యూత్ కోసం యమహా నుంచి సరికొత్త సైలిష్ మోడల్.. దేశంలోనే మొట్టమొదటి 150సీసీ హైబ్రిడ్ బైక్ లాంచ్
భారతదేశంలోని మోటార్ సైకిల్ విభాగంలో బజాజ్ పల్సర్ల తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన మోడల్ యమహా FZ సిరీస్. 150సీసీ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ బైక్ ఒకప్పుడు యూత్ కు ఇష్టమైన వాహనం. RX100, R15 వంటి బ్లాక్ బస్టర్ బైకుల తర్వాత యమహా లైనప్ లో అత్యంత సక్సెస్ ఫుల్ బైక్ గా FZ గుర్తించబడటానికి కారణం వెనుక భాగంలో ఉన్న పెద్ద సైజ్ టైర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
2008 వరకు ప్రజలు బైక్ కొనాలని ఆలోచన చేసినప్పుడు వారి మనసులో మొదట బజాజ్ పల్సర్, తర్వాత హీరో కరిజ్మా ఉండేవి. కానీ FZ వాటన్నింటినీ వెనక్కి నెట్టి జనాలను షోరూంకు పరిగెత్తేలా చేసింది. బడ్జెట్ ధర, యమహా లాంటి నమ్మకమైన బ్రాండ్ ఉండడంతో యూత్ బైక్ గా మారిపోయింది. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా పెద్దగా లేకపోవడంతో సామాన్యుడి చేరువైంది. కాకపోతే గత కొంత కాలంగా దాని వైభవం మసకబారింది.

చాలా మంది 150cc మోటార్ సైకిళ్ల జాబితాలో యమహా FZ తప్పనిసరిగా ఉంటుంది. జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆవిష్కరించిన తర్వాత యమహా తన తాజా 2025 FZ-S Fi హైబ్రిడ్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనిని దేశంలోనే తొలి 150సీసీ హైబ్రిడ్ మోటార్‌సైకిల్‌గా కంపెనీ చెబుతోంది. యమహా ఫాసినో, రే ZR స్కూటర్ల తర్వాత FZ శ్రేణికి హైబ్రిడ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది.
2025 యమహా FZ హైబ్రిడ్ ఇతర ఫీచర్ల విషయానికి వస్తే స్టాప్/స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ మోటార్ జనరేటర్, నావిగేషన్‌తో కూడిన TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్‌లతో కొత్త డిజైన్ తో వస్తుంది. Y-కనెక్ట్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లతో అనుసంధానించే 4.2ఇంచుల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పు కావచ్చు.

ఇంత ఎట్రాక్టివ్ మార్పులతో మార్కెట్లోకి విడుదల చేసిన యమహా FZ హైబ్రిడ్ ధర కేవలం రూ.1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే. ఈ జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ యమహా FZ-S Fi హైబ్రిడ్‌లో OBD2-కంప్లైంట్ 149సీసీ బ్లూ కోర్ ఇంజిన్‌ను ఉపయోగించింది. యమహా స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG), స్టాప్/స్టార్ట్ సిస్టమ్ (SSS)లతో కలిపితే మైలేజ్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు.
ఈ టెక్నాలజీ సైలెంట్ ఇంజిన్ స్టార్ కు దోహదపడతాయి. బ్యాటరీ సపోర్ట్‌తో యాక్సిలరేషన్ పెరుగుతుందని కంపెనీ చెబుతుంది. ఐడిల్ కండీషన్లలో ఆటోమేటిక్ గా ఇంజిన్ ఆగిపోతుంది. దీంతో ఇంజిన్ కెపాసిటీ పెరుగుతుంది. ఎమర్జెన్సీ సమయంలో ఇంజిన్ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది... ఆ వెంటనే క్లాచ్ నొక్కి ఇంజిన్ మళ్లీ స్టార్ట్ చేయవచ్చు. 2025 FZ-S Fiహైబ్రిడ్ మోటార్‌సైకిల్ రేసింగ్ బ్లూ, సియాన్ మెటాలిక్ గ్రే కలర్స్ లో లభిస్తుంది.

బేసిక్ మోడల్ ఇప్పటికే ఉన్న మోడళ్ల మాదిరిగానే ఉన్నప్పటికీ, కంపెనీ హైబ్రిడ్ వెర్షన్‌కు కొన్ని అదనపు మార్పులు చేసింది. ట్యాంక్ కవర్ మీద ఇప్పుడు షార్ఫ్ కట్స్ అందించింది. ఫ్రంట్ టర్న్ సిగ్నల్‌లను ఎయిర్ ఇన్‌టేక్ ఏరియాలోకి కనెక్ట్ చేసే విధంగా మార్చింది. ఇది యమహా ఏరోడైనమిక్స్, స్పోర్టినెస్‌ను పెంచడానికి సహాయపడింది. రీపోజిషన్డ్ హ్యాండిల్‌బార్స్, స్విచ్ గేర్ బటన్లు కూడా ఇచ్చింది. ఇంధన ట్యాంక్ మూత ట్యాంక్‌కే యాడ్ చేసింది.
యమహా FZ హైబ్రిడ్‌లోని 149సీసీ సింగిల్-సిలిండర్ 2V SOHC ఇంజిన్ 7,250 rpm వద్ద 12.4 bhp పవర్, 5,500 rpm వద్ద 13.3 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ కు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), ఫ్రంట్ సింగిల్-ఛానల్ ABS సిస్టమ్, ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








