ఒక్కసారి చూస్తే చాలు..బైక్ ఇంటికి తీసుకెళ్లాల్సిందే..హోండా, హీరోలకు చెమటలు పట్టేలా బజాజ్ ప్లాన్

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో తన అత్యంత ప్రజాదరణ పొందిన పల్సర్ సిరీస్‌లో మరో సంచలన మార్పుతో ముందుకు వచ్చింది. ఇటీవలే పల్సర్ 150 మోడల్‌ను కొత్త హంగులతో అప్‌డేట్ చేసిన సంస్థ, ఇప్పుడు తన చిన్న తమ్ముడు పల్సర్ 125(Bajaj Pulsar 125)ను కూడా 2026 ఎడిషన్‌గా సరికొత్తగా ముస్తాబు చేసింది.

అధికారికంగా లాంచ్ కాకముందే ఈ కొత్త బైక్స్ డీలర్షిప్ షోరూమ్‌లకు చేరుకోవడం విశేషం. కొనాలనే ప్లాన్ లేని వారు కూడా ఈ బైక్ లుక్ చూస్తే వెంటనే బుక్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. 2026 బజాజ్ పల్సర్ 125లో జరిగిన అతిపెద్ద మార్పు దాని హెడ్ లైట్ సెటప్. ఇప్పటివరకు హలోజన్ లైట్లతో వచ్చిన ఈ బైక్‌కు ఇప్పుడు మొదటిసారిగా LED హెడ్ ల్యాంప్ తీసుకొచ్చారు.

2026 bajaj pulsar 125 reaches showrooms check out new led headlamps features

దీనివల్ల బైక్ ఫ్రంట్ భాగం చాలా మోడ్రన్‎గా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తోంది. అంతేకాదు టర్న్ ఇండికేటర్లకు కూడా ఇప్పుడు LED ఫార్మాట్‌లోకి మార్చారు. దీనివల్ల రాత్రిపూట ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది. పల్సర్ సిరీస్‌లో ఎప్పటినుంచో ఉన్న ఐకానిక్ LED టైల్ లైట్లను మాత్రం సంస్థ అలాగే కొనసాగించింది.

కొత్త పల్సర్ 125ను చూడగానే ఒక కొత్త అనుభూతి కలిగేలా బజాజ్ ఇంజనీర్లు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బైక్ పెట్రోల్ ట్యాంక్, సైడ్ బాడీ ప్యానెల్స్, ఇంజిన్ కౌల్ పై సరికొత్త గ్రాఫిక్స్, స్టిక్కర్లను అతికించారు. ఇవి బైక్‌కు స్పోర్టీ లుక్‌ని ఇస్తున్నాయి.

2026 bajaj pulsar 125 reaches showrooms check out new led headlamps features

అయితే పల్సర్ 150 మోడల్‌లో స్ప్లిట్ సీట్ ఆప్షన్ ఉన్నప్పటికీ, 125 మోడల్‌లో మాత్రం సింగిల్ సీట్ సెటప్‌నే కొనసాగించారు. ఇది ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. టెక్నాలజీ పరంగా కూడా బజాజ్ వెనకడుగు వేయలేదు. కొత్త పల్సర్ 125లో పూర్తిస్థాయి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్‌ను అమర్చారు. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయం ఉంది.

అంటే మీ స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌కు కనెక్ట్ చేసుకోవడం ద్వారా కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లను నేరుగా స్క్రీన్ మీదే చూడవచ్చు. అయితే, ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్ లేకపోవడం గమనార్హం. స్విచ్‌గేర్ విషయానికి వస్తే, రాత్రిపూట వెలిగే(Illuminated) స్విచ్‌లు, ఇంజిన్ కిల్ స్విచ్, పాస్ లైట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మెకానికల్ పరంగా పాత ఇంజిన్‌నే బజాజ్ నమ్ముకుంది. ఇందులో 124.38సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 11.8 పీఎస్ పవర్, 10.8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేశారు.

2026 bajaj pulsar 125 reaches showrooms check out new led headlamps features

ఈ ఇంజిన్ మైలేజ్ పరంగా కూడా మంచి పర్ఫామెన్స్ కనబరుస్తుందని సంస్థ చెబుతోంది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో ఈ బైక్ చాలా సునాయాసంగా వెళ్తుంది. బైక్ సేఫ్టీ కోసం ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్ అమర్చారు. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు ట్విన్-షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి.

17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు బైక్‌కు మంచి గ్రిప్‌ని ఇస్తాయి. ఇందులో కారు లాంటి హజార్డ్ లైట్స్ లేకపోయినా, మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్ వల్ల రైడర్ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Article Published On: Tuesday, January 20, 2026, 9:19 [IST]
English summary
2026 bajaj pulsar 125 reaches showrooms check out new led headlamps features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+