పెట్రోల్‌తో పాటు కరెంట్‌తో నడిచే యమహా హైబ్రిడ్ బైక్.. ట్రిపుల్ బూస్ట్‌తో హై స్పీడ్ రైడ్‌..

ప్రపంచవ్యాప్తంగా హైబ్రిడ్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇవి మంచి మైలేజ్ ఇవ్వడంతో పాటు నిర్వహణ ఖర్చు కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. అందుకే కొత్తగా వాహనాలను ఇంటికి తెచ్చుకోవాలని అనుకునేవారు హైబ్రిడ్ మోడళ్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో తయారీదారులు కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన హైబ్రిడ్ కార్లను విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే ఫీచర్‌తో టూవీలర్స్‌ను సైతం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ యమహా (yamaha) కొత్తగా xmax సిరీస్‌లో SHEV అనే హైబ్రిడ్ బైక్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీన్ని ప్రపంచమార్కెట్లో కాన్సెప్ట్ మోడల్‌గా ఆవిష్కరించింది. కార్లలో విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ టెక్నాలజీ ఇప్పుడు టూవీలర్ సెగ్మెంట్‌లోకి మారింది.

యమహా xmax SHEV హైబ్రిడ్ బైక్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటారు రెండింటి ద్వారా శక్తిని పొందుతుంది. దీన్ని త్వరలో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ బైక్‌కు సంబంధించిన టీజర్ వీడియోను కూడా ఇటీవల షేర్ చేసింది. దీన్ని చూసినట్లయితే ఇది బైక్ అలాగే స్కూటర్ రెండింటి కలయికగా ఉన్నట్లు తెలుస్తుంది. సైడ్ నుంచి ప్రత్యేకమైన డిజైన్‌తో కనిపిస్తుంది.

Yamaha Xmax Series Hybrid Bike Concept Model

ఈ బైక్‌లో రైడర్ కాళ్ల కింది భాగంలో బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తుంది. రెండు ఎలక్ట్రిక్ మోటార్లను, ఒక ఐసీఈ ఇంజిన్‌ను అమర్చారు. ఈ హైబ్రిడ్ సిస్టంను రైడర్లు రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఇది రెండు ప్రత్యేకమైన మోడ్స్‌తో లభిస్తుంది. 'డ్యూయల్ బూస్ట్' ఆప్షన్ ద్వారా ఇంధనంతో పాటు, వెనుక వీల్‌పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటారుతో మాత్రమే శక్తిని పొందుతుంది. దీని ద్వారా బైక్ స్పీడ్ మధ్యస్థంగా ఉంటుందని తెలుస్తుంది.

అదే మరింత వేగం కావాలంటే ట్రిపుల్ బూస్ట్ మోడ్ ఇంజిన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఆప్షన్‌లో వెనుక వీల్‌పై అమర్చిన మోటార్‌తో పాటు క్రాంక్ షాఫ్ట్‌పై ఉన్నటువంటి మోటార్ జనరేటర్‌ తన శక్తిని ఉత్పత్తి చేసి వాహనాన్ని మరింత వేగంతో దూసుకుపోయేలా చేస్తుంది. ఈ మోడ్‌లో మూడు రెట్లు సామర్థ్యాన్ని బైక్ పొందుతుంది. దీంతో స్పోర్ట్స్ బైక్‌లతో సమానమైన హై స్పీడ్ రైడ్‌ను పొందుతారని అధికారులు తెలిపారు.

Yamaha Xmax Series Hybrid Bike

యమహా xmax SHEV సింగిల్ సిలిండర్ పెట్రోల్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్‌తో రన్ అవుతుంది. ఇది మార్కెట్లో సంచలన మోడల్ అవుతుంది. కాన్సెప్ట్‌ మోడల్‌గా దీన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో ఫీచర్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఇంజిన్ కెపాసిటీ ఏ మేరకు ఉంటుందో కూడా పేర్కొనలేదు. ఇది ప్రతిరోజు మనం సాధారణంగా ఉపయోగించే టూవీలర్ లాగానే ఉంటుంది. పెట్రోల్, ఈవీ శక్తి రెండింటిని ఉపయోగించుకుంటుంది.

మా డ్రైవ్‌స్పార్క్ అంచనాల ప్రకారం, ఈ హైబ్రిడ్ బైక్ లీటరుకు 80 నుండి 100 కి.మీ మైలేజీని అందిస్తుందని అనుకుంటున్నాం. అయితే కంపెనీ నుంచి యమహా xmax SHEV గురించి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఏం చెప్పలేం. దీన్ని ప్రపంచమార్కెట్లతో పాటు భారతదేశంలో కూడా విడుదల అవుతుంతదని అంచనా. ఒకవేళ దేశంలో ఈ హైబ్రిడ్ బైక్ విడుదల అయితే ఇది సంచలన మోడల్ అవుతుందని మాత్రం తెలుస్తుంది.

Yamaha Xmax Series

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, February 28, 2025, 15:00 [IST]
English summary
Yamaha xmax series hybrid bike concept showcased and the teaser video revealed
Read more on: #yamaha #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+