49 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్‌ని ఇంత మంది కొన్నారా? జాక్‌పాట్ కొట్టేసిన కంపెనీ

రేసింగ్ బైక్స్ అంటే అందరికి గుర్తొచ్చేది Yamaha. అయితే ఇప్పుడు ఆ సంస్థ తక్కువ అమ్మకాలను నమోదు చేస్తుంది. జూన్ 2025లో విడుదలైన టూవీలర్ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, చాలా బ్రాండ్లు మంచి వృద్ధిని నమోదు చేసినా, Yamaha మాత్రం వెనుకబడిపోయింది. జూన్ 2024తో పోలిస్తే కంపెనీ అమ్మకాలు ఏకంగా 24 శాతం తగ్గిపోయాయి, ఇది బ్రాండ్‌కు పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు.ఈ స్థితికి కారణాలు కొన్ని మోడళ్లకు సరైన స్పందన రాకపోవడమే. ఎక్కువ వేరియంట్లు మార్కెట్‌లో గ్లామర్ కోల్పోయినట్టే కనిపించాయి. వినియోగదారుల అభిరుచులు మారుతున్న తరుణంలో Yamaha కొత్తగా ఆఫర్ చేసే మోడల్స్ ట్రెండ్‌కు తగ్గట్టు అనిపించలేకపోయాయి.

యమహా మోటార్స్‌కు సంబంధించిన జూన్ 2025 అమ్మకాల గణాంకాలు చూస్తే, కంపెనీ తీవ్రమైన వెనకడుగు వేసిందని స్పష్టమవుతోంది. గత ఏడాది ఇదే నెలలో 58,471 వాహనాలు అమ్మిన యమహా, ఈసారి మాత్రం కేవలం 44,417 యూనిట్లకు పరిమితమైంది. ఇది ఏకంగా 24 శాతంకు పైగా తగ్గుదల. వాహన రంగంలో ఇదొక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. అంతేకాదు, నెలవారీగా కూడా కంపెనీ పరిస్థితి మెరుగ్గా లేదు.

Yamaha Sales

మే 2025లో 46,086 వాహనాలను అమ్మిన కంపెనీ, జూన్‌లో ఈ సంఖ్యను నిలబెట్టుకోలేకపోయింది. అమ్మకాలు బాగా పడిపోయాయి. అయితే, ఒక్కటే కంపెనీ మెరుగైన సేల్స్ గణంకాలను తీసుకొచ్చిన మోడల్‌గా ఉంది. అదే రే జెడ్‌ఆర్(Ray ZR) స్కూటర్. జూన్ నెలలో ఈ స్కూటర్‌కి 14,274 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇది 2024తో పోల్చితే 5.99 శాతం వార్షిక వృద్ధి. మే 2025తో పోల్చినప్పుడు 9.61 శాతం నెలవారీ వృద్ధిని చూపింది.

జూన్ 2025లో కంపెనీ విక్రయించిన 44,417 యూనిట్లలో Ray ZR 14,274 యూనిట్లతో 32 శాతం వాటా దక్కించుకుంది. దీన్ని బట్టి మార్కెట్లో ఈ మోడల్‌కు ఎంత డిమాండ్ ఉందో తెలిసిపోతుంది. ఇదే సమయంలో అత్యధికంగా అమ్ముడైన బైక్‌ గురించి చూసినట్లయితే ఈ జాబితాలో జూన్ 2025లో Yamaha FZ త్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిల్‌గా నిలిచింది. అయితే దీని అమ్మకాలు ఓవరాల్‌గా మిశ్రమంగా కనిపిస్తున్నాయి.

Yamaha June 2025 Sales

FZ అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే తగ్గిపోయాయి. జూన్ 2025లో మొత్తం 10,767 యూనిట్లు అమ్ముడవ్వగా, ఇది జూన్ 2024తో పోల్చితే 10.58 శాతం తక్కువ. ముందస్తుగా చూడగలిగే మరో విషయం ఏమిటంటే, నెలవారీగా కూడా FZ అమ్మకాలు 17.04 శాతం క్షీణించాయి. అంటే మే నెలతో పోల్చినప్పుడు కూడా డిమాండ్ పడిపోయింది. అయినప్పటికి మిగతా మోడళ్ల కంటే దీని అమ్మకాలు గత నెలలో ఎక్కువగా ఉన్నాయి.

ఇప్పుడు ఉన్న యువతకు టెక్నాలజీ, కనెక్టివిటీ, డిజిటల్ డాష్, బ్లూటూత్ వంటి ఫీచర్లు ముఖ్యమవుతున్నాయి. కానీ FZ ఈ విభాగంలో బాగా వెనుకబడింది. TVS Raider, Honda SP125 వంటి మోడల్స్ మరింత ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుండటంతో, వినియోగదారుల దృష్టి వాటిపైనే ఎక్కువగా పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో Yamaha సంస్థ, FZ లైన్‌అప్‌కి కొత్త లైఫ్ ఇవ్వడానికి కీలక అప్‌డేట్స్ తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది.

Yamaha June 2025 Sales 24 Percent Down

యమహా రే ZR స్కూటర్ ధర విషయానికి వస్తే, రూ.81,471 నుండి ప్రారంభమై రూ.94,650 వరకు ఎక్స్ షోరూమ్ లభిస్తుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యమహా ఈ మోడల్‌ను నాలుగు వేరియంట్లలో డ్రమ్, డిస్క్, డిస్క్ రేసింగ్ బ్లూ, స్ట్రీట్ ర్యాలీలలో అందిస్తోంది. ఇది 125 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో 8.04 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 49 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 29, 2025, 14:50 [IST]
English summary
Yamaha june 2025 sales 24 percent down and ray zr top selling model full details
Read more on: #yamaha #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+