స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని ఫీచర్లతో పోటీ కంపెనీలకు చెమటలు పట్టడం ఖాయం
ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో వేగంగా ఎదుగుతున్న బ్రాండ్‌లలో జెలియో ఎలక్ట్రిక్ (Zelio Electric) ఒకటి. ఈ కంపెనీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అత్యంత సరసమైన ధరలో కొత్త నైట్+(Knight+) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.
ఈ స్కూటర్ ధర ఏకంగా ఒక ఆపిల్ ఐఫోన్ 15 కంటే తక్కువగా ఉంది. నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించడానికి అనుకూలంగా దీనిని రూపొందించారు. ఈ స్కూటర్ ఫీచర్లు, ధర, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త నైట్+ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.59,990 మాత్రమే. దీని ధర ఒక ఆపిల్ ఐఫోన్ 15 కంటే కూడా తక్కువ అని కంపెనీ చెబుతోంది. ఈ స్కూటర్‌లో 1.8 kWh పోర్టబుల్ LFP బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. బ్యాటరీ పోర్టబుల్ కాబట్టి, ఇంట్లోనే సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

ఇందులో ఉన్న 1.5 kW మోటార్ గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. జెలియో నైట్+ ధర తక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే హిల్ హోల్డ్ కంట్రోల్ అనే ఫీచర్ ఉంది. ఇది వాలుగా ఉన్న ప్రదేశాల్లో స్కూటర్ వెనక్కి వెళ్లకుండా ఆపి, సురక్షితంగా స్టార్ట్ చేయడానికి సహాయపడుతుంది.
ఎక్కువ దూరం ప్రయాణించేవారి కోసం క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉంది. ఇది స్థిరమైన వేగంతో ప్రయాణించడానికి సహాయపడుతుంది. ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్ ఫీచర్ వల్ల పార్కింగ్ చేసిన తర్వాత హెడ్‌ల్యాంప్ కాసేపు ఆన్‌లో ఉండి, వెలుతురు లేని ప్రదేశాల్లో మార్గాన్ని చూపిస్తుంది.

వీటితో పాటు, USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది.వీటితో పాటు, USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. దీంతో ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లు లేదా ఇతర గాడ్జెట్‌లను ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా ఇది సహాయపడుతుంది. నైట్+ స్కూటర్ మొత్తం 6 రంగులలో అందుబాటులో ఉంది.
సింగిల్ టోన్ కలర్స్ విషయానికి వస్తే గ్లోస్ వైట్, గ్లోస్ బ్లాక్.. డ్యూయల్ టోన్ లో మ్యాట్ బ్లూ అండ్ వైట్, మ్యాట్ రెడ్ అండ్ వైట్, మ్యాట్ ఎల్లో అండ్ వైట్, మ్యాట్ గ్రే అండ్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ స్కూటర్ ఇప్పటికే అన్ని ZELO ELECTRIC డీలర్‌షిప్‌లలో బుకింగ్‌ల కోసం అందుబాటులో ఉంది. జెలియో నైట్+ స్కూటర్ కోసం అన్ని జెలియో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లలో ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 20, 2025 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు భావిస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








