స్మార్ట్‌ఫోన్ కొనుక్కునే డబ్బుతో ఈ కొత్త స్కూటర్ కొనచ్చు! లైసెన్స్ లేదా RC కోసం పోలీసులు ఆపే ఛాన్స్ లేదు!

భారత మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గతంలో కంటే బాగా పెరుగుతున్నాయి. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం కారణంగా ప్రజలు ఇంధన ఖర్చులు భరించలేక, అలాగే, పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన వంటి కారణాల వలన ఎలక్ట్రిక్ వాహనాలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. కస్టమర్లలో మంచి ఆదరణ కారణంగా తయారీదారులు సైతం పోటీ పడుతూ భారత మార్కెట్లో కొత్త మోడళ్లను వరుసగా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూవీలర్ల జోరు మామూలుగా లేదు. కొత్తగా లాంచ్ అవుతున్న వాటిలో వీటి వాటా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు గత కొద్ది నెలలుగా మార్కెట్‌పై దండయాత్ర చేస్తున్నట్టుగా విడుదల అవుతూనే ఉన్నాయి. పెద్ద కంపెనీల నుంచి మొదలుకుని చిన్నవి కూడా పోటా పోటీగా కొత్త మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి.

తాజాగా దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ జెలియో (zelio) కొత్త ఇస్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దాని పేరు లిటిల్ గ్రేసీ (little gracy). దీన్ని ముఖ్యంగా టీనేజర్లను ఉద్దేశించి తీసుకొచ్చారు. తక్కువ బరువుతో వారు కంఫర్ట్‌గా నడపడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఇస్కూటర్‌ను నడపడానికి లైసెన్స్ అవసరం లేదు. అలాగే RTO కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు.

Zelio New Little Gracy Electric Scooter Battery

జెలియో లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ప్రధానంగా 3 వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. వేరియంట్‌ను బట్టి బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. బేస్ మోడల్ 48V/32AH లెడ్-యాసిడ్ బ్యాటరీతో వచ్చింది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 50-60 కిలోమీటర్ల దూరం వరకు ఛార్జింగ్ అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. రోజు తక్కువ దూరం ప్రయాణాలు చేసే వారికి ఇది బెస్ట్ మోడల్.

మిడ్-వేరియంట్‌ విషయానికి వస్తే, దీనిలో 60V/32AH లెడ్-యాసిడ్ బ్యాటరీని అందించారు. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 70 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. చివరగా టాప్ ఎండ్ వేరియంట్ విషయానికి వస్తే, 60V/30AH లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌తో ఇది 70-75 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ లాంచ్ సందర్భంగా పేర్కొంది. కస్టమర్లు తమ అవసరాల మేరకు ఈ మూడింటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

మరో విషయం ఏమిటంటే ఈ మూడు వేరియంట్ల టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 25 కిలోమీటర్లుగా ఉంది. అలాగే, వేరియంట్ల బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపుగా 1.5 యూనిట్ల కరెంట్ మాత్రమే అవసరం అవుతుందని కంపెనీ తెలిపింది. దీంతో విద్యుత్ నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందనే బాధ కూడా ఉండదు. ఇది గ్యాసోలిన్ స్కూటర్లతో పోలిస్తే, తక్కువ విద్యుత్‌ను వాడుకుంటుంది.

ఇక వీటి ధర గురించి తెలుసుకున్నట్లయితే, లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ధర భారతీయ వినియోగదారులు కొనగలిగే రేంజ్‌లో తక్కువకే అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ ధర కేవలం రూ.49,500. అదే మిడ్-వేరియంట్ ధర కేవలం రూ. 52,000. అలాగే, టాప్ వేరియంట్ ధర రూ. 58,000. ఈ ధరలు ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న కొన్ని స్మార్ట్‌ఫోన్ల ధరల కంటే కూడా తక్కువగానే ఉన్నాయి.

గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్‌‌ను పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు చాలా ఈజీగా నడపవచ్చు. జెలియో (zelio) కంపెనీ విషయానికి వస్తే, ఇది దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ. దీనికి దేశం అంతటా దాదాపు 400 కి పైనే డీలర్‌షిప్‌లు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి వీటి సంఖ్య 1,000 కంటే ఎక్కువకు పెంచాలని కంపెనీ భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 13, 2025, 11:15 [IST]
English summary
Zelio new little gracy electric scooter launched in india price battery range and all top things
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+