కేవలం రూ.54వేలకే 130కిమీ రేంజ్.. స్టూడెంట్లు, ఉద్యోగులకు డబ్బులు భారీగా ఆదా చేసే స్కూటర్ వచ్చేసింది

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ జెల్యో ఇ మొబిలిటీ తమ పాపులర్ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రేసీ ప్లస్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త గ్రేసీ+, సిటీ ప్రయాణాలకు అనుగుణంగా రూపొందించబడింది. ఇది మెరుగైన పర్ఫామెన్స్, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందజేస్తుంది.

విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు ఇది చాలా మంచి ఆప్షన్ అని కంపెనీ చెబుతోంది. ఇది స్మార్ట్, స్థిరమైన, సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అని జెల్యో ఇ మొబిలిటీ పేర్కొంది. కొత్త గ్రేసీ+ సిటీ ప్రయాణ అవసరాలను తీర్చడానికి మొత్తం ఆరు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధరలు రూ.54,000 నుండి మొదలవుతాయి. ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీ అందిస్తున్నారు.

ZELIO E Gracy

60V/30AH వేరియంట్ ధర రూ.65,000. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీ. రేంజ్ వస్తుంది. 74V/32AH వేరియంట్ ధర రూ.69,500. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కి.మీ. రేంజ్ వస్తుంది. 60V/32AHవేరియంట్ ధర రూ.54,000. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ. రేంజ్ వస్తుంది.

60V/42AH వేరియంట్ ధర రూ.58,000. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ. రేంజ్ వస్తుంది. 72V/32AH వేరియంట్ ధర రూ.56,500. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ. రేంజ్ వస్తుంది. 72V/42AH వేరియంట్ ధర రూ.61,000. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కి.మీ. రేంజ్ వస్తుంది.

ZELIO E Gracy

కొత్త ఫేస్‌లిఫ్టెడ్ గ్రేసీ+ గంటకు 25 కి.మీ. టాప్ స్పీడ్ కలిగి ఉంది. ఒక్క ఛార్జ్‌తో 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇది 60/72V BLDC మోటార్‌తో పనిచేస్తుంది. ఈ మోటార్‌కు పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 1.8 యూనిట్ల విద్యుత్ మాత్రమే అవసరం అవుతుంది.

ఈ స్కూటర్ ఇప్పుడు 180 మి.మీ. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‎ను, 88 కిలోల మొత్తం బరువును, 150 కిలోల పేలోడ్ కెపాసిటీని కలిగి ఉంది. ఛార్జింగ్ సమయం బ్యాటరీ రకాన్ని బట్టి మారుతుంది. లిథియం-అయాన్ వేరియంట్లు 4 గంటల్లో ఛార్జ్ అవుతాయి. అయితే జెల్ బ్యాటరీ మోడళ్లు 8 నుండి 12 గంటల్లో ఛార్జ్ అవుతాయి.

ఫేస్‌లిఫ్టెడ్ గ్రేసీ+ ముందు చక్రంలో డ్రమ్ బ్రేక్, వెనుక చక్రంలో డిస్క్ బ్రేక్ ను కలిగి ఉంది. ఇది ముందు భాగంలో 90-90/12 టైర్లు, వెనుక భాగంలో 90-100/10 టైర్లను ఉపయోగిస్తుంది. హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లతో కూడిన ఈ సెటప్ వివిధ నగర రోడ్లపై మెరుగైన స్టెబిలిటీ, ఫెసిలిటీని అందిస్తుంది.

ఈ స్కూటర్‌లో డిజిటల్ డిస్‌ప్లే, డేటైమ్ రన్నింగ్ లైట్స్, కీలెస్ డ్రైవ్, యాంటీ-థెఫ్ట్ అలారం, పార్కింగ్ గేర్, యుఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, వెనుక కూర్చునేవారికి ఫుట్‌రెస్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇది తెలుపు, బూడిద, నలుపు, నీలం రంగులలో అందుబాటులో ఉంది.

జెల్యో ఇ మొబిలిటీ వాహనంపై 2 సంవత్సరాల వారంటీని అందిస్తుంది. లిథియం-అయాన్ బ్యాటరీ వేరియంట్లపై 3 సంవత్సరాల వారంటీ, జెల్ బ్యాటరీ వేరియంట్లపై ఒక సంవత్సరం వారంటీ లభిస్తుంది. ప్రస్తుతం 2,00,000 మందికి పైగా కస్టమర్‌లు, 400 కంటే ఎక్కువ ఔట్‌లెట్లతో కూడిన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న ఈ కంపెనీ, 2025 చివరి నాటికి 1,000 డీలర్‌షిప్‌లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 21, 2025, 17:41 [IST]
English summary
Zelio e launches new gracy electric scooter starting at rs 54 000 with 130 km range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+