అమ్మాయిలైనా, అబ్బాయిలైనా నడపొచ్చు.. మధ్యతరగతి వారి కోసం పెట్రోల్ డబ్బులు భారీగా ఆదా చేసే స్కూటర్
ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఏథర్ ఎనర్జీ, ఇప్పుడు సామాన్యుల బడ్జెట్‌లోకి చేరిపోయేందుకు రెడీ అవుతుంది. ఇప్పటివరకు ప్రీమియం స్కూటర్లకే పరిమితమైన ఏథర్, ఇప్పుడు మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ఒక సరికొత్త అఫార్డబుల్ స్కూటర్‌ను తీసుకురాబోతోంది.
ఇటీవల రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన ఈ కొత్త స్కూటర్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో వస్తున్న ఈ స్కూటర్, ఇప్పటికే మార్కెట్‌ను ఏలుతున్న ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి దిగ్గజాలకు వణుకు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు, తక్కువ ధరలో క్వాలిటీ స్కూటర్‌ను అందించేందుకు కంపెనీ EL అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను రెడీ చేసింది. దీనిపై తయారైన మొదటి స్కూటర్ ఇప్పుడు ముసుగు వేసుకుని రోడ్లపై చక్కర్లు కొడుతోంది. ఈ స్కూటర్ డిజైన్ చూస్తుంటే, ఇది పక్కాగా ఫ్యామిలీ అవసరాల కోసం తయారైనట్టు అర్థమవుతోంది.
టెస్టింగ్ సమయంలో కెమెరాకు చిక్కిన ఫొటోలను గమనిస్తే, ఈ కొత్త ఏథర్ స్కూటర్ డిజైన్ చాలా సింపుల్‌గా, అందంగా ఉంది. హ్యాండిల్‌బార్‌పైనే హెడ్‌లైట్ అమర్చడం వల్ల ఇది చూడటానికి మన సంప్రదాయ స్కూటర్లను పోలి ఉంది. ముందు భాగంలో వెడల్పాటి LED DRLలు, గట్టిగా ఉండే బాడీ ప్యానెల్స్ దీనికి కొత్త లుక్ ఇస్తున్నాయి.

ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ సౌకర్యవంతంగా కూర్చునేలా పొడవైన సింగిల్ పీస్ సీటును డిజైన్ చేశారు. ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్ ఉండటం వల్ల సామాన్లు పెట్టుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. ఇది స్పోర్టీ లుక్ కంటే కూడా రోజువారీ అవసరాలకు, ఆఫీసు వెళ్ళే వారికి, పిల్లలను స్కూల్ కి తీసుకెళ్లే వారికి సరిగ్గా సరిపోతుంది.
ఏథర్ రూపొందించిన ఈ కొత్త EL ప్లాట్‌ఫామ్ చాలా ప్రత్యేకమైనది. ఒకే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి రకరకాల బ్యాటరీ సైజులు, ఫీచర్లు ఉన్న స్కూటర్లను తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల కంపెనీకి తయారీ ఖర్చు తగ్గుతుంది, తద్వారా కస్టమర్లకు తక్కువ ధరకే స్కూటర్లు అందుతాయి.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ స్కూటర్ లో 2 kWh నుంచి 5 kWh వరకు బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ ఖర్చును తగ్గించేందుకు, మన్నికను పెంచేందుకు ఏథర్ ఇందులో LFP (Lithium Iron Phosphate) టెక్నాలజీని వాడే అవకాశం ఉంది. దీనివల్ల స్కూటర్ రేంజ్ పెరగడమే కాకుండా, బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది.
ప్రస్తుతం ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో ఓలా ఎస్1 ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ బేస్ మోడల్, బజాజ్ చేతక్ వంటివి రాజ్యమేలుతున్నాయి. ఏథర్ తన కొత్త మోడల్‌ను రిజ్తా కంటే తక్కువ ధరలో లాంచ్ చేయడం ద్వారా ఈ పోటీని మరింత పెంచనుంది. బేస్ మోడల్ లో ప్రాథమిక అవసరాలు మాత్రమే ఉంచి, టాప్ ఎండ్ మోడల్స్ లో TFT డిస్‌ప్లే, కనెక్టివిటీ ఫీచర్లు ఇచ్చే ఛాన్స్ ఉంది.
అలాగే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) పద్ధతిని ఏథర్ కొనసాగిస్తే, స్కూటర్ కొనేటప్పుడు చెల్లించాల్సిన నగదు భారీగా తగ్గుతుంది. మొత్తానికి ఏథర్ నుంచి వస్తున్న ఈ బడ్జెట్ బండి, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే సామాన్యులకు ఒక మంచి ఆప్షన్ కానుంది.


Click it and Unblock the Notifications