డెలివరీ బాయ్స్, చిన్న వ్యాపారాలకు అదిరిపోయే స్కూటర్! పైగా కరెంట్ బిల్ కూడా తక్కువే వస్తుంది!
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీదారుల్లో ఒకటైన జెలియో(Zelio E-Mobility) మార్కెట్లో ఉనికిని పెంచుకోవడానికి కీలకంగా ప్రయత్నాలు చేస్తుంది. పెద్ద బ్రాండ్‌లు వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ ఆటో పరిశ్రమలో విపరీతమైన పోటీని పెంచుతున్న నేపథ్యంలో వీటి మధ్య తాను కూడా సత్తా చాటడానికి కంపెనీ పలు కొత్త మోడళ్లను తీసుకురావాలని చూస్తుంది. అందులో భాగంగా జెలియో తక్కువ వేగంతో నడిచే కార్గో స్కూటర్ లాజిక్స్ ఫేస్‌లిఫ్ట్ (Logix facelift)ను విడుదల చేయడానికి సిద్ధం అయింది. ఈ అప్‌డేట్ చేసిన మోడల్ జులై 2025లో మార్కెట్లోకి అమ్మకానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇది డెలివరీ సర్వీసులు, సూపర్ మార్కెట్ల డెలివరీ బాయ్‌ల కోసం రూపొందించిన ఈ మోడల్, పలు ప్రాంతాల్లో సరుకుల రవాణాలో కీలక పాత్ర పోషించనుంది.
కొత్త లాజిక్స్ ఫేస్‌లిఫ్ట్ స్కూటర్ డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, పనితీరు పరంగానూ మరింత శక్తివంతం అయింది. కొత్త ఫ్రంట్ గ్రిల్ డిజైన్ ఇవ్వడం వల్ల ఇది మరింత మాస్, మస్కులర్ లుక్‌ను సొంతం చేసుకుంది. బూడిద, ఆకుపచ్చ రంగుల్లో లభించనున్న ఈ స్కూటర్, ప్రాక్టికల్ యూజర్లను ఆకట్టుకునేలా రూపొందించబడింది. తక్కువ వేగంతో అవసరమైన సామానులను దీనిపై తీసుకెళ్లవచ్చు. ఆపరేషనల్ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది.

ఇది శక్తివంతమైన 60/72 వోల్ట్ BLDC మోటార్‌తో వస్తోంది. ఇది 25 కిలోమీటర్ల టాప్ స్పీడుతో ప్రయాణించగలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల కెపాసిటీని కలిగి ఉంది. దీని వల్ల రోజూ భారీగా లగేజీని డెలివరీ చేసే ప్రొఫెషనల్స్‌కు ఇది మరింత అనుకూలంగా మారుతుంది. ఈ మోడల్‌కి కమర్షియల్ యూజర్ల నుంచి మంచి స్పందన రావచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న జెలియో లాజిక్స్ మోడల్ విషయానికి వస్తే, ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇది తక్కువ దూరాల డెలివరీలకు సరిపోతుంది, కానీ తాజాగా రాబోతున్న ఫేస్‌లిఫ్ట్ మోడల్ దానికంటే మెరుగైన రేంజ్ కలిగి ఉండటం వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది. కొత్త స్కూటర్‌ను ఛార్జ్ చేయడానికి కరెంట్ కూడా తక్కువగానే అవసరం అవుతుంది.
దీనిలో అమర్చిన బ్యాటరీ ప్యాక్‌ను పూర్తి స్థాయిలో ఛార్జ్ చేయడానికి అవసరమయ్యే కరెంట్ కేవలం 1.5 యూనిట్లు మాత్రమే. అంటే, ఇది చాలా తక్కువ ఖర్చుతో పనిచేసే ఎలక్ట్రిక్ మోడల్. ఒకవైపు పెరుగుతున్న ఇంధన ధరలు, మరోవైపు తక్కువ ఆపరేటింగ్ ఖర్చు, ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకుంటే, ఇది చిన్న వ్యాపారాల కోసం సరైన మోడల్‌గా నిలుస్తుంది. కరెంట్ బిల్ కూడా ఎక్కువగా వస్తుంది అనే టెన్షన్ అవపరం లేదు.
అంతేగాక, ఈ స్కూటర్ గరిష్టంగా 150 కిలోల వరకు బరువును మోయగలదు, అంటే పెద్ద ఎత్తున సరుకులు, డెలివరీ బాక్సులు లేదా బస్తాలను సులభంగా తీసుకెళ్లగలదు. అలాంటి సామర్థ్యం ఉండటంతో, రోజూ డజన్ల కొద్దీ డెలివరీలు చేసే లాజిస్టిక్ పార్శిల్ బాయ్స్, రెస్టారెంట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు వంటి వారికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడే స్కూటర్. పెర్ఫామెన్స్ పరంగా చూసుకుంటే ఇది వినియోగదారులను సంతృప్తి కలిగించే మోడల్ అవుతుంది.
భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ఎదుగుతున్న బ్రాండ్‌గా జెలియో మొబిలిటీని తనదైన గుర్తింపు ఏర్పరచుకుంది. 2021లో స్థాపించబడిన ఈ సంస్థ, తక్కువ సమయంలోనే విశేష అభివృద్ధి సాధించి, ఇప్పటికే రెండు లక్షలకుపైగా కస్టమర్లకు సేవలు అందిస్తూ ముందుకు సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 400కు పైగా డీలర్‌షిప్‌లు ఉన్న సెలియో, ఈ క్యాలెండర్ సంవత్సరాంతానికి ముందే వాటిని 1000కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications








