సింగిల్ చార్జ్ పై రోజంతా తిరగొచ్చు..ఈ స్కూటర్‌తో లక్షలు విలువ చేసే పెట్రోల్ డబ్బులు ఆదా
ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ (Bajaj), ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన సత్తాను ప్రపంచానికి తెలియజేస్తోంది.ఇప్పటికే తన పాపులర్ స్కూటర్ చేతక్ సిరీస్‌తో ఆకట్టుకున్న బజాజ్ ప్రస్తుతం సామాన్యుడి బడ్జెట్‌కు తగినట్లుగా తన అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ C25 (Bajaj Chetak C25)ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ స్కూటర్ డెలివరీలు కూడా ప్రారంభం కావడం, దీని పై భారీ డిస్కౌంట్లు ఉండడంతో కస్టమర్లు షోరూంల ఎదుటబారులు దీరుతున్నారు.
మనదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే చాలా మంది కస్టమర్లు బ్రాండెడ్ స్కూటర్ కావాలని కోరుకున్నా, వాటి ధరలు ఎక్కువగా ఉండడంతో వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారి కోసమే బజాజ్ సంస్థ చేతక్ C25 మోడల్‌ను తయారు చేసింది. ఇది కేవలం తక్కువ ధరకే కాకుండా, సిటీ ప్రయాణాలకు అత్యంత అనుకూలంగా ఉండేలా డిజైన్ చేయబడింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ స్కూటర్ డెలివరీలు వేగంగా సాగుతున్నాయి.

ధర, ప్రత్యేక ఆఫర్లు: బజాజ్ చేతక్ C25 అసలు ధర రూ.91,399 (ఎక్స్-షోరూమ్). అయితే, ఈ స్కూటర్ అమ్మకాలను మరింత పెంచేందుకు కంపెనీ ఒక అద్భుతమైన ప్రారంభ ఆఫర్‌ను ప్రకటించింది. తొలి 10,000 మంది కస్టమర్లకు రూ.4,299 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంటే ఈ ఆఫర్ కింద మీరు కేవలం రూ.87,100కే ఈ స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ లిమిటెడ్ టైం ఆఫర్ కారణంగానే కస్టమర్లు ఈ స్కూటర్ కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.
బ్యాటరీ, పర్ఫార్మెన్స్: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 2.5kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. నగరాల్లో ఆఫీసులకు వెళ్లేవారికి లేదా చిన్న చిన్న పనుల కోసం తిరిగే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. దీని టాప్ స్పీడు గంటకు 55 కిలోమీటర్లు. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 2.25 గంటల్లోనే 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

అడ్వాన్స్‌డ్ ఫీచర్లు: తక్కువ ధరకే వస్తున్నప్పటికీ, బజాజ్ ఇందులో ఫీచర్ల విషయంలో కూడా ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో రెండు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఎత్తు పల్లాలు, కచ్చా రోడ్ల మీద కూడా ఈజీగా వెళ్లేందుకు హిల్-హోల్డ్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది. గైడ్-మీ-హోమ్ లైటింగ్ టెక్నాలజీ, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే సీటు కింద 25 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉంది, ఇందులో మీరు హెల్మెట్ లేదా ఇతర వస్తువులను సులభంగా పెట్టుకోవచ్చు.
స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ: బజాజ్ చేతక్ అంటేనే ధృడత్వానికి మారుపేరు. C25 మోడల్‌ను కూడా పూర్తి మెటల్ బాడీతో తయారు చేశారు. ప్లాస్టిక్ బాడీ కలిగిన ఇతర ఈవీలతో పోలిస్తే ఇది చాలా కాలం మన్నికనిస్తుంది. సిటీ ట్రాఫిక్ లో సులభంగా దూసుకుపోయేలా దీనిని తక్కువ బరువుతో, కాంపాక్ట్ సైజులో రూపొందించారు.

బజాజ్ కు ఉన్న విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ వల్ల భవిష్యత్తులో రిపేర్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండదని కంపెనీ పూర్తి భరోసా ఇస్తోంది. మొత్తానికి తక్కువ బడ్జెట్ లో, బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే వారికి చేతక్ C25 ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications








