ఇలాంటి బైక్‌ను ఎప్పుడైనా చూశారా? పెట్రోల్+కరెంట్.. రెండూ కలిపిన బైక్ ఇదే

ఇటీవలి కాలంలో హైబ్రిడ్ వాహనాలు ఎక్కువ అయ్యాయి. ప్రజల నుంచి వీటికి సానుకూల స్పందన వస్తుండటంతో తయారీ దారులు సైతం ఈ దిశగా కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ప్రముఖ టూవీర్ కంపెనీ యమహా తన కొత్త MT-09 హైబ్రిడ్ బైక్‌ను పరిచయం చేసి మార్కెట్ వర్గాలనే కాకుండా ప్రజలను కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. హైబ్రిడ్ టెక్నాలజీ అనే పదం వినగానే మనకు సాధారణంగా కార్లు గుర్తొస్తాయి, ఎందుకంటే ఈ టెక్నాలజీని చాలా కాలంగా ప్రధానంగా కార్లలోనే ఉపయోగిస్తున్నారు. కానీ, టూవీలర్స్‌లో దీనిని అమలు చేయడం అంటే చిన్న విషయం కాదు. హైబ్రిడ్ వ్యవస్థకు అవసరమైన పరికరాలను బైకులో అమర్చడం అంటే సాధారణ విషయం కాదు. దీని కోసం కంపెనీ బృందం ఎంతో శ్రమ పడి ఉంటారని తెలుస్తుంది.

కంపెనీ అభివృద్ధి చేసిన SPH EV టెక్నాలజీ ద్వారా ఇది పనిచేస్తుంది. MT 09 బైక్ మోడల్ హైబ్రిడ్ టెక్నాలజీ ద్వారా రైడర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఇది ICE శక్తిని అందిస్తూనే, మరోవైపు పర్యావరణాన్ని దెబ్బతీయకుండా, ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా కార్బన్ ఉద్గారాలను విడుదల చేయకుండా రన్ అవుతుంది. యమహా MT-09 హైబ్రిడ్ బైక్‌ను పరిచయం చేయడం మోటార్ వాహన రంగంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Yamaha Mt 09 Hybrid Design

అయితే, ఇది ఎప్పుడు మార్కెట్లోకి రాబోతుందనే విషయంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇది కస్టమర్లలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే, ఈ బైక్ ఇప్పటికే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన ప్రోటోటైప్ దశలో ఉందని చెప్పేలా, యమహా ఇటీవల విడుదల చేసిన టెస్ట్ డ్రైవ్ వీడియోను చూస్తే అర్ధం అవుతుంది. బైక్ రోడ్‌పై ఎలా రన్ అవుతుందో, హైబ్రిడ్ సిస్టమ్ ఎలా పనిచేస్తోంది అన్నదానిపై ఆ వీడియోలో కనిపిస్తుంది.

హైబ్రిడ్ టెక్నాలజీ ప్రపంచంలో బైకులకు కొత్త దారులు తెరుస్తున్న ఈ ప్రయత్నంలో కంపెనీ తదుపరి అడుగులు విజయవంతం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. యమహా MT-09 హైబ్రిడ్ బైక్ సాంకేతికంగా అత్యంత ప్రత్యేకత కలిగిన మోడల్. ఇది ఇంధనం, విద్యుత్ రెండింటితోనూ నడుస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది తక్కువ మొత్తంలో కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. వాతావరణానికి హాని తక్కువ చేసే దిశగా కూడా ఇది ముందడుగు వేస్తుంది.

Yamaha Mt 09 Hybrid

కాలుష్య విడుదలను గణనీయంగా తగ్గించేలా దీని హైబ్రిడ్ వ్యవస్థ రూపొందించబడింది. ఇప్పుడు యమహా దీని ఉత్పత్తిని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని యోచిస్తోంది. మార్కెట్లోకి ఇది త్వరలోనే అడుగుపెట్టవచ్చన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి, ఎక్కువ మైలేజ్ ఆశించే వినియోగదారుల్లో ఈ బైక్‌కు మంచి ఆదరణ లభించవచ్చని భావించవచ్చు. ఎందుకంటే పెట్రోల్, బ్యాటరీ కలయికతో ఎక్కువ మైలేజ్ అందించగల సామర్థ్యం దీనికి ఉంటుంది.

ఈ బైక్ ఒక లీటరు పెట్రోల్‌కు దాదాపు 60 కి.మీ వరకూ ప్రయాణించగలదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యమహా ఇప్పటికే తన కొన్ని స్కూటర్లలో హైబ్రిడ్ ఫీచర్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టిన నేపథ్యంలో, ఈ అంచనాలకు తగ్గట్టు ఇది కూడా మంచి పనితీరును కనబరిచనుంది. దీని డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది. MT-09 హైబ్రిడ్ ముందు భాగం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంటుంది.

Yamaha Mt 09 Hybrid Engine

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, April 25, 2025, 13:27 [IST]
English summary
Yamaha new mt 09 hybrid prototype bike unveiled more details inside
Read more on: #yamaha #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+