మే నెలలో అసలు ఏం జరిగింది? బజాజ్ అమ్మకాలు చూసి షాక్ అవుతున్న మార్కెట్!

మే నెల ముగియడంతో దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను వరుసగా విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహన రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న బజాజ్ ఆటో (Bajaj Auto) కూడా 2026 మే నెలకు సంబంధించిన విక్రయాల వివరాలను ప్రకటించింది. విడుదలైన గణాంకాలు పరిశీలిస్తే, కంపెనీకి దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బలమైన డిమాండ్ కొనసాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బజాజ్ మోటార్‌సైకిళ్లు, త్రీ-వీలర్లకు ఉన్న ఆదరణ కంపెనీ విక్రయాల్లో ప్రతిఫలించింది. ముఖ్యంగా ఎగుమతుల విభాగంలో నమోదైన అద్భుతమైన వృద్ధి కారణంగా కంపెనీ మొత్తం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

2026 మే నెలలో బజాజ్ ఆటో మొత్తం 4,61,257 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 3,84,621 యూనిట్లను విక్రయించగా, ఈసారి ఆ సంఖ్య భారీగా పెరగింది. వార్షిక ప్రాతిపదికన 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ మార్కెట్లో కూడా బజాజ్ తన బలమైన ఉనికిని కొనసాగిస్తోంది. మే 2025లో 2,25,733 యూనిట్లుగా ఉన్న దేశీయ అమ్మకాలు ఈ ఏడాది మే నెలలో 2,48,031 యూనిట్లకు చేరుకున్నాయి.

Bajaj Auto May 2026 Sales Cross 461000 Units With 20 Percent Growth

కంపెనీకి ప్రధాన బలంగా ఉన్న టూవీలర్ విభాగం 2026 మే నెలలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ మార్కెట్లలో బజాజ్ బైకులకు లభిస్తున్న ఆదరణ కారణంగా టూవీలర్ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. తాజా గణాంకాల ప్రకారం, మే 2026లో బజాజ్ మొత్తం 3,93,204 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 3,32,370 యూనిట్లతో పోలిస్తే ఇది 18 శాతం వృద్ధిని సూచిస్తోంది.

దేశీయ మార్కెట్లో కూడా బజాజ్ బైకులు మంచి ప్రదర్శన కనబరిచాయి. భారత మార్కెట్లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 9 శాతం పెరిగి 2,09,528 యూనిట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ కారణంగా ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఏకంగా 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మే 2026లో కంపెనీ 1,83,676 ద్విచక్ర వాహనాలను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది. అంటే విదేశీ మార్కెట్లో విక్రయాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి.

Bajaj Auto May 2026 Sales Cross 461000 Units With 20 Percent Growth

ఇదిలా ఉండగా, గత ఏడాది మే నెలలో( టూవీలర్ + CV)) 1,58,888 యూనిట్లుగా ఉన్న మొత్తం ఎగుమతులు, ఈ ఏడాది 2,13,226 యూనిట్లకు చేరుకున్నాయి. ఏడాదిలోనే ఎగుమతుల పరంగా 34 శాతం వృద్ధిని సాధించింది. విదేశాల్లో బజాజ్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ దీనికి ప్రధాన కారణం. ప్రపంచ మార్కెట్లలో కంపెనీ బ్రాండ్ బలం పెరగడంతో పాటు, వివిధ దేశాల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించడం ఎగుమతుల వృద్ధికి దోహదపడింది.

కమ్యూటర్ బైకులు, స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్లు, కమర్షియల్ వాహనాలకు లభిస్తున్న ఆదరణ, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లో వృద్ధి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువతలో పల్సర్ సిరీస్‌కు ఉన్న క్రేజ్, గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూటర్ బైకుల డిమాండ్ కంపెనీ అమ్మకాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. అయితే ఈసారి బజాజ్ విజయగాథలో అత్యంత కీలక పాత్ర పోషించింది ఎగుమతుల విభాగమే.

Bajaj Auto May 2026 Sales Cross 461000 Units With 20 Percent Growth

వాణిజ్య వాహనాల అమ్మకాలు చూసినట్లయితే, మే 2026లో ఏకంగా 30 శాతం పెరిగి 68,053 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో 52,251 యూనిట్లుగా నమోదు కాగా, ఏడాదిలోపు వాణిజ్య వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడి సేల్స్ భారీగా పుంజుకున్నాయి. ఇదే సమయంలో దేశీయ వాణిజ్య వాహనాల అమ్మకాలు 12 శాతం పెరిగి 38,503 యూనిట్లుగా ఉండగా, ఎగుమతులు 65 శాతం పెరిగి 29,550 యూనిట్లకు చేరుకున్నాయి.

Article Published On: Monday, June 1, 2026, 15:28 [IST]
English summary
Bajaj auto may 2026 sales cross 461000 units with 20 percent growth
Read more on: #bajaj auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+