మార్కెట్లోకి మరో కొత్త బైక్.. ఫీచర్లతో ఫిదా చేసేలా ఉంది.. ధర కూడా అందుబాటులోనే
జపాన్‌కు చెందిన ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ యమహా (yamaha), భారత మార్కెట్లో మరోసారి తన మార్క్ వేసింది. ఈసారి 2025 MT-15 Version 2.0 రూపంలో వచ్చింది. ఈ బైక్ అనేది కేవలం స్ట్రీట్ స్టైల్, పెర్ఫామెన్స్, యంగ్ యాటిట్యూడ్ అన్నీ కలిపిన ప్యాకేజీలా ఉంటుంది. ఎంటీ 15 వెర్షన్ 2.0 న్యూ మోడల్ ప్రధానంగా స్ట్రీట్ రైడింగ్ లవర్స్ కోసం రూపొందించబడింది. ఈ బైక్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 1,69,550 కాగా, ఇంకా లేటెస్ట్ ఫీచర్లు, స్పెషల్ కలర్ స్కీమ్ ఉన్న DLX వెర్షన్ ధర రూ. 1,80,500 గా ఉంది (ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు). ఈ రెండు కూడా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకత కలిగి ఉన్నాయి.
2025 అప్‌డేట్‌లో భాగంగా వచ్చిన యమహా MT-15 వెర్షన్ 2.0 బైక్ 155 సిసి లిక్విడ్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఆధారంగా రన్ అవుతుంది. ఇంజిన్‌కు వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్(VVA) టెక్నాలజీ కలదు, ఇది లో లెవెల్ RPMలోనూ, హై RPMలోనూ బైక్‌కి సమాన పనితీరు ఇస్తుంది. 10,000 rpm వద్ద 18.4 bhp శక్తిని, 7,500 rpm వద్ద 14.1 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బైక్ ట్రాఫిక్‌లోనూ, హైవే స్పీడ్‌లలోనూ రయ్ మంటూ దూసుకుపోతుంది. ఇతర స్పోర్టీ బైక్స్‌తో పోలిస్తే, MT-15 వెర్షన్ 2.0 ప్రత్యేకత ఏమిటంటే, ఇది స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో వస్తుంది. దీని వల్ల గేర్ మార్పులు ఎంతో స్మూత్‌గా జరుగుతాయి, ముఖ్యంగా డౌన్‌షిఫ్టింగ్ సమయంలో అదనపు కంట్రోల్ ఉంటుంది. అంతేకాదు, 6-స్పీడ్ గేర్‌బాక్స్ యాక్సిలరేషన్‌ను ఇంకా చక్కగా డెలివర్ చేస్తుంది. ఈ మోడల్‌లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది.
2025 యమహా MT-15 వెర్షన్ 2.0 ఇప్పుడు పూర్తిగా మరింత ఆధునికమైన మోడల్‌గా రూపుదిద్దుకుంది. ఈసారి బైక్‌కు TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. ఇది ఇదివరకు యమహా R15 లో కనిపించిన అదే యూనిట్, ఇప్పుడు MT-15లోనూ చూడొచ్చు. ఈ TFT డిస్‌ప్లేతో బైక్‌కు ఉన్నంతవరకూ టెక్ సౌకర్యాలు మరింత ముందుకు వచ్చాయి. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది.

బ్లూటూత్ ద్వారా యమహా Y-కనెక్ట్ మొబైల్ యాప్‌తో జతచేయబడుతుంది. దీనివల్ల రైడర్లు తమ స్మార్ట్‌ఫోన్ నుంచి బైక్‌ను ట్రాక్ చేయడమే కాదు, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మెసేజ్ అలర్ట్స్‌ను కూడా స్క్రీన్‌పై నేరుగా చూడొచ్చు. ఈ యాప్ ద్వారా పార్కింగ్ స్థానం గుర్తించడం, *ఫ్యూయల్ వాడకం, బైక్‌లో ఏమైనా లోపాలైతే వాటిని గమనించడం వంటి మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
ఈ అన్ని టెక్నాలజీ-బేస్డ్ అప్డేట్‌లు కొత్త తరం యువ రైడర్లను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చినవే. ప్రత్యేకంగా DLX వేరియంట్ కోసం యమహా రెండు కొత్త ఆకర్షణీయమైన కలర్స్‌ను పరిచయం చేసింది, అవి ఐస్ స్టార్మ్, వివిడ్ వైలెట్ మెటాలిక్. ఈ రంగులు బైక్‌కు మోడరన్, యూత్‌ఫుల్ లుక్‌ను తీసుకువస్తూ, రోడ్డు మీద దృష్టిని ఆకర్షించేలా చేస్తాయి. రోజువారి రైడింగ్‌కు ఇది బాగా అనుకూలంగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








