ఇది బైక్ కాదు రోడ్డు మీద దూసుకెళ్లే రాకెట్.. పాత దానితో పోల్చితే జరిగిన 5 భారీ మార్పులివే

ప్రస్తుతం రాయల్ ఎన్‎ఫీల్డ్ అంటేనే ఒక ఎమోషన్.. ఇప్పటివరకు క్లాసిక్, బుల్లెట్ మోడళ్లతో టూ వీలర్ మార్కెట్‎ను ఏలిన ఈ కంపెనీ, ఇప్పుడు కుర్రకారును ఉర్రూతలగించేలా తన రోడ్‌స్టర్ సెగ్మెంట్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. 2026 మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 (Guerrilla 450) ఇప్పుడు మునుపటి కంటే మరింత పవర్‌ఫుల్‌గా, అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. మీరు ఈ బైక్‌ను కొనాలని ప్లాన్ చేస్తుంటే, కంపెనీ చేసిన ఆ ఐదు ప్రధాన మార్పుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. కేవలం లుక్స్ మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఇది ఇప్పుడు కేటీఎం 390 డ్యూక్ వంటి దిగ్గజాలకు సవాల్ విసురుతోంది.

అగ్రెసివ్ రైడింగ్ పోశ్చర్
ఈసారి రాయల్ ఎన్‌ఫీల్డ్ చేసిన అతిపెద్ద ప్రయోగం ఎపెక్స్ (Apex) వేరియంట్‌ను పరిచయం చేయడం. ఇది లైన్ అప్‌లో బేస్ మోడల్‌గా వచ్చినప్పటికీ, దీని లుక్ మాత్రం అత్యంత ప్రీమియం‌గా ఉంది. ముఖ్యంగా ఇందులో హ్యాండిల్‌బార్‌ను 56 మిమీ మేరకు కిందికి దించారు. దీనివల్ల రైడర్ కొంచెం ముందుకు వంగి కూర్చోవాల్సి ఉంటుంది. ఈ అగ్రెసివ్ పోశ్చర్ బైక్‌కు పూర్తి స్పోర్టీ ఫీల్‌ను ఇస్తుంది. ట్రాఫిక్ గ్యాప్‌లలో దూసుకుపోవడానికి లేదా హైవేలపై వేగంగా వెళ్లడానికి ఈ సెటప్ చాలా ప్లస్ అవుతుంది. దీనికి తోడు హెడ్‌ల్యాంప్ వైజర్, స్పోర్టీ సీట్ కౌల్ ఈ బైక్‌ను ఒక నియో రెట్రో రోడ్‌స్టర్‌లా మార్చేశాయి.

5 Major Upgrades in the 2026 Royal Enfield Guerrilla 450 Every Biker Should Know

గ్రిప్ అదిరిపోయేలా కొత్త టైర్లు
రైడర్ సేఫ్టీ విషయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈసారి రాజీ పడలేదు. బైక్ కంట్రోల్ తప్పకుండా ఉండేందుకు టైర్ల క్వాలిటీని మరింతగా పెంచింది. ఎపెక్స్ వేరియంట్‌లో ప్రత్యేకంగా Vredestein Centuro టైర్లను అందించారు. ఇవి మూల మలుపుల వద్ద అద్భుతమైన గ్రిప్‌ను అందిస్తాయి. ఇక స్టాండర్డ్ వేరియంట్లలో ఉండే సీయట్ (CEAT) టైర్లను కూడా సాఫ్ట్ కాంపౌండ్‎తో అప్‌డేట్ చేశారు. దీనివల్ల వర్షాకాలంలో తడి రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు లేదా సడన్ బ్రేకులు వేసినప్పుడు బైక్ జారిపోకుండా గ్రిప్ పక్కాగా ఉంటుంది. లాంగ్ రైడ్స్ వెళ్లేవారికి ఇదొక గొప్ప వరం.

