ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా రోజుకు 140 కి.మీ.లు వెళ్లగల స్కూటర్ లాంచ్ .. ధర ఎంతంటే?
ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ZELIO E మొబిలిటీ తన తక్కువ-వేగ ఎలక్ట్రిక్ స్కూటర్ Gracyiకి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. పట్టణాల్లో రోజువారీ ప్రయాణాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కొత్త స్కూటర్, పనితీరులోనూ, సౌకర్యంలోనూ, వినియోగదారుల అంచనాలకు తగినట్లుగానే కాకుండా దాటిపోతుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, చిన్నతరహా వ్యాపారులు వంటి ప్రతి ఒక్కరి అవసరాలకు సరిపోయేలా దీనిని తీర్చిదిద్దారు. ముఖ్యంగా స్మార్ట్, స్థిరమైన పనితీరు అందరికీ అందుబాటులో ఉండే ధర ఈ మూడు లక్షణాలు ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి. కొత్తగా వచ్చిన గ్రేసీని మూడు రకాల బ్యాటరీ కాన్ఫిగరేషన్లలో కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మొదటగా లిథియం-అయాన్ వేరియంట్ 60V/30Ah బ్యాటరీతో వస్తుంది, దీని ధర రూ.66,000(ఎక్స్-షోరూమ్). ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 90 నుండి 100 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఇక జెల్ బ్యాటరీ ఆప్షన్లు రెండు ఉన్నాయి, మొదటిది 60V/32Ah ప్యాక్, దీని ధర రూ.54,000. ఇది 80 నుండి 90 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. రెండవది 72V/42Ah ప్యాక్, దీని ధర రూ.58,500.

ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 నుండి 140 కి.మీ వరకు నడుస్తుంది. ఈ మూడు కాన్ఫిగరేషన్లు అవసరాలకు తగ్గట్టుగా ఉంటాయి. డిజైన్ పరంగా స్కూటర్ ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది. గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగంతో సులభంగా నడుస్తూ, పట్టణ రోడ్లపై హాయిగా ప్రయాణించడానికి సహకరిస్తుంది. దీనిలో 60/72V BLDC మోటార్ శక్తివంతంగా ఉండి, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి కేవలం 1.5 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగిస్తుంది.
అంటే ఇది వినియోగదారులకు ఖర్చు తగ్గింపును మాత్రమే కాకుండా, రోజువారీ ప్రయాణాన్ని చాలా నమ్మదగినదిగా, సమర్థవంతంగా మార్చుతుంది. మొత్తంగా చూసుకుంటే, కొత్త Gracyi ఫేస్‌లిఫ్ట్ పట్టణాల్లో చిన్న ప్రయాణాలను ఇంకా సులభం చేస్తూ, తక్కువ ఖర్చుతో కూడిన ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. పర్యావరణానికి మిత్రంగా, జేబుకి స్నేహంగా, ప్రతి వయసు వారికి సరిపోయే ఈ స్కూటర్ నిజంగానే ఒక స్మార్ట్ అర్బన్ మొబిలిటీ సొల్యూషన్ అని చెప్పొచ్చు.

ZELIO E మొబిలిటీ తన Gracyi ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ధరపరంగానే కాదు, ఫీచర్ల పరంగానూ కొత్త స్థాయికి తీసుకెళ్లింది. కొత్తగా వచ్చిన ఈ వెర్షన్, పట్టణ ప్రయాణికులకోసం మోడ్రన్ ఫీచర్లు, సేఫ్టీ ఎలిమెంట్స్‌తో పూర్తిగా సన్నద్ధమైంది. ముందుగా ఫీచర్ల విషయానికొస్తే, డిజిటల్ మీటర్, LED హెడ్‌ల్యాంప్, కీలెస్ డ్రైవ్, యాంటీ-థెఫ్ట్ అలారం, USB ఛార్జింగ్ పోర్ట్, ప్యాసింజర్ ఫుట్‌రెస్ట్ వంటివి ఈ స్కూటర్‌ను ప్రీమియం అనుభూతి కలిగించేలా చేస్తాయి.
వీటితో పాటు, ఇది పట్టణ యువత నుంచి కుటుంబాల వరకు అందరినీ ఆకట్టుకునేలా రూపొందించబడింది. కలర్స్ విషయానికి వస్తే, కొత్త గ్రేసీని తెలుపు, నలుపు, నలుపు-తెలుపు, పసుపు-నీలం, నలుపు-ఎరుపు అనే ఐదు కలర్ కాంబినేషన్లలో ఎంచుకోవచ్చు. వీటితో స్కూటర్ మరింత స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రాక్టికల్ సైడ్‌లో, ఇది 150 కిలోల పేలోడ్ సామర్థ్యంతో వస్తుంది.

అంటే ఒకరితోపాటు సరాసరి బరువు మోసుకెళ్లడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఛార్జింగ్ పరంగా వేరువేరు ఆప్షన్లు ఉన్నాయి, లిథియం-అయాన్ బ్యాటరీ వేరియంట్‌లు కేవలం 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతాయి, అయితే జెల్ బ్యాటరీ వేరియంట్‌లు 8 గంటలు పడతాయి. సేఫ్టీ పరంగా ముందు డిస్క్ బ్రేక్‌లు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు అమర్చబడ్డాయి. వీటికి తోడు హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లు, వివిధ పట్టణ రోడ్లపై రైడర్‌కు మెరుగైన సౌకర్యంను ఇస్తోంది.


Click it and Unblock the Notifications








