లైసెన్స్ తో పనేలేదు.. రిజిస్ట్రేషన్ అక్కర్లేదు.. ఇంటి నుంచే రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనచ్చు
దేశంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకీ పెరుగుతుండటంతో ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా రోజూ కాలేజీ, ఉద్యోగం లేదా చిన్న చిన్న పనుల కోసం ప్రయాణించే వారికి తక్కువ ఖర్చుతో నడిచే ఈ-స్కూటర్లు మంచి ఎంపికగా మారాయి. ఇప్పుడు అమెజాన్ సమ్మర్ సేల్‌లో కొన్ని లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కొన్ని మోడళ్లు రూ.25 వేల నుంచే అందుబాటులో ఉన్నాయి.
ఈ స్కూటర్ల ప్రత్యేకత ఏమిటంటే ఇవి లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. టాప్ స్పీడు గంటకు 25 కిలోమీటర్లలోపే ఉంటుంది. అందుకే వీటికి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్టీవో రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో, కాలేజీ స్టూడెంట్స్, మహిళలు, సీనియర్ సిటిజన్లకు ఇవి బాగా ఉపయోగపడతాయి.

వేసవి ఎండలు మండిపోతున్న వేళ కస్టమర్ల జేబులు చల్లబరిచేందుకు అమెజాన్ అదిరిపోయే ఆఫర్లతో ముందుకు వచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రేట్ సమ్మర్ సేల్‌లో కేవలం స్మార్ట్‌ఫోన్లు, ఏసీలపైనే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఏకంగా 52 శాతం వరకు తగ్గింపు లభిస్తుండటం విశేషం. అతి తక్కువ ధరలో పర్యావరణహిత వాహనాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం
గ్రీన్ ఉడాన్:
ఈ సేల్‌లో అందరినీ ఆకర్షిస్తున్న మోడల్ గ్రీన్ ఉడాన్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని అసలు ధర రూ.54,000 కాగా, అమెజాన్ సేల్‌లో 52 శాతం తగ్గింపుతో కేవలం రూ.25,999 కే లభిస్తోంది. దీనిని నెలవారీ వాయిదాల పద్ధతిలో (ఈఎంఐ) నెలకు రూ.2,889 చెల్లించి కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లే ఈ స్కూటర్, 4 నుంచి 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. మెటల్ బాడీతో దృఢంగా ఉండే ఈ వాహనం బరువు కేవలం 51 కిలోలు మాత్రమే.

మరిన్ని ప్రీమియం ఫీచర్లతో గ్రీన్ ఉడాన్ హై రేంజ్
కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారి కోసం గ్రీన్ ఉడాన్ లోనే మరో మోడల్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.70,000 నుంచి 39 శాతం తగ్గి రూ. 42,999 కి చేరింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 70 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇందులో యాంటీ థెఫ్ట్ అలారం, డిస్క్ బ్రేక్స్, డ్యూయల్ ఎల్‌ఈడీ హెడ్ లైట్లు వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. దీనిని నెలకు రూ. 2,105 ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. 6 గంటల ఛార్జింగ్ సమయంతో ఇది నగర ప్రయాణాలకు చక్కగా సరిపోతుంది.
ఈఓఎక్స్ ఓకో:
మూడవ మోడల్ గా ఈఓఎక్స్ ఓకో ఎలక్ట్రిక్ స్కూటర్ నిలుస్తోంది. దీని అసలు ధర రూ.55,999 ఉండగా, 21 శాతం తగ్గింపుతో ఇప్పుడు రూ.43,999కే అందుబాటులో ఉంది. ఇందులో ఈకో, స్పోర్ట్, హై అనే మూడు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. దీనికి ఐపీ67 రేటింగ్ ఉండటం వల్ల వర్షంలో కూడా ధైర్యంగా నడపవచ్చు. కేవలం 4 గంటల్లోనే బ్యాటరీ పూర్తి ఛార్జ్ అవుతుంది. డిస్క్ బ్రేక్లు మరియు యాంటీ థెఫ్ట్ అలారం వంటి భద్రతా ఫీచర్లు ఇందులో కలవు.



Click it and Unblock the Notifications