ఏథర్ స్కూటర్లలో కొత్త డార్క్ మోడ్ అప్‌డేట్.. రాత్రి ప్రయాణాలు ఇక మరింత సులభం! మీ స్కూటర్‌కు వచ్చిందా?

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ 'ఏథర్' (Ather) తన యూజర్ల కోసం డార్క్ మోడ్ 'ఓవర్-ది-ఎయిర్' (OTA) అప్‌డేట్‌ను మనదేశంలో అందుబాటులోకి తెస్తోంది. నవంబర్ 15 నుంచి 18 మధ్యలో ఏథర్ 450 సిరీస్, ఫ్యామిలీ స్కూటర్ 'రిజ్తా' (Rizta) వాడుతున్న పలువురు కస్టమర్లకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు రావడం మొదలైంది. ముఖ్యంగా రిజ్తా స్కూటర్ ఓనర్లు ఈ మార్పును ముందుగా గమనించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాగా, ఈ అప్‌డేట్‌ను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. కాబట్టి ఒక నగరంలో ఉన్న స్కూటర్లకు ముందుగా అప్‌డేట్ వస్తే, మరో నగరంలోని వాహనాలకు కాస్త ఆలస్యంగా రావచ్చు.

ఇది కేవలం బ్లాక్ కలర్ థీమ్ మాత్రమే కాదు... అంతకు మించిన మార్పులు ఇందులో ఉన్నాయి. రాత్రివేళ ప్రయాణించేటప్పుడు కంటిపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు వీలుగా డాష్‌బోర్డ్, ఛార్జింగ్ స్క్రీన్‌లను లో-గ్లేర్ ప్యానెట్‌తో తీర్చిదిద్దారు. అలాగే డిజైన్ లేఅవుట్‌లో చిన్న చిన్న మార్పులు చేశారు. ఏథర్ 450X మోడల్‌లో ఆటో-థీమ్ స్విచింగ్‌తో పాటు కొన్ని పాత సమస్యలను సరిచేశారు. ఈ కొత్త అప్‌డేట్ వల్ల రాత్రి ప్రయాణాల్లో రైడర్లకు ఎలాంటి ఆటంకం ఉండదు. రోజూ స్కూటర్ వాడేవారికి డాష్‌బోర్డ్ ఇంటర్‌ఫేస్ మరింత స్మూత్‌గా, క్లీన్‌గా అనిపిస్తుంది.

Ather Electric Scooter Dark Mode OTA Update: How to Install and Fix Common Issues (2026)

డార్క్ మోడ్ అప్‌డేట్ ఎవరెవరికి వస్తుంది? రోలవుట్ వివరాలు ఇవే..

రిజ్తా S, రిజ్తా Z మోడళ్లకు మొదటిసారిగా ఈ డార్క్ మోడ్ థీమ్ వస్తోంది. అదే సమయంలో 450 సిరీస్ స్కూటర్లలో లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ వెర్షన్ల ద్వారా థీమ్ స్విచింగ్ విధానాన్ని మరింత మెరుగుపరిచారు. ఈ వారంలోనే దేశవ్యాప్తంగా బ్యాచ్‌ల వారీగా అప్‌డేట్‌ను ఏథర్ విడుదల చేస్తోంది. కాబట్టి స్కూటర్ వేరియంట్, నగరాలను బట్టి అప్‌డేట్ వచ్చే సమయం మారవచ్చు. మీ స్కూటర్‌కు ఇంకా నోటిఫికేషన్ రాకపోతే.. డాష్‌బోర్డ్‌లో అలర్ట్స్ బటన్‌ను తరచూ చెక్ చేస్తూ ఉండండి.

