ఎలక్ట్రిక్ స్కూటర్లలో అందరూ దీన్నే కొంటున్నారు.. 14 వేలకు పైగా సేల్స్! ఒక్క ఛార్జ్‌తో 160 కి.మీ రేంజ్
ఏథర్ రిజ్టా (Ather Rizta) భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో వేగంగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. స్టైలిష్ డిజైన్‌తో పాటు ప్రాక్టికల్ ఫీచర్లను అందిస్తూ, రోజువారీ వినియోగానికి సరిపోయే స్కూటర్‌గా ఇది వినియోగదారుల మనసులు గెలుచుకుంది. అందుకే మార్కెట్లో దీని డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ కనిపిస్తోంది. షోరూమ్‌లలో కూడా ఏథర్ రిజ్టాకు మంచి స్పందన లభిస్తోంది, కొనుగోలుదారులు ఆనందంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంచుకుంటున్నారు. ఈ పెరుగుతున్న ఆదరణకు గణాంకాలే నిదర్శనం. గత నెల డిసెంబర్ 2025లో ఏథర్ రిజ్టా మొత్తం 14,282 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చుకుంటే ఈ సంఖ్య స్పష్టమైన వృద్ధిని చూపిస్తోంది.
డిసెంబర్ 2024లో కేవలం 7,456 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, ఏడాది వ్యవధిలోనే అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. లెక్కల ప్రకారం చూస్తే, సంవత్సరానికి సుమారు 44.97 శాతం అమ్మకాల వృద్ధిని ఏథర్ రిజ్టా నమోదు చేసింది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో ఈ మోడల్‌కు ఉన్న బలమైన డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. డిసెంబర్ నెలలో ఏథర్ రిజ్టా అమ్మకాలు ఇంతగా పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఇది రోజువారీ ప్రయాణాలకు ఎంతో అనుకూలంగా ఉండటం వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఆఫీస్‌కు వెళ్లడం, చిన్న పనుల కోసం బయటికి వెళ్లడం వంటి రోజువారీ అవసరాలకు ఇది సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. అంతేకాదు, ఎలక్ట్రిక్ స్కూటర్ కావడం వల్ల నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. పెట్రోల్ ఖర్చుల భారం లేకపోవడం కూడా వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తోంది.
ఇంకా చెప్పాలంటే, ఏథర్ రిజ్టా డిజైన్ పరంగా కూడా అన్ని వర్గాల వారికి సరిపడేలా రూపొందించబడింది. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఎవరైనా సులభంగా నడపగలిగేలా దీనిలో సీటింగ్ పొజిషన్, హ్యాండిల్‌బార్ సెటప్ రూపొందించారు. ఈ సౌలభ్యం వల్ల కుటుంబ వినియోగానికి కూడా రిజ్టా మంచి ఎంపికగా మారింది. ఈ అన్ని అంశాలు కలసి డిసెంబర్‌లో ఏథర్ రిజ్టా భారీ అమ్మకాలు నమోదు చేయడానికి కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ మరో ముఖ్యమైన ఆకర్షణ దీని సరసమైన ధర. ఇది రూ.1.05 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ధరలో లభిస్తోంది. ఈ ధర కారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇది సులభంగా అందుబాటులోకి వస్తోంది. అంతేకాదు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏథర్ ఈ స్కూటర్‌ను రిజ్టా ఎస్ మరియు రిజ్టా జెడ్ అనే రెండు వేరియంట్లలో అందిస్తోంది
ధరకు తగ్గట్టుగానే ఇందులో 2.9 kWh, 3.7 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ బ్యాటరీలు రోజువారీ ప్రయాణ అవసరాలను సులభంగా తీరుస్తాయి. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత వేరియంట్‌ను బట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సుమారు 123 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. అంటే నగర వినియోగంలో తరచూ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా, నమ్మకంగా ఉపయోగించవచ్చు.

చార్జింగ్ సౌలభ్యం విషయంలో పోర్టబుల్ హోమ్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే బ్యాటరీ ప్యాక్‌ను దాదాపు 8 గంటల 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది రాత్రి సమయంలో ఛార్జ్ పెట్టి, ఉదయం పూర్తి ఛార్జ్‌తో ప్రయాణానికి సిద్ధంగా ఉండేలా చేస్తుంది. ఇందులో 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. హెల్మెట్‌తో పాటు చిన్న బ్యాగ్ లేదా రోజువారీ అవసరాల సరుకులను కూడా సులభంగా ఉంచుకునేలా స్టోరేజ్ ఉపయోగపడుతుంది.


Click it and Unblock the Notifications








