ఈ స్కూటర్ కొంటే 10ఏళ్లు ఏ టెన్షన్ ఉండదు.. 71.33 కి.మీ మైలేజీ, అదిరిపోయే ఫీచర్లు.. పైగా రూ.10వేల తగ్గింపు కూడా
జపనీస్ వాహన తయారీ సంస్థ యమహా స్కూటర్లకు భారతదేశంలో చాలా మంచి పేరుంది. మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందించే హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన స్కూటర్లను యమహా విడుదల చేస్తోంది. ఇప్పుడు కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. యమహా మోటార్ ఇండియా రే జెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ స్కూటర్ శ్రేణిపై లిమిటెడ్ టైం ఆఫర్లను ప్రకటించింది.
కంపెనీ 70వ వార్షికోత్సవం సందర్భంగా రూ.10,000వరకు ధర తగ్గింపును అందిస్తోంది. ఈ ధర తగ్గింపు ఆన్‌రోడ్ ధరలో లభిస్తుంది. దీనితో పాటు, వినియోగదారులకు 10సంవత్సరాల వారంటీ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంటుంది. యమహా స్కూటర్ రెగ్యులర్, స్ట్రీట్ ర్యాలీ అనే రెండు వేరియంట్‌లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరలో రూ.7,000తగ్గింపు వస్తుంది. ప్రాంతం, వేరియంట్‌ను బట్టి, ఆన్‌రోడ్ ధరలో దాదాపు రూ.10,000వరకు ఆదా చేసుకోవచ్చు.

లిమిటెడ్ టైం ఆఫర్‌లో భాగంగా, యమహా రే జెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ వేరియంట్‌ల ఎక్స్-షోరూమ్ ధరలను అప్‌డేట్ చేశారు. డ్రమ్ వేరియంట్ ధర రూ.79,340. డిస్క్ వేరియంట్ ధర రూ.86,430, టాప్ ఎండ్ రే జెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ స్ట్రీట్ ర్యాలీ ధర రూ.92,970. ధర తగ్గించడంతో పాటు, కంపెనీ రే జెడ్ఆర్ స్కూటర్‌కు 10 సంవత్సరాల టోటల్ వారంటీని కూడా అందిస్తోంది.
ఈ 10 సంవత్సరాల వారంటీలో 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ, 8 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ లభిస్తుంది. ఇంజిన్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్ వంటి ముఖ్యమైన భాగాలు అన్నీ ఇందులో కవర్ చేయబడతాయి. లక్ష కిలోమీటర్ల వరకు ఈ వారంటీ అందుబాటులో ఉంటుంది. ఈ వెహికిల్‌ను అమ్మినట్లయితే, ఈ వారంటీని కొత్త యజమాని పేరుకు బదిలీ చేయవచ్చు అనేది మరో హైలైట్.

యమహా రే జెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ స్కూటర్ గురించి చెప్పాలంటే... ఇందులో 125 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఈ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.2 బిహెచ్‌పి పవర్‌ను, 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
దీనిలోని హైబ్రిడ్ పవర్ అసిస్ట్ సిస్టమ్ స్టార్టింగ్ సమయంలో ఎక్కువ టార్క్ అందిస్తుంది. సైలెంట్ స్టార్టప్, మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం స్మార్ట్ మోటార్ జనరేటర్‌ను కూడా ఇందులో ఉపయోగించారు. యమహా రే జెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ స్కూటర్ ఏఆర్ఏఐ క్లెయిమ్ చేసిన మైలేజ్ లీటరుకు 71.33 కిలోమీటర్లు.

ఇతర సైకిల్ పార్ట్‌లను చూస్తే, సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో యూనిట్ స్వింగ్ అందించారు. వేరియంట్‌లను బట్టి, ముందు భాగంలో డ్రమ్ లేదా డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఈ స్కూటర్ 12 అంగుళాల ముందు, 10 అంగుళాల వెనుక టైర్లతో వస్తుంది. ఈ టైర్లు ట్యూబ్‌లెస్ రకానికి చెందినవి.
మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం ఆటోమేటిక్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్, సేఫ్టీ కోసం సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ స్విచ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లను రే జెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ స్కూటర్‌లో యమహా అందించింది.
సెలక్ట్ చేసుకున్న వేరియంట్‌లలో వై-కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. వై-కనెక్ట్ ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేస్తే, ఇంధన వినియోగాన్ని ట్రాక్ చేయవచ్చు, కాల్ అలెర్ట్‌లు, మెయింటెనెన్స్ అప్‌డేట్‌లు, పార్కింగ్ లొకేషన్ రిమైండర్‌లు వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.
యమహా రే జెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ స్కూటర్ శ్రేణికి లభిస్తున్న ఈ లిమిటెడ్ టైం ఆఫర్లు వినియోగదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ధర తగ్గింపుతో పాటు 10ఏళ్ల వారంటీ ఈ స్కూటర్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. ఈ స్కూటర్ కొన్న తర్వాత 10 సంవత్సరాల పాటు మీరు ప్రశాంతంగా నడుపుకోవచ్చు.
యమహా రే జెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ స్కూటర్ అందించే 71.33 కి.మీ. మైలేజ్, రూ.10,000 తగ్గింపు, ముఖ్యంగా 10ఏళ్ల వారంటీ ప్యాకేజీ వినియోగదారులకు చాలా మంచి డీల్. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఇంత మంచి మైలేజీనిచ్చే స్కూటర్, పైగా అదనపు వారంటీతో రావడం నిజంగా గొప్ప విషయం.


Click it and Unblock the Notifications








