రూ.87 వేలకే EV స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీలు, 3 గంటల్లో ఫుల్ ఛార్జ్, చేతక్ EV పూర్తి వివరాలు

పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా నగర ప్రయాణాల్లో తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే వారు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువగా పరిశీలిస్తున్నారు. ఈ కారణంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అనేక కంపెనీలు ఈ విభాగంలో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పోటీ మధ్యలోనే బజాజ్ ఆటో (Bajaj Auto) తన ప్రసిద్ధ స్కూటర్‌ను మళ్లీ కొత్త రూపంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒకప్పుడు భారతీయ రోడ్లపై ఎంతో ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్ (Bajaj Chetak) ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్‌గా తిరిగి వచ్చి వినియోగదారుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది.

ప్రస్తుతం చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు సాధారణంగా ఒకటి లేదా రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి. కానీ చేతక్ విషయంలో మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ఇది మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో బ్యాటరీ పరిమాణం, పనితీరు, ఫీచర్లలో కొంత తేడా ఉంటుంది. వాటి గురించి ఈ కింది కథణంలో చూద్దాం.

Bajaj Chetak Electric Scooter Variants Price Battery Range Charging Time Details

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు వేరియంట్లలో లభిస్తోంది. ఎంట్రీ లెవల్ చేతక్ 2501 వేరియంట్ ధర సుమారు రూ.87,100 కాగా, చేతక్ 3001 వేరియంట్ ధర రూ.1,02,505గా ఉంది. అదే సమయంలో చేతక్ 3503 వేరియంట్ ధర రూ.1,09,605గా నిర్ణయించారు. మరింత అధునాతన ఫీచర్లతో వచ్చే చేతక్ 3502 వేరియంట్ ధర రూ.1,22,605 కాగా, టాప్ వేరియంట్ అయిన చేతక్ 3501 ధర రూ.1,34,605గా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

బ్యాటరీ, రేంజ్ విషయానికి వస్తే ప్రతి వేరియంట్‌లో కొంత తేడా ఉంటుంది. చేతక్ 2501 వేరియంట్ 2.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 113 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. చేతక్ 3001 వేరియంట్‌లో 3.0 kWh బ్యాటరీ ప్యాక్ ఉండి ఒక్కసారి ఛార్జ్‌తో సుమారు 127 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

Bajaj Chetak Electric Scooter Variants Price Battery Range Charging Time Details

అదే సమయంలో చేతక్ 3503 వేరియంట్‌లో 3.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉండి సుమారు 151 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. టాప్ వేరియంట్‌లలో ఒకటైన చేతక్ 3502 కూడా 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండి ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 153 కిలోమీటర్ల వరకు నడపవచ్చని బజాజ్ పేర్కొంది. పనితీరు పరంగా కూడా వేరియంట్‌ను బట్టి గరిష్ట వేగం మారుతుంది.

చేతక్ 2501 వేరియంట్ గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. చేతక్ 3001, 3503 వేరియంట్‌లు గంటకు 63 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తాయి. అదే సమయంలో టాప్ వేరియంట్‌లైన చేతక్ 3501, 3502 గంటకు 73 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తాయి. బ్రేకింగ్ వ్యవస్థలో కొంత తేడా ఉంటుంది. టాప్ వేరియంట్‌లైన 3501, 3502 మోడళ్లలో ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, మిగతా వేరియంట్‌లలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

Bajaj Chetak Electric Scooter Variants Price Battery Range Charging Time Details

ఛార్జింగ్ విషయానికి వస్తే వేరియంట్‌ను బట్టి సమయం కొంత మారుతుంది. చేతక్ 2501 బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటల 25 నిమిషాలు పడుతుంది. చేతక్ 3001 వేరియంట్‌కు సుమారు 3 గంటల 50 నిమిషాలు, చేతక్ 3503, చేతక్ 3502 వేరియంట్‌ల సుమారు 3 గంటల 25 నిమిషాలు పడుతుంది. టాప్ వేరియంట్ చేతక్ 3501 మాత్రం సుమారు 3 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 16, 2026, 14:55 [IST]
English summary
Bajaj chetak electric scooter variants price battery range charging time details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+