Yamaha RD 350: పాత రోజులు మళ్లీ వస్తున్నాయ్! ఆటో ఎక్స్‌పో‌లో ఇండియాలోనే మోస్ట్ డిమాండ్ బైక్ రాజ్‌దూత్

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో వాహన తయారీ దారులు తమ మోడళ్లను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో కార్స్, బైక్స్, వాణిజ్య వాహనాలు ఇతర వాటిని అందరికీ పరిచయం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో 1980, 90ల కాలం నాటి రోజులను గుర్తు చేస్తూ ఒకప్పుడు భారతదేశ రోడ్లను శాసించిన బైక్స్‌ను దర్శనిమిస్తున్నాయి. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ యమహా (Yamaha)కు చెందినటువంటి ఆర్‌డీ 350 (RD 350) బైక్ ఈ షోలో సందర్శకులను కనువిందు చేస్తుంది. దీనిని చూసిన చాలా మంది కూడా తమ పాత రోజులు గుర్తచ్చాయ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా దీని పేరు రాజ్‌దూత్ 350. కానీ అందరు కూడా ఆర్‌డీ 350 అని పిలుస్తారు. ఇది ఒకప్పుడు అందరి కలల బైక్. దీంతో రోడ్లపై వెళ్తుంటే, అందరి చూపు కూడా దీని మీదే ఉండేది.

ప్రస్తుతం ఉన్న జనరేషన్‌కు దీని డిమాండ్ గురించి అంతగా తెలియదు. అదే అప్పటి కాలం వారు దీన్ని ఒక్కసారైనా నడపాలని కలలు కనేవారు. ఇది ఇప్పుడు అందుబాటులో లేదు. ఇది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కొందరు అయితే ఈ బైక్ కోసం కంపెనీ షోరూమ్‌‌ను తరచుగా సందర్శించిన వారు కూడా ఉన్నారు. కంపెనీ కూడా త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని పలు మార్లు ప్రకటించింది.

Yamaha Rd 350 Bike

ఇంతటి డిమాండ్ ఉన్న RD 350 బైక్‌ను యమహా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శనకు ఉంచింది. యమహా RX 100తో పాటే ఇది ఉంది. బైక్ లవర్స్‌కు దీనిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బైక్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారు ఆటో ఎక్స్‌లో కనిపించడంతో ఎగిరి గంతెస్తున్నారు. దీని అందమైన రూపం ఇప్పటికి కూడా అలాగే ఉంది.

ఈవెంట్‌లో రాజ్‌దూత్ 350 రాజు లాగా నిలబడి ఉంది. అయితే ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే యమహా ఈ బైకును తిరిగి లాంచ్ చేసి వినియోగదారులకు విక్రయించడానికి తీసుకొస్తుందా లేదా కేవలం ఆటో ఎక్స్‌పో ప్రదర్శనకు మాత్రమే ఉంచిందా అనే దానిపై స్పష్టమైన సమాచారం తెలియరాలేదు. అయితే యమహా RX 100, RD 350 బైక్స్ 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రదర్శనకు ఉన్నాయని మాత్రం తెలుసు.

Yamaha Rd 350 Bike Launch

ఇదే అదునుగా వీటిని తిరిగి లాంచ్ చేసే అవకాశాలు కూడా బొలేడు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా అట్టహసంగా జరుగుతున్న ఆటో ఎక్స్‌పోలో రాజ్‌దూత్ 350 మెయిన్ అట్రాక్షన్‌గా ఉంది. దీని అధికారిక లాంచ్ గురించి తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాక తప్పదు. ఇదిలా ఉంటే RD 350 ఇండియాలో బైక్‌ లవర్స్‌కు అత్యంత ఇష్టమైన మోడల్. ఇది 1973, 1975 మధ్య ఉత్పత్తి చేయబడింది.

లైసెన్స్ పొందిన వెర్షన్‌ను రాజ్‌దూత్ 350 పేరుతో ఎస్కార్ట్స్ గ్రూప్ తయారు చేసింది. ఇది ఇండియాలో మొట్టమొదటగా నిర్మించిన స్పోర్టింగ్ బైక్. ఇది 347 సీసీ ఇంజిన్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ బైక్‌ పెర్ఫామెన్స్‌కు పెట్టింది పేరు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అత్యంత ఇష్టమైన బైక్స్‌లలో ఇది నంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఇది ఇప్పటికీ ఆయన వద్ద ఉంది.

Yamaha Rd 350 Bike Design

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం మా డ్రైవ్‌స్పార్క్‌ సోషల్‌ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 21, 2025, 12:20 [IST]
English summary
Youth favourite bike yamaha rd 350 showcased in bharat mobility global expo 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+