రూ.65,000కే EV స్కూటర్.. ఒకసారి ఛార్జ్ చేస్తే ఇక రెండు రోజులు తిరగొచ్చు.. అన్ని వివరాలు ఇవే!

భారతదేశంలోని వృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరో కొత్త టూవీలర్ ఇటీవల మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఈవీ తయారీదారు అయినటువంటి జెలియో (ZELIO) కంపెనీ తమదైన ఫీచర్లతో కూడిన తక్కువ ధరలో, తక్కువ వేగంలో సురక్షితంగా ప్రయాణించాలనుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని గతంలో లెజెండర్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు దీనికి అప్‌డేట్‌గా అదే స్కూటర్‌కు ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌‌ను విడుదల చేసింది. ఇప్పటికే జెలియో బ్రాండ్ చిన్న పట్టణాలు, నగరాల్లో తనకంటూ ఒక ప్రాధాన్యం ఏర్పరచుకుంటుండగా, ఈ కొత్త మోడల్ మరింత మందిని ఆకట్టుకునేలా ఉంది. ఈ స్కూటర్ మూడు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంది, దీని ద్వారా వినియోగదారులు తమ ప్రయోజనాలకు అవసరం ఉన్న దాన్ని ఎంచుకోవచ్చు.

దీని ప్రారంభ ధర కేవలం రూ.65,000 (ఎక్స్-షోరూమ్)గా ఉండడం వల్ల, ఇది విద్యార్థులు, మహిళలు, చిన్న వ్యాపారాలు వంటి విభిన్న వర్గాల ప్రజలకు అనువైన ఎంపికగా మారుతుంది. ఈ స్కూటర్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా ZELIO సంస్థ వినియోగదారులకు ఓ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. మొదటి 1,000 మంది కస్టమర్లు ఉచితంగా సేఫ్టీ హెల్మెట్‌ను పొందగలుగుతారు. ఇది కేవలం ప్రొడక్ట్‌నే కాకుండా వినియోగదారుల భద్రతపై కంపెనీ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

Zelio New Legender Facelift

ఈ బ్రాండ్, తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో, లెజెండర్ స్కూటర్‌పై 2 సంవత్సరాల వారంటీని, అలాగే అన్ని బ్యాటరీ వేరియంట్‌లపై 1 సంవత్సరాల వారంటీని ప్రకటించింది. ఇది వినియోగదారులకు నమ్మకాన్ని కలిగించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఇది తక్కువ ఖర్చుతో ఒక ఫంక్షనల్, స్టైలిష్ స్కూటర్‌ను కోరుకునే వారికి అనువుగా ఉంటుంది. లెజెండర్ కొత్త మోడల్ గురించిన వివరాలను కింది కథనంలో చూద్దాం.

ఇది 32AH జెల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. దీని ధరను కంపెనీ రూ.65,000గా నిర్ణయించింది. మరో వేరియంట్ 60V/30A లిథియం-అయాన్ బ్యాటరీతో అందించబడుతోంది. దీని ధర రూ.75,000. ఈ రెండు కూడా లిథియం-అయాన్ బ్యాటరీల ఆధారంగా పనిచేస్తుండటం విశేషం. ఈ స్కూటర్లు శక్తివంతమైన 60V లేదా 72V BLDC మోటార్‌లను కలిగి ఉన్నాయి, ఇవి గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.

Zelio New Legender Facelift Top Things

ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఈ స్కూటర్ గరిష్టంగా 150 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. ఇది రోజువారీ అవసరాలకు, చిన్న ప్రయాణాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువ రేంజ్ ఇస్తుండటంతోపాటు, కేవలం 1.5 యూనిట్ల విద్యుత్తుతో ఫుల్ ఛార్జ్ కావడం ద్వారా వినియోగదారులకు కరెంట్ బిల్లును కూడా తక్కువ రావడానికి దోహదపడుతుంది. దీని లిథియం-అయాన్ బ్యాటరీ సుమారు 4 గంటల్లో ఛార్జ్ అవుతాయి.

సాధారణ ఇంటి ఛార్జింగ్ పోర్ట్ ద్వారా సులభంగా, తక్కువ ఖర్చుతో ఛార్జ్ చేయవచ్చు. స్కూటర్ బరువుతో నగరాల్లో స్మూత్ రైడింగ్ కోసం అవసరమైన ఫీచర్లను కలిగి ఉండటంతోపాటు, వృద్ధులు, విద్యార్థులు, మహిళలు వంటి వివిధ వయసుల ప్రజలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. దీని బరువు 98 కిలోలు. కానీ 150 కిలోల వరకు లోడింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. అంటే, రైడర్‌తో పాటు కొంత లగేజీని కూడా సులభంగా మోయగలదు.

Zelio New Legender Facelift Battery

170 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నందున, భారత రోడ్లపై ఉన్న చిన్న అడ్డంకులు, బంప్‌లు వంటివి ఈ స్కూటర్‌ను ఎక్కువగా ఇబ్బంది పెట్టవు. 90/90-12 పరిమాణంలో ఉన్న టైర్లతో, 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ స్కూటర్‌కు స్టైల్‌తో పాటు మెరుగైన స్టెబిలిటీని కూడా ఇస్తాయి. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, బ్రేకింగ్ సిస్టమ్‌కి అదనపు భద్రతను అందించడంతో పాటు, రైడింగ్‌ను మరింత నమ్మకమైనదిగా మార్చుతాయి.

ఇది స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌లైట్స్, ఇండికేటర్‌లు స్కూటర్‌కి కొత్త లేటెస్ట్ లుక్స్‌ని అందిస్తాయి. రాత్రి వేళల్లో వీటివల్ల రోడ్లు బాగా కనిపిస్తాయి. అలాగే, ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో డ్యూయల్ స్ప్రింగ్-లోడెడ్ షాక్ అబ్జార్బర్లు ఉండటంతో, ఈ స్కూటర్ దారిలో ఉన్న గుంతలు, రఫ్ రోడ్లపై కూడా సులభంగా నడుస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, June 20, 2025, 14:41 [IST]
English summary
Zelio new legender facelift electric scooter price design and all top things details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+