రంగుల ప్రపంచం.. ట్రెండీ లుక్స్
యువతను ఆకట్టుకోవడంలో రంగులది ప్రధాన పాత్ర. అందుకే గెరిల్లా 450ని సరికొత్త పెయింట్ స్కీమ్స్‌తో కంపెనీ ముస్తాబు చేసింది. కొత్తగా వచ్చిన ఎపెక్స్ వేరియంట్ ఇప్పుడు ఎపెక్స్ రెడ్, ఎపెక్స్ బ్లాక్, ఎపెక్స్ గ్రీన్ అనే మూడు అదిరిపోయే రంగుల్లో దొరుకుతుంది. ఇవి బైక్‌కు ఒక రకమైన పవర్ ఫుల్ లుక్ ఇస్తున్నాయి. వీటితో పాటు మిడ్-స్పెక్ డ్యాష్ వేరియంట్‌లో ట్వైలైట్ బ్లూ అనే కొత్త కలర్‌ను చేర్చారు. ఈ రంగులు బైక్‌ను రోడ్డుపై వెళ్తుంటే అందరూ ఆగి చూసేలా చేస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.

5 Major Upgrades in the 2026 Royal Enfield Guerrilla 450 Every Biker Should Know

స్మూత్ రైడింగ్ కోసం థ్రోటిల్ మ్యాప్స్ సవరణ
బైక్ ఇంజిన్ ఎంత పవర్‌ఫుల్ అయినా, ఆ పవర్ మన కంట్రోల్‌లో ఉన్నప్పుడే రైడింగ్ మజా వస్తుంది. గెరిల్లా 450లోని 452cc షెర్పా ఇంజిన్ ఇప్పుడు మరింత స్మూత్ గా పనిచేసేలా థ్రోటిల్ రెస్పాన్స్‌ను రీ-ట్యూన్ చేశారు. మీరు సిటీ ట్రాఫిక్ లో వెళ్లేటప్పుడు స్ట్రీట్ మోడ్‎లో బైక్ చాలా సాఫ్ట్ గా, లీనియర్ గా సాగుతుంది. అదే మీరు హైవే ఎక్కినప్పుడు స్పోర్ట్ మోడ్ ఆన్ చేస్తే చాలు.. మిడ్ రేంజ్‎లో అదిరిపోయే పవర్ డెలివరీతో బైక్ రాకెట్లా దూసుకుపోతుంది. గేర్ మార్చినప్పుడు వచ్చే జెర్క్స్ కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గాయి.

స్మార్ట్ టెక్నాలజీ.. అప్‌డేటెడ్ ట్రిప్పర్ డ్యాష్
టెక్నాలజీ పరంగా కూడా ఈ బైక్ ఇప్పుడు చాలా స్మార్ట్ అయిపోయింది. ఇందులోని డిజిటల్ ట్రిప్పర్ డ్యాష్‌ను అప్‌గ్రేడ్ చేశారు. సాధారణంగా మనం గూగుల్ మ్యాప్స్ లేదా జిపిఎస్ నావిగేషన్ వాడుతున్నప్పుడు మొబైల్ స్క్రీన్ ఆన్ లో ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కొత్త అప్‌డేట్ వల్ల మొబైల్ స్క్రీన్ లాక్ చేసినా నావిగేషన్ వివరాలు డ్యాష్‌బోర్డ్ పై కనిపిస్తాయి. దీనివల్ల ఫోన్ బ్యాటరీ ఆదా అవ్వడమే కాకుండా, హీటింగ్ సమస్య కూడా ఉండదు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఇప్పుడు మునుపటి కంటే చాలా ఫాస్ట్ గా, యూజర్ ఫ్రెండ్లీగా మారింది.

5 Major Upgrades in the 2026 Royal Enfield Guerrilla 450 Every Biker Should Know

ధర, పోటీ
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ధర విషయానికి వస్తే.. ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.2.49 లక్షలగా ఉంది. టాప్ మోడల్ ధర రూ.2.72 లక్షల వరకు వెళ్తుంది. ఈ ధరలో 450cc సెగ్మెంట్ లో ఇంత పవర్‌ఫుల్ ఇంజిన్, ఆధునిక ఫీచర్లు లభించడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ట్రయంఫ్ స్పీడ్ 400, కేటీఎం 390 డ్యూక్ వంటి బైక్‌లకు ఇది గట్టి పోటీనిస్తోంది. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ ఇమేజ్, సర్వీస్ నెట్‌వర్క్ ఈ బైక్‌కు అదనపు బలాన్ని ఇస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 1, 2026, 12:07 [IST]
English summary
5 major upgrades in the 2026 royal enfield guerrilla 450 every biker should know
Read more on: #royal enfield #new bike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+