రూ.87 వేలకే పక్కింటోళ్లు కుళ్లుకునే లుక్స్ తో సరికొత్త స్కూటర్.. ధర మారలేదు కానీ.. రేంజ్ పెరిగింది
పెట్రోల్ ఖర్చుతో ఇబ్బంది పడుతున్నారా? ఇక టెన్షన్ అవసరం లేదు... రూ.87 వేలకే 118కిమీ రేంజ్ ఇచ్చే స్కూటర్ వచ్చేసింది. భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిడిల్ క్లాస్ ప్రజల ఫేవరెట్ స్కూటర్ ఆంపియర్ మ్యాగ్నస్ నియో(Ampere Magnus Neo)ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్ ధరల బాధ నుంచి తప్పించుకోవాలనుకునే సామాన్యులకు ఈ స్కూటర్ ఒక వరప్రసాదంలా మారింది. మరింత స్టైలిష్ లుక్, ఆకట్టుకునే కలర్లతో వచ్చిన ఈ కొత్త వెర్షన్, బడ్జెట్ ధరలోనే అదిరిపోయే రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.
ఆంపియర్ మ్యాగ్నస్ నియో అప్‌డేటెడ్ వెర్షన్‌లో అత్యంత ఆకర్షణీయమైన మార్పు దాని కలర్స్. కంపెనీ ఈసారి యూత్‌ను, ఫ్యామిలీలను ఆకట్టుకునేలా బటర్ ఎల్లో అనే సరికొత్త షేడ్‌ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు బ్లూ, గ్రీన్, గ్రే వంటి మోడ్రన్ కలర్ ఆప్షన్లలో కూడా ఇది లభిస్తుంది. డిజైన్ పరంగా పాత మోడల్ క్లాసిక్ లుక్‌ను కొనసాగిస్తూనే, ఈ కొత్త రంగులు స్కూటర్‌కు మరింత ఫ్రెష్, ప్రీమియం ఫీల్‌ను ఇస్తున్నాయి. సిటీ రోడ్లపై ఈ స్కూటర్ వెళ్తుంటే అందరి చూపు దీని వైపు మళ్లడం ఖాయం.

సాంకేతిక పరంగా చూస్తే, మ్యాగ్నస్ నియో విశ్వసనీయమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులో 2.3 కిలోవాట్స్ కెపాసిటీ కలిగిన LFP (Lithium Iron Phosphate) బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీలకు జీవితకాలం ఎక్కువ ఉండటమే కాకుండా, భారతీయ వాతావరణ పరిస్థితులకు ఇవి చాలా వరకు సురక్షితం కూడా. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 118 కిలోమీటర్ల (IDC రేంజ్) వరకు ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. అంటే సిటీలో ప్రతి రోజూ ఆఫీసు పనులకు లేదా కాలేజీకి వెళ్లే వారికి ఇది పక్కాగా సెట్ అవుతుంది. బ్యాటరీని 0 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయడానికి కేవలం 5 గంటల టైం మాత్రమే పడుతుంది.
భారతీయ రోడ్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆంపియర్ ఈ స్కూటర్‌ను రూపొందించింది. దీని సీటు హైట్ కేవలం 777 మిమీ మాత్రమే, కాబట్టి తక్కువ హైట్ ఉన్నవారు లేదా లేడీస్ కూడా దీనిని చాలా ఈజీగా నడపవచ్చు. కేవలం 106 కిలోల బరువు మాత్రమే ఉండటం వల్ల ట్రాఫిక్‌లో స్కూటర్‌ను నడపడం చాలా ఈజీ. ఈ స్కూటర్ సుమారు 150 కిలోల వరకు బరువులను మోయగలదు, అంటే ఇద్దరు కూర్చున్నా లేదా సామాన్లు ఉన్నా ఇది సులువుగా లాక్కెల్లగలదు. మెరుగైన సస్పెన్షన్ సిస్టమ్ వల్ల గతుకుల రోడ్లపై కూడా ప్రయాణం సాఫీగా సాగుతుంది.

ఈ లాంచ్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే దాని ధర. కొత్త ఫీచర్లు, కలర్స్ జోడించినా కంపెనీ పాత ధరనే కొనసాగిస్తోంది. మ్యాగ్నస్ నియో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.86,999 గా ఉంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ ఎండీ వికాస్ సింగ్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాలను సాధారణ ప్రజలకు మరింత చేరువ చేయడమే తమ టార్గెట్ అని పేర్కొన్నారు. లో మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజీ, స్టైలిష్ లుక్ కోరుకునే మిడిల్ క్లాస్ ప్రజలకు ఈ స్కూటర్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications