యూత్ ఫేవరెట్ బైక్.. మార్కెట్లో సెన్సేషన్.,. కొత్త కలర్స్, స్మార్ట్ కీతో రిలీజ్ చేసిన యమహా.. ధర కూడా తక్కువే
యమహా (Yamaha) తన ప్రీమియం బ్రాండ్ క్యాంపెయినింగ్ 'ది కాల్ ఆఫ్ ది బ్లూ'లో భాగంగా తాజాగా 2025 ఏరోక్స్ 155 వెర్షన్ ఎస్ మోడల్‌కు ఆకర్షణీయమైన కొత్త రంగులను ఇంట్రడ్యూస్ చేసింది. నేటి సిటీ యువత లైఫ్‌స్టైల్‌కు సరిపోయేలా రూపొందించిన ఈ ఏరోక్స్ 155 వాస్తవంగా యమహా పర్ఫామెన్స్, డిజైన్, ఇన్నోవేషన్ పట్ల ఉన్న అభిరుచిని ప్రతిబింబిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త స్కూటర్ గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
లేటెస్ట్ స్మార్ట్ కీ టెక్నాలజీతో వస్తున్న ఈ మ్యాక్సీ-స్పోర్ట్స్ స్కూటర్ ఇకపై ఐకానిక్ - రేసింగ్ బ్లూ, స్పెషల్ ఐస్ ఫ్లూ వెర్మిలియన్ షేడ్స్‌తో పాటు కొత్త కలర్ స్కీమ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. కొత్త ఐస్ ఫ్లూ వెర్మిలియన్ షేడ్‌తో పాటు, రేసింగ్ బ్లూ రంగులో ఉన్న ఏరోక్స్ 155 వెర్షన్ ఎస్ రిఫ్రెష్డ్ గ్రాఫిక్స్‌ను కలిగి ఉంది, ఇది దాని స్పోర్టీ ఎట్రాక్షన్ ను మరింత పెంచుతుంది.

మెటాలిక్ బ్లాక్ ఎంపిక స్టాండర్డ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీంతో పూర్తి ఏరోక్స్ సిరీస్ ఇప్పుడు OBD-2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. యమహా రేసింగ్ DNAను ప్రతిబింబించే బాడీ, సైడ్ ఫెయిరింగ్‌లలో చేసిన అప్ డేటెడ్ డిజైన్ వినియోగదారులను తప్పకుండా ఆకట్టుకుంటుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.
ఏరోక్స్ 155 మోడల్‌లు ప్రత్యేకమైన బాడీ డిజైన్, ప్రత్యేకమైన ఎక్స్ సెంటర్ మోటిఫ్‌ను కలిగి ఉన్నాయి, ఇవి వాటిని అందరికీ ఒక స్పెషల్ ఆప్షన్‌గా మారుస్తాయి. ముఖ్యమైన స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే, ఈ మ్యాక్సీ-స్పోర్ట్స్ స్కూటర్‌లు లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్ SOHC, 155సీసీ ఇంజిన్‌తో వస్తాయి.

ఈ ఇంజిన్ 8,000 rpm వద్ద 11.0kW (15.0PS) పవర్, 6,500 rpm వద్ద 13.9 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేరియబుల్ వాల్వ్ యాక్టివేషన్ (VVA), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ట్విన్ షాక్ అబ్సార్బర్‌లు ఏరోక్స్‌కు అత్యుత్తమ పర్ఫామెన్స్, మెయింటెనెన్స్ కెపాసిటీ అందిస్తాయి. ఇవి నగర, హైవే ప్రయాణాలకు రెండింటికీ అనుకూలంగా ఉంటాయి.
ఇంకా, ఏరోక్స్ 155 వెర్షన్ ఎస్ లో ఉన్న స్మార్ట్ కీ ఫీచర్ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా సౌలభ్యం, భద్రతను పెంచుతుంది. యమహా బ్లూ స్క్వేర్ షోరూమ్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడే ఏరోక్స్ 155 వెర్షన్ ఎస్ ఐస్ ఫ్లూ వెర్మిలియన్, రేసింగ్ బ్లూ రంగుల్లో కేవలం రూ.1,53,430/- (ఎక్స్-షోరూమ్) ధరతో లభిస్తుంది.
మెటాలిక్ బ్లాక్ రంగులో ఉన్న ఏరోక్స్ 155 రూ.150,130/- (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ ఆకర్షణీయమైన అప్డేట్ అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చడానికి, వారి బ్రాండ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి యమహా నిబద్ధతను బలపరుస్తాయి. దీని ద్వారా మ్యాక్సీ-స్పోర్ట్స్ స్కూటర్ విభాగంలో మంచి వృద్ధిని చూడగలమని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








