాంచిన ఫాసినో 125 అమ్మకాలపై తాజాగా వెలువడిన రిపోర్ట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. అద్భుతమైన రెట్రో లుక్, అదిరిపోయే హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చిన ఈ స్కూటర్, గత నెలలో అమ్మకాల పరంగా వెనుకబడిపోయింది.

గతేడాది నవంబర్ (2024) నెలలో యమహా ఫాసినో 7,921 యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోయింది. అయితే, తాజాగా విడుదలైన నవంబర్ 2025 గణాంకాల ప్రకారం, కేవలం 5,306 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఏడాది కాలంలో ఈ స్కూటర్ అమ్మకాలు ఏకంగా 33.01 శాతం మేర పడిపోయాయి.
అయితే, నెలవారీ విక్రయాలను గమనిస్తే.. అక్టోబర్‌లో అమ్ముడైన 5,361 యూనిట్లతో పోలిస్తే ఇది కేవలం 1 శాతం మాత్రమే తక్కువ. అంటే పండుగ సీజన్ ముగిసిన తర్వాత కూడా ఫాసినో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడుతోందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం యమహా మొత్తం అమ్మకాల్లో ఈ స్కూటర్ వాటా 12.63 శాతంగా ఉంది.

అమ్మకాలు తగ్గినప్పటికీ, ఫాసినోలో ఉన్న టెక్నాలజీ మాత్రం ఇప్పటికీ మార్కెట్లోని ఇతర స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది. ఇందులో 125 సీసీ ఎయిర్-కూల్డ్, బ్లూ కోర్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంది. ఇది 8.2 PS పవర్, 10.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలోని స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) వాహనం స్టార్ట్ అయ్యే సమయంలో అదనపు శక్తిని అందిస్తుంది.
లీటరుకు 68 నుంచి 70 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వడం దీనికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. కేవలం 99 కిలోల బరువు ఉండటం వల్ల మహిళలు, వృద్ధులు ట్రాఫిక్‌లో సులభంగా నడపగలరు. 2025 అప్‌డేటెడ్ మోడల్‌లో TFT డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ ఆధారిత నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి.

నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఫాసినో వెనుకబడటానికి ఈ మూడు ప్రధాన కారణాలు ఉండవచ్చు:
రే జెడ్ఆర్ (Ray ZR 125) హవా: యమహా నుండే వచ్చిన మరో మోడల్ రే జెడ్ఆర్ గత నెలలో యమహా సేల్స్‌లో 50 శాతానికి పైగా వాటాను సొంతం చేసుకుంది. ఇది యమహాలో నంబర్ 1 బెెస్ట్ సెల్లర్‌గా నిలవడంతో ఫాసినోపై ప్రభావం పడింది.
ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రభావం: భారత మార్కెట్లో ఓలా, ఏథర్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఈవీల జోరు పెరిగింది. అధిక పెట్రోల్ ధరల వల్ల సిటీ రైడర్లు పెట్రోల్ స్కూటర్ల కంటే ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు.
బలమైన పోటీ: సెగ్మెంట్‌లో రారాజుగా ఉన్న హోండా యాక్టివా 125, ఫీచర్లు అధికంగా ఉండే సుజుకి యాక్సెస్ 125, టీవీఎస్ జూపిటర్ 125 వంటి మోడల్స్ నుంచి ఫాసినోకు గట్టి పోటీ ఎదురవుతోంది. రాబోయే రోజుల్లో సేల్స్ పెంచుకోవడానికి యమహా కొత్త కలర్ ఆప్షన్లు ప్రవేశపెట్టడం లేదా భారీ డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