మోడల్ డార్క్ మోడ్ స్టేటస్ అప్‌డేట్ సమయం
Rizta S, Rizta Z OTA ద్వారా కొత్త డార్క్ థీమ్ నవంబర్ 15–18 (విడతల వారీగా)
450X, 450S థీమ్ స్విచింగ్; లేటెస్ట్ మార్పులు ప్రస్తుతం అందుబాటులో ఉంది (విడతల వారీగా)

ఏథర్ డార్క్ మోడ్ OTA: సురక్షితంగా అప్‌డేట్ చేసుకునే విధానం

ఈ అప్‌డేట్ ఇన్ స్టాల్ చేసేముందు స్కూటర్‌ను సురక్షితంగా పార్క్ చేసి ఛార్జింగ్‌కు కనెక్ట్ చేయండి. ఆ తర్వాత డాష్‌బోర్డ్ మెనూలోకి వెళ్లి, 'General' ఆప్షన్‌పై టాప్ చేసి 'Software Version' చూడండి. ఒకవేళ అక్కడ "Update available" అని కనిపిస్తే.. ఇన్ స్టాలేషన్ స్టార్ట్ చేయండి. ఆ సమయంలో స్కూటర్ ఛార్జింగ్‌లో ఉంటూ, వైఫై లేదా మంచి సెల్యులార్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉండాలి. గుర్తుంచుకోండి.. ఇన్ స్టాలేషన్ జరుగుతున్న సమయంలో స్కూటర్ నడపడం కుదరదు. ఒకవేళ డౌన్‌లోడ్ పూర్తయి, ఇన్ స్టాల్ కాకపోతే.. స్కూటర్‌ను మళ్లీ ఛార్జింగ్‌లో పెట్టి ప్రయత్నించండి.

డార్క్ మోడ్ OTA: వచ్చే చిన్న చిన్న సమస్యలు - పరిష్కారాలు

అప్‌డేట్ చేసుకున్న తర్వాత 450X మోడల్‌లో డార్క్ మోడ్‌లో మ్యాప్స్ సరిగ్గా కనిపించకపోవడం, ఛార్జింగ్‌లో చిన్నపాటి సమస్యలు రావడం, అలాగే కొన్నింట్లో ఇన్ స్టాలేషన్ ఫెయిల్ అయి బూట్ లూప్ అవ్వడం వంటి సమస్యలు వస్తున్నాయని కొందరు ఓనర్లు చెబుతున్నారు. ఇలాంటి సమస్య ఎదురైతే.. సెట్టింగ్స్ నుంచి స్కూటర్‌ను రీబూట్ చేసి, ఛార్జింగ్‌లో ఉంచి అప్‌డేట్‌ను మళ్లీ ట్రై చేయండి. సమస్య అలాగే ఉంటే.. వెంటనే ఏథర్ యాప్ ద్వారా టికెట్ రైజ్ చేయండి లేదా సపోర్ట్ టీమ్‌కు ఈమెయిల్ పంపండి.

తెలుగు రాష్ట్రాల్లో ఏథర్ రైడర్ల రియాక్షన్ ఇదే!

హైదరాబాద్‌లోని ఏథర్ రైడర్లు టెస్టింగ్ వాహనాల్లో ఇదివరకు డార్క్ మోడ్‌ను చూశారు. కాగా, ఈ వారంలో వారికి స్థిరమైన OTA అప్‌డేట్ వచ్చినట్లు చెబుతున్నారు. కోస్తా జిల్లాలతో సహా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చెందిన స్కూటర్ ఓనర్లు మాత్రం ఇంకా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. కొద్దిరోజులు వేచి చూడాలని, ఒకవేళ వారమైనా అప్‌డేట్ రాకపోతే సపోర్ట్ టీమ్‌ను సంప్రదించాలని ఏథర్ కమ్యూనిటీ సూచిస్తోంది.

మీ స్కూటర్‌కు ఇంకా అప్‌డేట్ రాకపోతే.. రాత్రివేళ మంచి వైఫై నెట్‌వర్క్ కనెక్టివిటీతో ఛార్జింగ్‌లో ఉంచండి. ప్రతిరోజూ ఉదయాన్నే సాఫ్ట్‌వేర్ వెర్షన్ పేజీని చెక్ చేసుకోండి. విడతల వారీగా అప్‌డేట్ ఇస్తారు కాబట్టి కొన్ని రోజులు సమయం పట్టవచ్చు. వారం దాటినా రాకపోతే సపోర్ట్ టికెట్ రైజ్ చేయడం ఉత్తమం. ఇక డార్క్ మోడ్ వచ్చాక రాత్రివేళ ప్రయాణాలు మరింత హాయిగా అనిపించడంతో పాటు ఇంటర్‌ఫేస్ కూడా ఎంతో నీట్‌గా కనిపిస్తుంది.

Article Published On: Wednesday, November 18, 2026, 10:54 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+