తక్కువ జీతం ఉన్న వాళ్లు కూడా కొనగలిగే 125సీసీ బైక్స్ ఇవే.. లో మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజ్
జీఎస్టీ తగ్గింపు తర్వాత భారతదేశంలో 125 సీసీ సెగ్మెంట్ బైక్‌లను కొనుగోలు చేయడం గతంలో కంటే మరింత చౌకగా మారింది. తక్కువ జీతం ఉన్నవారు కూడా సులభంగా కొనగలిగేలా ధర తక్కువగా ఉండి, మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువగా ఉండే 5 అద్భుతమైన 125సీసీ బైక్‌ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇవి మంచి మైలేజీని కూడా ఇస్తాయి.
టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125)
ఈ జాబితాలో మొదటి బైక్ టీవీఎస్ రైడర్. స్పోర్టీ డిజైన్‌తో పాటు మోడ్రన్ ఫీచర్స్ ఇష్టపడేవారికి ఈ బైక్ బాగా నచ్చుతుంది. టీవీఎస్ రైడర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 80,500 నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్‌లో 124.8సీసీ, 3-వాల్వ్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 11.2 బీహెచ్‌పీ పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా షైన్ (Honda Shine)
హోండా షైన్ (Honda Shine) భారతదేశంలో 125సీసీ విభాగంలో బాగా ప్రాచుర్యం పొందిన బైక్. దీని ధర డ్రమ్ వేరియంట్‌కు రూ. 78,538 (ఎక్స్-షోరూమ్) నుండి, డిస్క్ వేరియంట్‌కు రూ. 82,898 నుండి మొదలవుతుంది. ఈ బైక్ 123.94సీసీ ఇంజిన్‌తో వస్తుంది, ఇది 10.59 బీహెచ్‌పీ పవర్, 11 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. హోండా షైన్ మైలేజ్ దాదాపు 55-65 కిలోమీటర్లు వరకు ఉంటుంది, ఇది ఇంధనాన్ని ఆదా చేసే బైక్‌గా నిలుస్తుంది.

హోండా ఎస్‌పీ 125 (Honda SP 125)
మూడవ బైక్ హోండా ఎస్‌పీ 125. ఇది స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, లేటెస్ట్ ఫీచర్లతో వస్తుంది. జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈ బైక్ ధర ఇప్పుడు రూ. 85,564 నుండి ప్రారంభమవుతుంది. దీని 123.94సీసీ ఇంజిన్ 10.72 బీహెచ్‌పీ పవర్, 10.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ఇది చాలా ఈజీ రైడ్ అందిస్తుంది.

బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125)
నాల్గవ బైక్ బజాజ్ పల్సర్ 125 . ఇది స్టైలిష్, చవకైన బైక్. ఇందులో 124.4సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ బైక్ గరిష్టంగా 11.8 పీఎస్ పవర్, 10.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ధర ఇప్పుడు రూ. 77,295 నుండి మొదలవుతుంది.

హీరో గ్లామర్ ఎక్స్ 125 (Hero Glamour X125)
ఐదవ బైక్ హీరో గ్లామర్ ఎక్స్ 125. ఇది స్టైలిష్, పవర్ఫుల్ 125సీసీ కమ్యూటర్ బైక్. ఈ బైక్‌లో 124.7సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ 4-స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది. ఇది 11.5 పవర్, 10.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ధర రూ. 80,510 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

పైన చెప్పిన బైక్స్ అన్నీ కూడా రూ.80లోపు లభించే బైకులే. అన్నింటిలోనూ అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే మీ అవసరాలు, బడ్జెట్ అనుగుణంగా కావాల్సిన బైక్ ఎంచుకోండి. ఈ విధంగా జీఎస్టీ తగ్గింపు తర్వాత మరింత సరసమైన ధరల్లో లభిస్తున్న ఈ 125సీసీ బైక్‌లు.. మంచి మైలేజీ, తక్కువ నిర్వహణ ఖర్చుతో, ప్రతి ఒక్కరి జేబుకు అందుబాటులో ఉంటూ, నిత్యం ప్రయాణించే వారికి ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి అనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications








