స్మార్ట్‌ఫోన్ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. పైగా ఒక్క కప్పు టీ తాగే 10 రూపాయలతో 120 కి.మీ డ్రైవ్ చేయవచ్చు!
భారతదేశంలోని టూవీలర్ వాహన పరిశ్రమలో ఒక్కటి స్పష్టంగా కనిపిస్తోంది, ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం ప్రస్తుతం వేగంగా పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో పాటు, రోజువారీ ప్రయాణ ఖర్చును తగ్గించాలనే ఉద్దేశంతో చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో, పర్యావరణంపై అవగాహన పెరగడం కూడా ఒక కీలక కారణం. ఈ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, అనేక కంపెనీలు మార్కెట్లో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. అటువంటి బ్రాండ్‌లలో జెలియో (ZELIO E-Mobility) కూడా ఒకటి. ఇప్పటికే "Eeva" అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టి, ఒక స్థిరమైన వినియోగదారుల వర్గాన్ని ఏర్పరచుకున్న ఈ బ్రాండ్, తాజాగా దాని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది.
ఈ కొత్త మోడల్ తక్కువ ధరలో లభించడమే కాకుండా, అనేక ఉపయోగకరమైన ఫీచర్లతో వస్తోంది. స్టైలిష్ డిజైన్, స్మార్ట్ డిస్‌ప్లే, బలమైన బ్యాటరీ రేంజ్, మెరుగైన సస్పెన్షన్ వ్యవస్థ వంటి అంశాలతో ఈ స్కూటర్ పట్టణ జీవనశైలికి బాగా సరిపోయేలా రూపొందించబడింది. ఇందులోని ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది ధర పరంగా సామాన్య వినియోగదారులకి అందుబాటులో ఉండేలా తయారు చేయబడిన ఎలక్ట్రిక్ స్కూటర్.

అంటే, ఫ్యాన్సీ స్కూటర్ల స్టైల్‌ను తక్కువ ధరలో పొందాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఈ కొత్త మోడల్‌కి జెల్ బ్యాటరీ, లిథియం-అయాన్ బ్యాటరీ ఎంపికలు లభిస్తున్నాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ రెండు వేరియంట్లను మరింత రేంజ్, ధర, బ్యాటరీ సామర్థ్యం వంటి అంశాల్లో వేరుగా డిజైన్ చేశారు. ఎంట్రీ-లెవల్ జెల్ బ్యాటరీ వేరియంట్‌గా 60V/32AH మోడల్‌ను కంపెనీ కేవలం రూ. 50,000(ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇది ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే దాదాపుగా 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు, అంటే రోజువారీ అవసరాలకు సరిపడే రేంజ్. దీంతో పాటు, మరింత సామర్థ్యం కోరుకునే వినియోగదారుల కోసం 72V/42AH జెల్ బ్యాటరీ వేరియంట్‌ను కూడా అందిస్తున్నారు, దీని ధర రూ. 54,000. ఇది దాదాపు 100 కిలోమీటర్ల వరకు రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది, అంటే రోజూ ఎక్కువ ప్రయాణాలు చేసేవారికి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

వీటితో పాటు, టెక్నాలజీ, తక్కువ ఛార్జింగ్ టైమ్, మెరుగైన పెర్ఫామెన్స్ కోసం చూస్తున్న వారికి లిథియం-అయాన్ బ్యాటరీ వేరియంట్లు సరైన ఎంపిక. ఇందులో మొదటి మోడల్ 60V/30AH, దీని ధర రూ.64,000. ఈ స్కూటర్ సుమారుగా 90 నుండి 100 కిలోమీటర్ల మధ్య రైడింగ్ రేంజ్‌ను అందించగలదు, ఇది సిటీ రైడింగ్‌కి సరిపోతుంది. అంతేకాదు, ఎక్కువ దూరం ప్రయాణించే వారికి కంపెనీ మరో శక్తివంతమైన 74V/32AH లిథియం-అయాన్ మోడల్ ఉంది.
దీని ధర రూ.69,000. ఇది ఏకంగా 120 కిలోమీటర్ల రేంజ్ అందించగలదు, అంటే వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే చార్జ్ చేస్తే సరిపోతుంది. ఇవి అన్ని ఎక్స్-షోరూమ్ ధరలు. Eva ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు, భారతదేశంలో అమ్ముడవుతున్న కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల కంటే కూడా తక్కువకే లభిస్తుంది. ప్రత్యేకించి మొదటిసారి ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా కనిపిస్తోంది.

కేవలం ధర మాత్రమే కాదు, ఈ స్కూటర్‌ను నడపడానికి అయ్యే నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. పూర్తిగా ఛార్జ్ చేయడానికి సగటున కేవలం 1.5 యూనిట్ల విద్యుత్ మాత్రమే అవసరం అవుతుంది. అంటే ఒకసారి ఛార్జింగ్‌కి రూ.10-రూ.12 వరకు ఖర్చు అవుతుంది (ప్రాంతాన్ని బట్టి వోల్టేజ్ ధరలు మారవచ్చు). ఈ ధరలో 80 నుంచి 120 కిలోమీటర్ల రేంజ్, అంటే లీటర్ పెట్రోల్ ధరతో పోలిస్తే అనేక రెట్లు ఆదా.
దీంతోపాటు, ఆయిల్ మార్పులు, ఇంజిన్ మెంటెనెన్స్ వంటి ఖర్చులు లేవు కాబట్టి, దీన్ని ఆపరేట్ చేయడం ఒక స్మార్ట్ పెట్టుబడిగా మారుతుంది. ఇది లేటెస్ట్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంది. డిజిటల్ డిస్ప్లే , స్పీడ్, బ్యాటరీ లెవెల్, ఓడోమీటర్, అంతేకాదు, పార్కింగ్ గేర్, సెల్ ఫోన్ ఛార్జర్‌తో పాటు మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంది. కలర్స్ విషయానికి వస్తే,బ్లూ, గ్రే, బ్లాక్, వైట్ కలర్స్‌లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది.


Click it and Unblock the Notifications








