యమహా RX100 బైక్ తిరిగి వస్తుందా? లేదా? కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ.. ఎక్కువగా వాటిపైనే ఫోకస్!
యమహా (Yamaha) టూవీలర్ ఉత్పత్తిలో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సంస్థ. ఈ కంపెనీకి చెందిన ప్రసిద్ధ మోడల్ ఆర్‌ఎక్స్ 100 (RX 100) గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సంవత్సరాలు లక్షలాది మంది బైక్ ప్రియుల గుండెల్లో స్థానం ఏర్పరచుకున్న మోడల్. యమహా RX 100 అంటే ఒకప్పటి యువతకు బాగా గుర్తుకొచ్చే పేరు. 1985లో భారత్‌లో ప్రవేశించిన RX 100, అప్పట్లో మోటార్‌సైకిల్ మార్కెట్‌కి కొత్త ఊపు తీసుకొచ్చింది. తక్కువ బరువు, శక్తివంతమైన 98సీసీ 2-స్ట్రోక్ ఇంజన్, సులువైన హ్యాండ్లింగ్‌తో దేశంలో ఒక సెన్షెసన్ సృష్టించిన మోడల్. ఆ రోజుల్లో ఈ బైక్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలామంది యువకులు తమ కలల బైక్‌గా దీన్ని కొనుగోలు చేసేవారు.
చిన్న సైజు అయినా, దాని అద్భుతమైన పనితీరు, నమ్మకమైన ఇంజిన్, సింపుల్ మెకానిక్స్ వల్ల RX 100ను నేటికీ కంటెంపరరీ లెజెండ్‌గా పరిగణిస్తారు. చాలా ఏళ్ల క్రితం ఈ బైక్ అమ్మకాలను కంపెనీ నిలిపివేసింది. అయినప్పటికి ఇది మార్కెట్లో రోడ్లపై కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం యమహా ఈ మోడల్‌ను మళ్లీ కొత్తగా తీసుకురావాలని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. కంపెనీ కూడా దీన్ని తీసుకురావడానికి సముఖంగానే ఉన్నట్లు గతంలో సమాచారం వచ్చింది.

అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, RX 100 కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే. కంపెనీ చిన్నపాటి 100-125 సీసీ ఇంజిన్ విభాగంలో కొత్త వాహనాలను ఇక ప్రవేశపెట్టబోమని పేర్కొంది. దీంతో ఈ మోడల్ కూడా ఇదే సెగ్మెంట్‌లోకి వస్తుండగా, ఇది మార్కెట్లోకి రావడం కుదరదు. ఇకపై యమహా ప్రధానంగా 300 సీసీ శ్రేణి వాహనాలపై దృష్టి సారిస్తుందని స్పష్టం చేసింది.
దీంతో RX 100 వంటి క్లాసిక్ మోడల్ మళ్లీ వస్తుందన్న ఆశ పెట్టుకున్న వారిని కొంత నిరాశపెట్టింది. ఎందుకంటే, RX 100ను ఆధునిక సాంకేతికతతో మళ్లీ రీ-లాంచ్ చేస్తారనే ఊహలు బైక్ ప్రియుల్లో హుషారును రేకెత్తించాయి. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం తన వ్యాపార మార్గాన్ని మరోసారి స్పష్టంగా చూపుతోంది. మాస్ మార్కెట్ బైక్‌ల కన్నా, పెద్ద ఇంజిన్ సామర్థ్యం ఉన్న ప్రీమియం సెగ్మెంట్ కోసం యమహా ముందడుగు వేసినట్లయింది.

యమహా ప్రధానంగా 100-125 సీసీ విభాగంలో టూవీలర్ మార్కెట్‌లో అతి పెద్ద వాటాను ఆక్రమించి ఉంది. అసలు చెప్పాలంటే, దేశంలో అమ్ముడవుతున్న వాహనాల్లో సుమారు 80 శాతం ఈ చిన్న ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైక్‌లే. ఈ విభాగం రోజువారీ వినియోగదారుల అవసరాలను తీర్చడంలో, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు వంటి అంశాలతో అత్యంత గుర్తింపు పొందింది.
హీరో, హోండా, బజాజ్, టీవీఎస్ వంటి దిగ్గజ బ్రాండ్‌లు ఈ విభాగంలో ఇప్పటికే ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ స్థితిలో యమహా కూడా అదే సెగ్మెంట్‌లో పోటీకి దిగడం కన్నా, తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడమే మేలని భావించింది. అందుకే, ఈ విభాగంలో కొత్త వాహనాలను ప్రవేశపెట్టకూడదని కంపెనీ స్పష్టంగా నిర్ణయించుకుంది. బదులుగా, 300 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ప్రీమియం వాహనాలపై దృష్టి పెట్టాలని యమహా వ్యూహాత్మకంగా యోచిస్తోంది.

కంపెనీ త్వరలో టెనెరే 700, MT-07, R7 వంటి మిడ్‌వెయిట్ మోడళ్లను భారత్‌లో లాంచ్ చేయాలన్న ఆలోచనలో ఉంది. ఇవి అంతర్జాతీయంగా విశేషంగా ప్రాచుర్యం పొందిన మోడల్స్. టెనెరే 700 ఒక యాడ్వెంచర్-టూరర్ బైక్‌గా, MT-07, R7 మోడళ్లు నేక్డ్ స్పోర్ట్స్, సూపర్ స్పోర్ట్స్ వర్గాల్లో తమదైన స్థానం సంపాదించుకున్నాయి. అంతర్జాతీయంగా ప్రీమియం సెగ్మెంట్‌లో వరుసగా విజయాలను సాధించిన తర్వాత, ఇప్పుడు ఇండియాలో కూడా తన సత్తాను చూపనుంది.


Click it and Unblock the Notifications








