యూత్ కోసం యమహా మరో సంచలనం.. కేవలం రూ.1.17 లక్షల్లో కొత్త FZ రేవ్ అడుగుపెట్టింది!
యమహా ఎప్పటినుంచో భారతదేశంలోని యువ బైక్ రైడర్ల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తన నాణ్యత, పనితీరు, ప్రత్యేకమైన డిజైన్ ఫిలాసఫీతో ఈ బ్రాండ్ బైక్ లవర్స్‌కి ఒక కలల పేరుగా నిలిచింది. తాజాగా యమహా కంపెనీ రెండు ఆకర్షణీయమైన బైక్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అవి, రెట్రో లుక్‌తో సొగసైన XSR 155, అలాగే మరింత స్పోర్టీ డిజైన్‌తో రూపొందించిన FZ రేవ్. ఈ కొత్త FZ రేవ్ మోడల్, ఇప్పటికే ఉన్న FZ సిరీస్‌కు ఒక ప్రత్యేక అప్‌డేట్‌గా నిలుస్తోంది. భారత మార్కెట్లో రూ. 1,17,218 (ఎక్స్-షోరూమ్) ప్రారంభధరతో విడుదలైన FZ రేవ్ బైక్, స్పోర్టీ యూత్ సెక్టార్‌ను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. జపాన్ కంపెనీకి సొంతమైన ఇంజినీరింగ్ టచ్, ఆధునిక స్టైలింగ్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఈ బైక్‌లో స్పష్టంగా కనిపిస్తాయి.
మొదటి చూపులోనే దాని స్టాన్స్, మస్క్యులర్ ట్యాంక్ డిజైన్, ఎరోడైనమిక్ ఫినిష్, స్లీక్ LED లైటింగ్ రైడర్ల దృష్టిని ఆకర్షిస్తాయి. పనితీరు పరంగా, FZ రేవ్‌లో 149cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ SOHC ఇంజిన్ ఉంది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో పనిచేస్తుంది, అంటే మైలేజ్ పెరుగుతుంది. ఇది 7,250 rpm వద్ద 12.4 bhp శక్తిను, 5,500 rpm వద్ద 13.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఐదు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన ఈ పవర్‌ట్రెయిన్ సాఫ్ట్ గేర్ షిఫ్ట్‌లు, స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. యమహా ఇంజిన్ ట్యూనింగ్‌ను లీనియర్ యాక్సిలరేషన్, అధిక ఇంధన సామర్థ్యాన్ని అందించే విధంగా సెట్ చేసింది. నగర ట్రాఫిక్‌లోనైనా, హైవే రైడింగ్‌లోనైనా ఈ బైక్ సరళంగా, సౌకర్యవంతంగా రన్ అవుతుంది. అలాగే సస్పెన్షన్ సెటప్, బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా యమహా సమతుల్యంగా ట్యూన్ చేసింది.
ముందుభాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ రైడింగ్ స్థిరత్వాన్ని పెంచుతాయి. డిజైన్ పరంగా చూస్తే, FZ రేవ్ మరింత స్పోర్టీగా, యూత్ ఫ్రెండ్లీగా కనిపిస్తుంది. మెరుగైన గ్రాఫిక్స్, కొత్త కలర్ కాంబినేషన్లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ బైక్‌ను మరింత ఆధునికంగా మార్చాయి. యమహా క్లాసిక్ ఇంజినీరింగ్, ఆధ్యునిక టెక్నాలజీ కలయిక ఈ కొత్త FZ రేవ్‌లో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.

ఈ బైక్ ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ పొజిషన్ లైట్‌తో కూడిన స్పోర్టియర్ ఫుల్-LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ అమర్చబడింది, ఇది రాత్రివేళల్లో అద్భుతమైన విజిబిలిటీని అందించడంతో పాటు బైక్‌కి మరింత అగ్రెసివ్ లుక్ ఇస్తుంది. ఫ్రంట్ ప్రొఫైల్‌ను మరింత స్టైలిష్‌గా మార్చే విధంగా యమహా కాస్మెటిక్ వెంట్స్‌తో స్కల్ప్టెడ్ ఫ్యూయల్ ట్యాంక్ను రూపొందించింది. ట్యాంక్ మస్క్యులర్ ఆకృతి, దానిపై ఉన్న ఫినిష్ ఈ బైక్‌ను రోడ్డుపై ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలబెడుతుంది.
బైక్ కాంపాక్ట్ ఎగ్జాస్ట్ సిస్టమ్, సొగసైన టెయిల్ సెక్షన్ స్పోర్ట్స్ బైక్ లుక్‌ను మరింత బలోపేతం చేస్తాయి. అలాగే, యమహా FZ రేవ్‌లో అమర్చిన సింగిల్-పీస్ సీటు కంఫర్ట్‌తో పాటు కంటిన్యూయస్ డిజైన్ ఫ్లోని కూడా కలిగి ఉంది, దీని వల్ల రైడర్, పిలియన్ రెండింటికీ సౌకర్యవంతమైన అనుభవం లభిస్తుంది. ఈ బైక్‌ను కంపెనీ రెండు ఆకర్షణీయమైన రంగుల ఆప్షన్‌లలో మ్యాట్ టైటాన్, మెటాలిక్ బ్లాక్‌లలో అందిస్తోంది.

పనితీరు పరంగా కూడా ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ రైడింగ్ అనుభవాన్ని స్థిరంగా, స్మూత్‌గా ఉంచుతాయి. బ్రేకింగ్ కోసం, యమహా రెండు చక్రాలపై హైడ్రాలిక్ సింగిల్ డిస్క్ బ్రేక్‌లను అమర్చింది. అదనంగా, సింగిల్-ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) భద్రతను మరింత పెంచి, బ్రేకింగ్ సమయంలో చక్రాలు లాక్ కావడాన్ని నివారిస్తుంది.


Click it and Unblock the Notifications








