యూత్ కోసం యమహా నుంచి సరికొత్త సైలిష్ బైక్.. అదిరిపోతున్న దీని డిజైన్ చూస్తే మర్చిపోలేరు
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ యమహా ఇండియా (Yamaha India) సరికొత్త టెనెరే 700 (Tenere 700) అడ్వెంచర్ బైక్ ఎప్పుడెప్పుడు పరిచయం చేస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తుండగా, తాజాగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్లో దీన్ని ప్రదర్శనకు ఉంచింది. దీని చివరి వెర్షన్‌ను మిలన్‌లో జరిగిన EICMA 2024 ఈవెంట్‌లో మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. 2025లో కొత్తగా వస్తున్న ఈ అడ్వెంచర్ బైక్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఇది సరికొత్త డిజైన్‌తో అడ్వెంచర్లు కోరుకునే కస్టమర్లను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఆటో ఎక్స్‌పో 2025లో దీన్ని చూసినట్లయితే చాలా అందంగా స్టైలిష్ రూపంతో కనిపిస్తుంది.
యమహా టెనెరే 700 అడ్వెంచర్ బైక్ 698cc, సమాంతర-ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది ప్రధానంగా 72.4bhp పవర్, 68Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఈ ఇంజిన్‌కు జోడించారు. ఇది రైడ్-బై-వైర్ సిస్టమ్‌తో వచ్చింది. రెండు రైడింగ్ మోడ్స్ ఎక్స్‌ప్లోరర్, స్పోర్ట్ అనే వాటిని కలిగి ఉంది. కొత్త LED హెడ్‌లైట్‌తో చీకట్లో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. బాడీ ప్యానెల్‌లు కూడా కొత్తగా కనిపిస్తాయి.

ఇది ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు అత్యంత అనువైన బైక్. ఇటీవల కాలంలో చాలా మంది యువత టూర్లకు ఎక్కువగా వెళ్తున్నారు. సెలవుల సమయంలో కొద్ది రోజులు లాంగ్ రైడింగ్ లాంటివి ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి వారికి ఈ బైక్ సరిగ్గా సూట్ అవుతుంది. దీని బాడి డిజైన్ కూడా చూడగానే అడ్వెంచర్ తరహ రైడింగ్‌లకు బెస్ట్ ఆప్షన్ లాగా కనిపిస్తుంది. పొడవైన సింగిల్ పీస్ సీటు, ఫ్లైస్క్రీన్ వంటి ఆకర్షణీయంగా ఉన్నాయి.
యమహా టెనెరే 700 సస్పెన్షన్ సిస్టమ్ చాలా అధునాతనంగా రూపొందించారు. దీనికి ప్రధాన కారణం ఆఫ్ రోడ్ ప్రయాణాల్లో కూడా రైడర్లకు మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడమే కంపెనీ ఉద్దేశం. సస్పెన్షన్ సెటప్‌లో సర్దుబాటు చేయగల 43mm USD ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ సిస్టంను అందించారు. గుంతలు, బండలు ఉన్న ప్రాంతాల్లో కూడా రైడర్లకు అసౌకర్యం కలగకుండా సాఫీ ప్రయాణాన్ని అందిస్తుంది.

కఠిన భూభాగాల్లో కూడా మెరుగైన పెర్ఫామెన్స్ అందించడానికి దీని బాడీ చాలా అనుకూలంగా ఉంటుంది. బైక్ చాలా స్లిమ్ మిడ్, టెయిల్ సెక్షన్‌ను కలిగి ఉంది. టెనెరే 700 బైక్ ముందు 21-అంగుళాల వీల్, వెనుక 18-అంగుళాల స్పోక్డ్ వీల్స్‌ను కలిగ ఉంటుంది. ఇవి డ్యూయల్-స్పోర్ట్ పిరెల్లీ స్కార్పియన్ టైర్లను కలిగి ఉంటాయి. అడ్వెంచర్ బైక్ కాబట్టి కంపెనీ ప్రధానంగా బ్రేకంగ్ సిస్టంపై కీలకంగా దృష్టి పెట్టంది.
రైడర్లకు తమ డ్రైవింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి బ్రేకింగ్ సిస్టంలో 282mm ఫ్రంట్ బ్రేక్ డిస్క్, వెనుక 245mm డిస్క్‌లను అమర్చారు. దీంతో రైడింగ్ సమయంలో బైకును సులభంగా కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. అధునాతన ఫీచర్లతో యమహా టెనెరే 700 అడ్వెంచర్ బైకింగ్‌లో ఎక్కువ మంది కొత్త కస్లమర్లను ఆకట్టుకునేలా కనిపిస్తుంది.

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం మా డ్రైవ్‌స్పార్క్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








