ఈ స్కూటర్‌కు గుడి కట్టినా తక్కువే! ఇళ్లలోకి ప్రేమతో చొచ్చుకుపోతుంది.. 7 లక్షల మంది ఫేవరెట్

భారతదేశపు ఐకానిక్ స్కూటర్ 'బజాజ్ చేతక్(Bajaj Chetak) మరోసారి తన పూర్వ వైభవాన్ని చాటుకుంటోంది. ఒకప్పుడు పెట్రోల్ స్కూటర్లలో రారాజుగా వెలిగిన చేతక్(Bajaj Chetak), ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా అందుతున్న గణాంకాల ప్రకారం, బజాజ్ చేతక్(Bajaj Chetak) ఎలక్ట్రిక్ స్కూటర్ అక్షరాలా 7 లక్షల మంది భారతీయ వినియోగదారుల మనసు గెలుచుకుని, వారి ఇళ్లలో చేరిపోయింది. కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే ఈ స్కూటర్ అమ్మకాలు ఊహించని రీతిలో పుంజుకోవడం విశేషం.

ఏడేళ్ల ప్రయాణం..
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రయాణం జనవరి 2020లో ప్రారంభమైంది. అయితే, ప్రారంభంలో అమ్మకాలు నెమ్మదిగా సాగినప్పటికీ, గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2025 నుంచి 2027 వరకు) ఈ స్కూటర్ ఊహించని వేగాన్ని అందుకుంది.

Bajaj Chetak EV Hits 7 Lakh Sales Milestone The Rise of Indias Iconic Electric Scooter

వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. ఏప్రిల్ 2020 నుంచి మే 2026 వరకు మొత్తం 7,27,779 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొత్తం అమ్మకాల్లో దాదాపు 79 శాతం కేవలం గత రెండేళ్లలోనే జరగడం. అంటే సుమారు 5.77 లక్షల మంది వినియోగదారులు ఇటీవల కాలంలోనే చేతక్ వైపు మొగ్గు చూపారు.

అమ్మకాల్లో ఆకాశమే హద్దు
2025 ఆర్థిక సంవత్సరంలో బజాజ్ చేతక్ అమ్మకాలు ఏకంగా 114 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అంతకుముందు ఏడాది 1.11 లక్షల యూనిట్లు అమ్ముడవగా, 2025లో ఆ సంఖ్య 2.39 లక్షలకు చేరింది. ఇక 2026 ఆర్థిక సంవత్సరంలో మరింత దూకుడు ప్రదర్శించి 2.98 లక్షల యూనిట్ల మార్కును అందుకుంది.

Bajaj Chetak EV Hits 7 Lakh Sales Milestone The Rise of Indias Iconic Electric Scooter

ఈ జోరుతో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటర్స్ తర్వాత 7 లక్షల మార్కును దాటిన మూడవ అతిపెద్ద కంపెనీగా బజాజ్ ఆటో నిలిచింది. ముఖ్యంగా 2026లో బజాజ్ ఏథర్ ఎనర్జీని వెనక్కి నెట్టి రెండవ స్థానానికి చేరుకోవడం విశేషం.

కొత్త ఫీచర్లే విజయానికి కారణం
బజాజ్ కంపెనీ ఇటీవల చేతక్ లైన్-అప్‌ను అప్‌డేట్ చేసింది. కొత్తగా 'C సిరీస్' పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ స్కూటర్లలో అదిరిపోయే ఫీచర్లు, టాప్ స్పీడ్ (Top Speed), మెరుగైన రేంజ్‌ను అందించారు.

దీంతో పాటు ధర విషయంలో కూడా ఇతర కంపెనీలతో పోలిస్తే అందుబాటులో ఉండటం (రూ. 96,504 నుంచి రూ. 1.39 లక్షల వరకు) మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుంది. నేడు మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1 వంటి మోడళ్లకు చేతక్ గట్టి పోటీనిస్తోంది.

Bajaj Chetak EV Hits 7 Lakh Sales Milestone The Rise of Indias Iconic Electric Scooter

మార్కెట్ వాటాలో దూకుడు
2023 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4 శాతంగా ఉన్న బజాజ్ మార్కెట్ వాటా, 2026 నాటికి ఏకంగా 20 శాతానికి పెరిగింది. ఇక 2027 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన కేవలం 36 రోజుల్లోనే (ఏప్రిల్ 1 నుంచి మే 6 వరకు) బజాజ్ 39,500 యూనిట్లను డెలివరీ చేసింది.

ఈ స్వల్ప కాలంలోనే కంపెనీ తన మార్కెట్ వాటాను 22 శాతానికి పెంచుకుని టీవీఎస్ మోటర్స్‌కు చేరువగా నిలిచింది. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో బజాజ్ తన స్థానాన్ని స్థిరపరుచుకోవడమే కాకుండా, తన ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలను పంపిస్తోంది.

Article Published On: Friday, May 8, 2026, 7:20 [IST]
English summary
Bajaj chetak ev hits 7 lakh sales milestone the rise of indias iconic electric scooter
Read more on: #bajaj #electric scooter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+