ఈ సారి రైడ్ మాములుగా ఉండదు.. మొబైల్ ఫీచర్లు స్కూటర్‌లో.. పవర్‌ఫుల్ అప్‌డేట్స్‌తో హైబ్రిడ్ స్కూటర్లు

ప్రముఖ టూవీలర్ వాహన తయారీ సంస్థ యమహా (Yamaha), తన ప్రీమియమ్ 125cc Fi హైబ్రిడ్ స్కూటర్ సిరీస్‌ను కొత్త రూపంలో రోడ్డెక్కించింది. Fascino 125 Fi హైబ్రిడ్, RayZR 125 Fi హైబ్రిడ్ మోడళ్లు ఇప్పుడు మరింత ఆధునికంగా, మరింత స్మార్ట్‌గా, మరింత స్టైలిష్‌గా మారాయి. ఈసారి యమహా కేవలం కలర్స్‌ను మాత్రమే అప్‌డేట్ చేయలేదు, రైడింగ్ అనుభవాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లే సాంకేతిక మార్పులు కూడా చేసింది. కొత్త వేరియంట్లలో ఎన్‌హాన్స్డ్ పవర్ అసిస్ట్ ఫంక్షన్‌ను జోడించడం ప్రధాన ఆకర్షణ. దీని వల్ల ట్రాఫిక్ సిగ్నల్ నుంచి స్టార్ట్ అయినా, ఎత్తైన రోడ్లపై ప్రయాణమైనా స్కూటర్ తక్షణమే అదనపు బూస్ట్ ఇస్తుంది, ఫలితంగా రైడర్‌కు మరింత స్మూత్, స్పోర్టీ ఫీలింగ్ వస్తుంది. ఇది హైబ్రిడ్ టెక్నాలజీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేలా రూపొందించబడింది.

మొబైల్ యాప్ సపోర్ట్, రైడింగ్ డేటా ట్రాకింగ్, మెసేజ్, కాల్ అలర్ట్స్ వంటి స్మార్ట్ టచ్‌లు ఇప్పుడు మరింత మెరుగుపడ్డాయి. కొత్త కలర్ ఆప్షన్స్ అయితే యమహా ఆకర్షణీయమైన షేడ్స్ స్కూటర్‌కు మరింత ప్రీమియమ్ లుక్ ఇస్తాయి. మొత్తం మీద, 2025 యమహా హైబ్రిడ్ స్కూటర్ లైనప్ కేవలం మోడల్ అప్‌డేట్ కాదు, ఇది రైడింగ్‌లో స్టైల్, టెక్నాలజీ, పనితీరు ఈ మూడు ప్రపంచాలను ఒకే వేదికపైకి తెచ్చిన అప్‌గ్రేడ్.

Yamaha Hybrid Scooters Fascino 125 And Rayzr 125 Launched

కొత్త కనెక్టెడ్ ఫీచర్లు రైడర్‌ను స్కూటర్‌తో మరింత దగ్గరగా కలుపుతాయి. అదనంగా, యమహా ఈ సారి తన ప్రీమియమ్ వేరియంట్ అయిన Fascino S‌లో ఒక ప్రత్యేకమైన అప్‌గ్రేడ్‌ను అందించింది. ఈ వేరియంట్‌లో ఇప్పుడు కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చింది, ఇది కేవలం ఆకర్షణీయమైన డిస్‌ప్లే మాత్రమే కాకుండా, రైడర్‌కు మరింత సౌలభ్యం, కనెక్టివిటీని అందించే స్మార్ట్ ఫీచర్ల సమాహారం.

ఈ కొత్త కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా రైడర్ తన స్మార్ట్‌ఫోన్‌ను నేరుగా స్కూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. యమహా Y-Connect యాప్ ద్వారా సమాచారం చూడటానికి కనెక్ట్ కావచ్చు. అంటే, రైడ్ చేస్తున్నప్పటికీ ఫోన్ జేబులోనే ఉండిపోతుంది, ముఖ్యమైన సమాచారం మాత్రం స్కూటర్ మీటర్‌లోనే అందుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది Google Mapsతో ఇంటిగ్రేట్ అయి Turn-by-Turn (TBT) నావిగేషన్ సపోర్ట్ ఇస్తుంది.

Yamaha Hybrid Scooters Fascino 125 And Rayzr 125 Launched

మీరు ఎక్కడికి వెళ్తున్నా రియల్-టైమ్ డైరెక్షన్స్ మీ ముందే కనిపిస్తాయి. ఎక్కడ మలుపు తీసుకోవాలో, ఎన్ని మీటర్ల తర్వాత దారి మారుతుందో, తదుపరి జంక్షన్ ఏదో ఇవన్నీ స్పష్టంగా డిస్‌ప్లేలో చూపిస్తుంది. అంతేకాదు, నావిగేషన్ ఇండెక్స్, రోడ్ నేమ్స్ కూడా కనిపిస్తాయి, అందువల్ల మీరు రూట్ తప్పిపోయే అవకాశం చాలా తక్కువ. RAZR 125 Fi హైబ్రిడ్ స్కూటర్‌ను మరింత స్టైలిష్, ఆకర్షణీయమైన కొత్త కలర్ ఆప్షన్లతో అందుబాటులోకి తెచ్చింది.

RAZR 125 Fi హైబ్రిడ్ స్ట్రీట్ ర్యాలీ ఇప్పుడు ప్రత్యేకమైన మాట్టే గ్రే మెటాలిక్ రంగులో లభిస్తోంది, ఇది స్కూటర్‌కు రగ్గ్డ్, స్పోర్టీ లుక్ ఇస్తుంది. ఇక RAZR 125 Fi హైబ్రిడ్ డిస్క్ వేరియంట్ అయితే ప్రత్యేకమైన స్పోర్టీ సిల్వర్-వైట్ కాక్‌టెయిల్ కలర్ కాంబినేషన్‌లో అందించబడుతోంది, ఇది రోడ్డుపై చూసే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేలా ఉంటుంది.

Yamaha Hybrid Scooters Fascino 125 And Rayzr 125 Launched

ఫాసినో 125 Fi హైబ్రిడ్, రేజెడ్ఆర్ 125 Fi హైబ్రిడ్ రెండింటిలోనూ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వంటివి ఉన్నాయి. ఫాసినో S 125 Fi హైబ్రిడ్(కలర్ TFT/ TBT) రూ.1,02,790, ఫాసినో ఎస్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ రూ.95,850,ఫాసినో 125 FI హైబ్రిడ్ రూ.80,750, RayZR స్ట్రీట్ ర్యాలీ 125 Fi హైబ్రిడ్ రూ.92,970, RayZR 125 Fi హైబ్రిడ్ రూ.79,340, ఇవన్నీ ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధరలు.

More from DriveSpark

Article Published On: Friday, August 15, 2025, 7:30 [IST]
English summary
Yamaha hybrid scooters fascino 125 and rayzr 125 launched with updated new features
Read more on: #yamaha #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+