Yamaha RX100: ఆర్‌ఎక్స్ 100 లవర్స్‌కు బిగ్ గుడ్‌న్యూస్.. ఆటో ఎక్స్‌పోలో యూత్ కలల బైక్.. పాత రోజులు వచ్చేశాయ్
దేశరాజధాని ఢిల్లీలో అత్యంత వైభవంగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో కార్యక్రమంలో టూవీలర్ తయారీదారులు తమ మోడళ్లను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ యమహా (Yamaha)కూడా తన ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యం విషయం ఏమిటంటే కంపెనీ టూవీలర్లలో ఒక మోడల్ అందరినీ ఆకట్టుకుంటుంది. అదే దేశంలోని అందరి యూత్ కలల బైక్ ఆర్‌ఎక్స్ 100 (RX100). ఇది 1980,90ల కాలంలో భారత దేశ రోడ్లపై ఒక తిరుగులేని బైక్. దీని ధాటికి మిగతా కంపెనీలకు చెందిన వాహనాలు విలవిల్లాడి పోయాయి. అప్పట్లో అమ్మకాల పరంగా సంచలనాలు క్రియేట్ చేసిన ఈ బైక్ 1985లో మార్కెట్లోకి అడుగుపెట్టింది. విడుదల అయిన అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా ఇది హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది. ప్రధానంగా దీని సైలెన్సర్ నుంచి వచ్చే సౌండ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
యూత్ ఎక్కువగా దీన్ని ఇష్టపడటానికి దాని సౌండ్ మెయిన్ అట్రాక్షన్. ఈ బైక్‌పై రోడ్లపై వెళ్తుంటే ఆ మజాయే వేరే లెవల్‌లో ఉంటుంది. చుట్టూ ప్రక్కన ఉన్నటువంటి అందరి చూపు కూడా దీనిపైనే ఉంటుంది. RX 100 అంటే అంత స్పెషల్ బైక్. కొంత కాలం వరకు ఉత్పత్తిని కొనసాగించిన యమహా కంపెనీ ఆ తర్వాత పలు కారణాల వలన 1996 తర్వాత నుంచి దాన్ని నిలిపివేసింది.

అయినప్పటికీ కూడా ఈ బైక్ ఇప్పటికి మార్కెట్లో కనిపిస్తుంది. పాత వాటిని లేటెస్ట్‌గా మారుస్తూ సెకండ్ హ్యండ్‌లో పలువురు విక్రయిస్తున్నారు. అయితే కొత్త మోడల్ RX 100 మార్కెట్లోకి వస్తుందని చాలా కాలంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ బైక్ తిరిగి విడుదల కాబోతుంది అని చాలా వార్తలు సోషల్ మీడియాలో కూడా వచ్చాయి. అయితే బైక్ వస్తుందని పలు వార్తలు వచ్చినప్పటికి అవన్నీ ఊహాగాణాలుగానే ఉన్నాయి.
గతంలో యమహా కంపెనీ ఇండియా విభాగం అధిపతి కూడా RX 100ను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకురాబోతున్నారని ఒక మీడియా సమావేశంలో కూడా ప్రకటించారు. దానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు. ఇంత కాలం వెయిట్ చేసిన ఆర్‌ఎక్స్ 100 అభిమానులకు ఇప్పుడు పెద్ద గుడ్‌న్యూస్. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో కార్యక్రమంలో RX 100ను కంపెనీ ప్రదర్శించింది. దీంతో ఇది త్వరలోనే తిరిగి మార్కెట్లోకి రాబోతుంది.

కొత్తగా వస్తున్న ఈ బైకులో కంపెనీ చాలా మార్పులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దీన్ని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఇంజిన్‌లో కొత్త అప్‌డేట్స్ ఉంటాయి. కూలింగ్ సిస్థం, గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ వంటి వాటిలో ప్రధాన మార్పులు ఉంటాయి. ఆటో ఎక్స్‌పోలో కనిపించిన మోడల్‌ను చూసినట్లయితే దాని పాత డిజైన్ మాదిరిగానే ఉన్నట్టు అర్థం అవుతుంది. కేవలం ఇంజిన్‌లో మాత్రమే మార్పులు ఉంటాయని తెలుస్తుంది.
ప్రధానంగా పాత మోడల్ సౌండ్‌కు పెట్టింది పేరు. అయితే కొత్త దానిలో అది ఉండకపోవచ్చని తెలుస్తుంది. అయితే ఈ బైక్‌లో సౌండ్ మెయిన్ అట్రాక్షన్, అలాంటిది కొత్త మోడల్‌లో ఉందో లెదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అది త్వరలోనే RX 100 మార్కెట్లోకి తిరిగి ఎంట్రీ ఇస్తుంది. ఇది మార్కెట్లోకి విడుదల అయిన తరువాత అమ్మకాల్లో సరికొత్త గణాంకాలను నమోదు చేసే అవకాశం ఉంది.

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం మా డ్రైవ్‌స్పార్క్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








