యమహా బంపర్ ఆఫర్! స్కూటర్లు, బైక్స్‌పై 10 ఏళ్ల వారంటీ.. దశాబ్దం పాటు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు!

దేశంలో ప్రస్తుతం వాహనాల వాడకం ఏ రేంజ్‌లో ఉందో అందిరికి తెలిసిందే. ఇవి కేవలం ప్రయాణం కోసం గల అవసరాన్ని తీర్చడమే కాదు, వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా టూవీలర్ వాడకం అయితే భారీగా పెరిగింది. ఉద్యోగాలకు వెళ్లడానికి, కాలేజ్‌లు, ఇతర ఇంటి అవసరాలను తీర్చుకోవడానికి టూవీలర్ ఖచ్చితంగా ఉండాల్సిన రోజులు. అయితే వీటి మెయింటనెన్స్ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మైలేజ్ వంటి అంశాలపై దృష్టిపెట్టినప్పటికీ, నిర్వహణ ఖర్చులు, వారంటీ వంటి అంశాలు కూడా ఎంతో కీలకమైనవి. వాహనానికి ఏదైనా సమస్య తెలెత్తినప్పుడు వారంటీ ద్వారా అదనంగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా సర్వీస్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో చాలా టూవీలర్ తయారీదారులు తమ వాహనాలకు ఎక్కువ కాలం వారంటీని అందించడానికి ముందుకు వస్తున్నారు.

పెరుగుతున్న పోటీ ప్రపంచంలో కొత్త కస్లమర్లను ఆకట్టుకోవడానికి ప్రముఖ టూవీలర్ తయారీదారు అయినటువంటి హోండా తన కొన్ని మోడళ్లకు 10 సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరో ప్రసిద్ధ కంపెనీ అయినటుంటి యమహా (Yamaha) కూడా ముందుకు వచ్చి ఈ పోటీలో ఒక కీలక పాత్ర పోషించేందుకు సిద్దమవుతోంది. ఆసియా ఉపఖండంలో తన 40 ఏళ్ల ప్రయాణాన్ని జరుపుకుంటున్న యమహా కొత్త వారంటీని అందిస్తుంది.

Yamaha Offers 10 Years Warranty

ఈ సందర్భంగా తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల్లో, భారతదేశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇచ్చింది. దీనిలో భాగంగా దేశీయంగా తయారయ్యే యమహా టూవీలర్స్‌పై అంటే మేడ్ ఇన్ ఇండియా వాహనాలపై మొత్తం 10 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. దీనిలో మొదట 2 సంవత్సరాల ప్రామాణిక వారంటీ అయితే 8 సంవత్సరాల పొడిగించిన వారంటీని ఆఫర్ చేస్తుంది. ఈ మొత్తాన్ని చూసుకుంటే 10 ఏళ్ల వారంటిని ఇస్తుంది.

మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షించడంలో పొడిగించిన వారంటీ సహయపడుతుంది. యమహా తీసుకువచ్చిన ఈ పొడిగించిన భరోసా, వారు కొనుగోలు చేసే టూవీలర్‌పై విశ్వాసాన్ని పెంచుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వారంటీ అంతర్జాతీయంగా తయారైన మోడళ్లకు వర్తించదు. ఉదాహరణకు, MT-03, YZF-R3 వంటివి విదేశాల్లో తయారై, భారత్‌లో విక్రయించబడుతున్నాయి. ఇవి యమహా మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగం కాకపోవడం వల్ల, వాటిపై 10 సంవత్సరాల వారంటీ ప్రయోజనం వర్తించదు.

Yamaha Offers 10 Years Warranty On Scooters Bikes

యమహా ప్రకటించిన ఈ పొడిగించిన వారంటీ పథకం వాహనంలోని అనేక ముఖ్యమైన భాగాలకు కవరేజ్ వర్తిస్తుంది. ఇంజిన్ మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (EFI) వ్యవస్థతోపాటు అన్ని ఎలక్ట్రికల్ భాగాలు కూడా ఈ వారంటీ పరిధిలోకి వస్తాయి. అంటే, వాహనంలో అన్ని ముఖ్యమైన వ్యవస్థలపై భరోసా లభించడం అనేది సాధారణ వినియోగదారుడికి ఓ పెద్ద ఉపశమనం. దీంతో ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి.

యమహా భారతదేశంలో తన 40 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ఇంత మంచి ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇది ఎప్పటికీ అందుబాటులో ఉండే పథకం కాదు. పరిమిత కాలం మాత్రమే ఉంటుంది. ఆఫర్‌లో భాగంగా ఫాసినో 125 Fi,ఏరోక్స్ 155 వెర్షన్ S, రే Fi వంటి స్కూటర్లకు 1 లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ కల్పిస్తుండగా, FZ సిరీస్, MT-15, R15 వంటి మోటార్‌సైకిళ్లకు 1,25,000 కిలోమీటర్ల వరకు పొడిగించారు.

Yamaha Offers 10 Years Warranty On Bikes

ఈ కిలోమీటర్ల మేరకు సమస్యలు వచ్చినా యమహా సపోర్ట్ అందించనుంది. ఇంకా ఒక ముఖ్యమైన, ఉపయోగకరమైన అంశం ఏంటంటే, ఈ వారంటీ బదిలీ (ట్రాన్స్ఫరబుల్) చేయదగినది. అంటే వాహనాన్ని అమ్మిన తర్వాత కూడా, మిగిలిన వారంటీ తరువాతి యజమానికి వర్తిస్తుంది. ఇది సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో వాహన విలువను నిలబెట్టడంలో సహాయపడుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, May 16, 2025, 17:20 [IST]
English summary
Yamaha offers 10 years warranty on scooters and bikes more details inside
Read more on: #yamaha #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+