71.33KM మైలేజ్ స్కూటర్.. ఒక్కనెలలో 22,738 మంది షోరూమ్‌ల ముందు క్యూకట్టారు
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు యమహా (yamaha) భారత మార్కెట్లో ఎప్పుడూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. స్పోర్టీ డిజైన్, నమ్మకమైన పనితీరు, యువతను ఆకట్టుకునే స్టైలింగ్ ఇవి యమహా పేరుని ప్రత్యేకంగా నిలబెడతాయి. అలాంటి కంపెనీకి చెందిన స్కూటర్లలో రే ZR (ray zr 125) హైబ్రిడ్ ఎప్పటినుంచో యంగ్ జనరేషన్‌కి ఫేవరెట్. అయితే ఈసారి ఈ స్కూటర్ అందరినీ షాక్‌కి గురిచేస్తూ అమ్మకాలలో అద్భుతమైన రికార్డ్ నెలకొల్పింది. 2025 అక్టోబర్ నెల యమహా రే ZR కోసం నిజంగా గుడ్ న్యూస్ మంత్‌గా మారింది. ఒక్క నెలలోనే ఈ స్కూటర్ 23.23% అనే భారీ అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. యమహా డీలర్‌షిప్‌లు ఈ సారి అసలు తీరిక లేకుండా పోయాయి.
గత నెలలో మొత్తం 22,738 యూనిట్ల రే ZR స్కూటర్లు మార్కెట్‌లోకి వెళ్ళాయి. ఈ సంఖ్యను గత ఏడాది అక్టోబర్‌తో పోల్చితే మరింత స్పష్టంగా తెలుస్తుంది, అప్పుడు అమ్ముడైన యూనిట్లు 18,451 మాత్రమే. ఈసారి యమహా 4,287 స్కూటర్లు అదనంగా విక్రయించడం పెద్ద విజయమే. ఈ పెరుగుదల వెనుక చాలా కారణాలు ఉన్నాయి. యమహా ఎప్పటికప్పుడూ తన డిజైన్‌ను, పనితీరును, ఫీచర్లను యువత ఆశించే విధంగా అప్‌డేట్ చేస్తూ ఉంటుంది.

రే ZR కూడా స్పోర్టీ లుక్, లైట్‌వెయిట్ డిజైన్, మంచి మైలేజ్, పంచ్ ఇచ్చే ఇంజిన్ పరఫార్మెన్స్‌తో మార్కెట్లో ధూళి దులిపేస్తుంది. అందుకే స్కూటర్‌ను ఎంచుకునే యువత, కాలేజ్ స్టూడెంట్స్, అలాగే సిటీ రైడింగ్ చేసే వర్కింగ్ జనరేషన్ కూడా దీన్ని ఓ బెస్ట్ ఆప్షన్‌గా చూస్తున్నారు. ఈ సారి అమ్మకాల గ్రోత్ నుంచి స్పష్టంగా తెలుస్తోంది.. రే ZR మార్కెట్‌లో తన ఊపును మళ్లీ అందుకుంది.
యమహా రే ZR హైబ్రిడ్ స్కూటర్ భారత మార్కెట్లో 125cc సెగ్మెంట్‌లో బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్‌గా నిలుస్తోంది. రూ.75,326 నుండి రూ.87,450 (ఎక్స్-షోరూమ్) ధర వరకు అందుబాటులో ఉండటం దీన్ని ఈ విభాగంలో అత్యంత చౌకైన 125cc స్కూటర్లలో ఒకటిగా నిలబెడుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్, మంచి పనితీరు కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. ఈ స్కూటర్ ఇంజిన్‌లో ఉన్నది E20 ఫ్యూయల్‌కు అనుకూలమైన 125cc ఫ్యూయల్-ఇంజెక్షన్ ఇంజిన్.

రోజువారీ ప్రయాణాల్లో స్మూత్‌గా స్పందించే ఈ ఇంజిన్, CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కలిసి పని చేస్తూ 8 bhp పవర్, 10.3 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 2025 మోడల్ రే ZRలో యమహా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌గా ఎన్‌హాన్స్‌డ్ పవర్ అసిస్ట్ ఫంక్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇది స్కూటర్‌ను లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇద్దరు కలిసి ప్రయాణిస్తుంటే లేదా కొండలు ఎక్కేటప్పుడు అదనపు త్వరణాన్ని అందిస్తుంది.
హైబ్రిడ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG). ఈ వ్యవస్థ స్కూటర్‌ను నిశ్శబ్దంగా స్టార్ట్ చేయడమే కాకుండా, ఇంధన సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఫలితంగా దీని మైలేజ్ గణనీయంగా పెరుగుతుంది. ARAI క్లెయిమ్ చేసిన 71.33 kmpl మైలేజ్. ఈ మైలేజ్ ఫిగర్ 125cc సెగ్మెంట్‌లో యమహా రే ZR హైబ్రిడ్‌ను అత్యంత ఆకర్షణీయమైన స్కూటర్‌గా నిలబెడుతోంది.
యమహా రే ZR హైబ్రిడ్ స్కూటర్ కొత్తగా జోడించిన TFT డిజిటల్ కన్సోల్ స్కూటర్‌కు పూర్తిగా ప్రీమియం ఫీల్‌ను తీసుకువస్తుంది. ఈ ఆధునిక డిస్‌ప్లేలో బ్లూటూత్ కనెక్టివిటీ ఉండడంతో, రైడర్ తన మొబైల్‌ను స్కూటర్‌తో సులభంగా జత చేసి ఉపయోగించుకోవచ్చు. అదే కాకుండా యమహా ఈ కన్సోల్‌ను గూగుల్ మ్యాప్స్-ఆధారిత టర్న్-బై-టర్న్ నావిగేషన్ సపోర్ట్‌తో అందించింది.


Click it and Unblock the Notifications








