సాధ్యం కాదనుకున్న పనిని సాధించిన యువకుడు.. ఇంట్లోనే నిర్మించిన అద్భుత బైక్!

నేటి భారతీయ యువత ప్రతిభ, సృజనాత్మకత, పట్టుదల ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి చేరుకున్నాయి. చదువులోనూ, టెక్నాలజీలోనూ, ఆవిష్కరణల్లోనూ వారు చూపిస్తున్న ప్రతిభ అనేక దేశాలలో అనేక రంగాలలో ప్రకాశిస్తోంది. మనం తరచూ వార్తాపత్రికలలో లేదా సోషల్ మీడియాలో, గ్యారేజీల్లో, చిన్న వర్క్‌షాప్‌లలో, లేదా ఇంటి వెనుక ప్రాంగణంలోనే తయారైన వినూత్న కార్లు, బైక్‌లు చూసే ఉంటాం. కానీ, ఈ సారి వెలుగులోకి వచ్చిన కథ మాత్రం అందులో ప్రత్యేకం. ఎందుకంటే ఇది కేవలం ఒక బైక్ కాదు, భారతీయ ఇంజనీర్‌ ప్రతిభకు నిదర్శనం. ఒక యువకుడు తన సొంత ఇంట్లోనే, పూర్తిగా పనిచేసే హబ్‌లెస్ ఎలక్ట్రిక్ బైకును డిజైన్ చేసి, నిర్మించగలిగాడు. వీల్స్‌కు సాంప్రదాయ హబ్ లేకుండా ఉండే ఈ డిజైన్, భవిష్యత్తు వాహనాల రూపకల్పనను తలపిస్తుంది.

ఈ బైక్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, దేశం నలుమూలల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో చూసే ప్రతి ఒక్కరికీ ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది, ఎందుకంటే ఇంత క్లిష్టమైన డిజైన్, అంతకంటే క్లిష్టమైన టెక్నాలజీని, పెద్ద కంపెనీల సపోర్ట్ లేకుండా, ఒక్క ఇంటి వర్క్‌షాప్‌లోనే సాకారం చేయడం నిజంగా గర్వించదగిన విషయం. ప్రస్తుతం ఈ బైక్‌కు సంబంధించిన కథనం creative science య్యూట్యూబ్ ఛానల్‌లో వైరల్ అవుతుంది.

Young Indian Youtuber Built A Futuristic Designed Electric Bike

ఈ హబ్‌లెస్ ఎలక్ట్రిక్ బైక్‌ డిజైన్ చూస్తేనే, ఇది సాధారణ బైక్‌లా కాదని వెంటనే గుర్తించవచ్చు. రోడ్డు మీద నిటారుగా కూర్చుని నడిపే బైక్‌ల మాదిరిగా కాకుండా, ఈ బైక్‌పై ప్రయాణం చేయాలంటే రైడర్‌ దాదాపు పడుకున్నట్లుగా ఉండాలి. శరీరాన్ని ముందుకు వంచి, తల కొద్దిగా తక్కువగా పెట్టుకుని నడపాల్సి వస్తుంది. దీని వలన ఇది చూడ్డానికి కూడా భవిష్యత్తు వాహనంలా అనిపిస్తుంది.

సాధారణ బైక్‌లలో రెండు చక్రాలు భూమిని తాకుతాయి, ఇది కూడా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, మూడవ చక్రం మాదిరిగా కనిపించే నిర్మాణంలోనే ఎలక్ట్రిక్ మోటారు, బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ భాగం బైక్‌కు ప్రాణం పోసే హృదయం లాంటిది. భూమిని తాకే రెండు ప్రధాన చక్రాలు ట్రక్కు చక్రాల మాదిరిగా చాలా వెడల్పుగా ఉండటం వల్ల, బైక్‌కు అదనపు స్థిరత్వం వస్తుంది.

Young Indian Youtuber Built A Futuristic Designed Electric Bike

ఈ బైక్‌లో ఉపయోగించిన చక్రాలను కూడా ఆ యువకుడు తన స్నేహితులతో కలిసి, పూర్తిగా సొంతంగా డిజైన్ చేసి తయారు చేశాడు. బైక్‌ను నిర్మించే సమయంలో, వారు మొదట ఇనుప పైపులతో బలమైన ప్లాట్‌ఫామ్‌ను తయారు చేసి, దాని మీద బైక్‌ ఫ్రేమ్‌ను కొంచెం ఎత్తులో ఉంచి అసెంబ్లీ చేశారు. ముందు, వెనుక చక్రాలను కలిపేందుకు బలమైన దీర్ఘచతురస్రాకార స్టీల్ ట్యూబ్‌లను ఉపయోగించడం వల్ల నిర్మాణం మరింత దృఢంగా మారింది.

బైక్‌లోని ఛాసిస్ ఆకారం రౌండ్ షేపులో ఉండి, అందులో బ్యాటరీలు మూడు లేయర్‌లుగా అమర్చబడ్డాయి. దీని వల్ల బరువు సమానంగా విభజించబడటమే కాకుండా, బైక్‌కు సమతుల్యం కూడా వస్తుంది. అయితే, ప్రతి బ్యాటరీ సెల్ సామర్థ్యం ఎంతన్నది మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. ఈ బైకును రోడ్డుపై నడిపి అందరికి చూపించారు. అతని ప్రతిభను అందరు మెచ్చుకుంటున్నారు.

Young Indian Youtuber Built A Futuristic Designed Electric Bike

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Sunday, August 10, 2025, 9:10 [IST]
English summary
Young indian youtuber built a futuristic designed electric bike more details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+