ఇంట్లోనే ఛార్జ్.. కరెంట్ బిల్ కూడా చాలా తక్కువే.. రూ.79 వేలకే 150 కి.మీల రేంజ్ ఇచ్చే కొత్త స్కూటర్ లాంచ్

ఇటీవల భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లపై వినియోగదారుల ఆసక్తి గణనీయంగా పెరిగింది. దీనిని గమనించిన అనేక కంపెనీలు, తమదైన ఫీచర్లతో కూడిన కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నాయి. అటువంటి బ్రాండ్లలో ఒకటి జెలియో (ZELIO), ఇది ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది. 2021లో ప్రారంభమైన జెలియో కంపెనీ, ఇప్పటికే "లెజెండర్" అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మార్కెట్‌లో మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు, అదే స్కూటర్‌కు ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌‌ను విడుదల చేసింది. కొత్త డిజైన్, మరింత మెరుగైన టెక్నాలజీతో వచ్చిన ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు వారి అవసరాల మేరకు తమకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.

ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో మొదటి వేరియంట్ 32AH జెల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. దీని ధరను కంపెనీ రూ.65,000గా నిర్ణయించింది. ఇది తక్కువ ఖర్చుతో ఒక ఫంక్షనల్, స్టైలిష్ స్కూటర్‌ను కోరుకునే వారికి అనువుగా ఉంటుంది. ఇంకొక వేరియంట్ 60V/30A లిథియం-అయాన్ బ్యాటరీతో అందించబడుతోంది. దీని ధర రూ. 75,000గా నిర్ణయించబడింది. లిథియం బ్యాటరీ వేరియంట్ ఎక్కువ లాంగ్ లైఫ్, తక్కువ మెంటినెన్స్‌ను కోరుకునే వారికి మంచి ఎంపికగా నిలుస్తుంది.

Zelio New Legender Facelift Price

మూడవ వేరియంట్ మరింత శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. దీనిలో 74V/32A లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. దీని ధరను జెలియో సంస్థ రూ.79,000గా నిర్ణయించింది. డే టు డే కమ్యూటింగ్ కోసం దీన్ని ఒక స్ట్రాంగ్, మన్నికైన ఎంపికగా భావించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకత ఏంటంటే, దీని బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 1.5 యూనిట్ల విద్యుత్ మాత్రమే అవసరమవుతుంది.

దీని ఆధారంగా, ఇది సాధారణ ఇంటి ఛార్జింగ్ పోర్ట్ ద్వారా సులభంగా, తక్కువ ఖర్చుతో ఛార్జ్ చేయవచ్చు. ఒకసారి పూర్తి ఛార్జింగ్ చేసిన తరువాత, స్కూటర్ 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ రేంజ్ ఈ సెగ్మెంట్‌లో చాలా గొప్పదిగా పరిగణించబడుతుంది. దీని వల్ల రోజువారీ ప్రయాణాల్లో ఇంధన ఖర్చులు పెద్ద ఎత్తున తగ్గుతాయి. అంతేకాకుండా, లెజెండ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఆపరేట్ చేయడంలో కూడా చాలా తక్కువ ఖర్చు వస్తుంది.

Zelio New Legender Facelift Battery

శక్తివంతమైన బ్యాటరీ, అధిక రేంజ్, తక్కువ ఛార్జింగ్ ఖర్చుతో ఈ స్కూటర్ స్మార్ట్ ఖర్చుతో కూడిన ఒక ఎకానమికల్ ప్రయాణ భాగస్వామిగా మారుతోంది. ఈ మూడు వేరియంట్లు కూడా స్మార్ట్ ఫీచర్లు, సాంకేతికంగా మున్ముందు సాగే డిజైన్, డైలీ రైడింగ్‌కు అవసరమైన అన్ని అంశాలతో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొత్తగా ఈవీ స్కూటర్ కోసం చూస్తున్న వారు దీన్ని హాయిగా కొనుగోలు చేయవచ్చు.

జెలియో లెజెండ్ ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో స్టైల్, పనితీరు, ఫీచర్లు అన్నింటిని సమానంగా కలిపి ఉన్న మోడల్. ఇది మొత్తం మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో ఆరెంజ్, గ్రీన్,గ్రేలలో లభిస్తుంది. కేవలం కలర్స్ మాత్రమే కాదు, దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ కూడా కొత్తగా అనిపిస్తూ, వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉండటం, రైడింగ్‌కి అదనపు భద్రతను కలిగిస్తుంది.

Zelio New Legender Facelift Range

అలాగే, 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ దీని స్పోర్టీ లుక్‌కు మరింత హుందాతనాన్ని జత చేస్తాయి. సౌకర్యం పరంగా కూడా ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో ఉన్న LED హెడ్‌ల్యాంప్స్ రాత్రి వేళలో స్పష్టమైన దృశ్యాన్ని కల్పిస్తే, డిజిటల్ డ్యాష్‌బోర్డ్ ద్వారా రైడర్‌కు అవసరమైన అన్ని సమాచారం సమర్థంగా అందుతుంది. ఇందులో కీలెస్ ఎంట్రీ, సెల్‌ఫోన్ ఛార్జర్, పార్క్ అసిస్టెన్స్, ఫాలో మీ హోమ్ లైట్లు వంటి ఫీచర్స్ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 18, 2025, 7:30 [IST]
English summary
Zelio new legender facelift electric scooter launched in india design price battery details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+