డబ్బులు సేవ్ కావాలి.. స్టైలిష్ గా ఉండాలనుకునే వాళ్లకు బెస్ట్ ఆప్షన్ ఈ స్కూటర్.. 1.5 యూనిట్ల కరెంటుతో 150 కి.మ
మీరు టెక్నాలజీ ప్రియులా.. రోజువారీ ప్రయాణాలకు చవకైన, పర్యావరణ హితమైన స్కూటర్ కోసం చూస్తున్నారా.. అయితే మీకోసం ఒక అదిరిపోయే వార్త. ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ జెలియో ఇ (ZELIO E) మొబిలిటీ తమ పాపులర్ లెజెండర్ స్కూటర్ కొత్త వెర్షన్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానుంది.
కేవలం 1.5 యూనిట్ల విద్యుత్‌తో ఏకంగా 150 కి.మీ. దూరం వెళ్లే ఈ స్కూటర్, మీ రోజువారీ ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించనుంది. 2025 జూలైలో విడుదల కానున్న ఈ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి జెలియో ఇ మొబిలిటీ తమ లెజెండర్ స్కూటర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను సిద్ధం చేసింది. కొత్త డిజైన్, ఆకర్షణీయమైన రంగులు, మెరుగైన ఫీచర్లతో వస్తున్న ఈ స్కూటర్ లో-స్పీడ్ ఇ-స్కూటర్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోబోతుంది.
2025 జూలైలో దీనిని విడుదల చేయడానికి జెలియో ఇ ప్లాన్ చేసింది. ఈ కొత్త లెజెండర్ పర్ఫామెన్స్, తక్కువ ధర, లేటెస్ట్ టెక్నాలజీల కలయిక అని కంపెనీ చెబుతోంది. భారతదేశంలో రోజురోజుకు పెరుగుతున్న నగర ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త స్కూటర్‌ను డిజైన్ చేశారు. లెజెండర్ 60/72V BLDC మోటార్తో వస్తుంది.
దీని ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం 1.5 యూనిట్ల విద్యుత్‌తో ఒక పూర్తి ఛార్జ్ అవుతుంది. దీనివల్ల మీ రోజువారీ ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని కంపెనీ వెల్లడించింది. ఇది పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కొత్త లెజెండర్ గంటకు 25 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. ఒకే ఛార్జ్‌తో 150 కి.మీ. రేంజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. తక్కువ ఖర్చుతో, నమ్మకమైన స్కూటర్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది అద్భుతమైన ఎంపిక అని జెలియో ఇ నమ్మకంగా ఉంది. ఈ స్కూటర్‌కు మార్కెట్‌లో మంచి స్పందన వస్తుందని కంపెనీ భావిస్తోంది.
డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కొత్త గ్రాఫిక్స్, లేటెస్ట్గా డిజైన్ చేసిన బాడీ స్టైలింగ్, స్పోర్టీ అండ్ బోల్డ్ లుక్‌తో వస్తుంది. యువతను, స్టైల్ కోరుకునే రైడర్‌లను ఆకట్టుకోవడానికి దీన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసినట్లు జెలియో ఇ తెలిపింది.
జెలియో ఇ మొబిలిటీ లిమిటెడ్ సహ-వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఆర్య మాట్లాడుతూ.. "లెజెండర్ ఎప్పటినుంచో మా పోర్ట్‌ఫోలియోలో ప్రెస్టేజియస్ స్కూటర్. దాని కెపాసిటీ, క్రెడిబిలిటీ, రోజువారీ వినియోగానికి ఎంతో ప్రాక్టికల్‌గా ఉంటుంది.
ఈ ఫేస్‌లిఫ్ట్‌తో లెజెండర్ ప్రస్తుత రైడర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది. ఈ అప్‌డేట్ మా కస్టమర్లు చూపించిన నమ్మకానికి, ప్రేమకు నిదర్శనం. రాబోయే మా కొత్త స్కూటర్ నగర ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్ కాబోతుంది. చిన్న ప్రయాణాలకు ప్రధాన రవాణా మార్గంగా మారుతుందని మేము నమ్ముతున్నాము" అని అన్నారు.
ప్రస్తుతం జెలియో ఇ మొబిలిటీకి 2,00,000 మందికి పైగా కస్టమర్‌లు, 400కు పైగా డీలర్‌షిప్ ఔట్‌లెట్‌లు ఉన్నాయి. 2025 చివరి నాటికి ఈ డీలర్‌షిప్‌ల సంఖ్యను 1,000కు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం హరిత రవాణా లక్ష్యాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం తమ లక్ష్యమని జెలియో ఇ ప్రకటించింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








