330 కిమీ మైలేజ్ బైక్.. ప్రపంచంలో ఇదే మొట్టమొదటి మోడల్.. ఎంత మంది కొన్నారో తెలుసా?
భారత టూవీలర్ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన బజాజ్ ఆటో, ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ (CNG) మోటార్‌సైకిల్‌గా ఫ్రీడమ్ 125 (Freedom 125)ను మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. పెట్రోల్ ఖర్చులను తగ్గించుకునే అవకాశంతో పాటు సీఎన్‌జీ సాంకేతికతను బైక్‌లో అందించడం వల్ల ఈ మోడల్‌కు ప్రారంభంలో మంచి స్పందన లభించింది. అయితే తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు చూస్తే, ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఈ బైక్ ప్రస్తుతం మార్కెట్లో గట్టి సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. 2026 మే నెలలో బజాజ్ ఫ్రీడమ్ 125 అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దేశవ్యాప్తంగా ఆ నెలలో కేవలం 1,210 యూనిట్లు మాత్రమే విక్రయించబడటం గమనార్హం. ఈ సంఖ్య బైక్ విడుదలైనప్పటి నుంచి నమోదైన అత్యల్ప నెలవారీ అమ్మకాలుగా నిలిచింది.
ఒకప్పుడు కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన అందుకున్న ఈ మోడల్, ప్రస్తుతం అదే జోరును కొనసాగించలేకపోతున్నట్లు మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రత్యేకించి 2025 పండుగ సీజన్‌లో ఫ్రీడమ్ 125 అద్భుతమైన అమ్మకాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. అక్టోబర్ 2025లో 11,079 యూనిట్లు, నవంబర్ 2025లో 12,167 యూనిట్లు విక్రయించి రికార్డు స్థాయి డిమాండ్‌ను నమోదు చేసింది. కానీ తర్వాత అమ్మకాలు తగ్గుతూ ఇప్పుడు మే 2026లో అత్యల్ప స్థాయికి చేరుకుంది.

అయినప్పటికీ, ఫ్రీడమ్ 125 ప్రారంభం నుంచి ఇప్పటివరకు సాధించిన మొత్తం అమ్మకాలు గణనీయంగానే ఉన్నాయి. 2026 జూన్ 4 నాటికి ఇది మొత్తం 87,998 యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ఇది కొత్త సాంకేతికతతో వచ్చిన మోడల్‌కు నెగిటీవ్ కాకపోయినా, గతంలో కనిపించిన వేగంతో పోలిస్తే ప్రస్తుతం డిమాండ్ తగ్గినట్లు అర్థమవుతోంది. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ తగ్గుదలకు ప్రధాన కారణాల్లో ఒకటి ఇంధన ధరలలో కనిపిస్తున్న హెచ్చుతగ్గులు.
పెట్రోల్ ధరలు స్థిరంగా ఉండటం లేదా కొంత తగ్గడం వల్ల సీఎన్‌జీ బైక్ కొనుగోలు ద్వారా లభించే ఆదా ప్రభావం కొంత మేర తగ్గింది. అలాగే అనేక ప్రాంతాల్లో సీఎన్‌జీ ఫిల్లింగ్ స్టేషన్ల పరిమిత లభ్యత వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతున్న అంశం. దీంతో ఒకప్పుడు విప్లవాత్మక ఉత్పత్తిగా ప్రశంసలు అందుకున్న ఫ్రీడమ్ 125 ప్రస్తుతం మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కొత్త వ్యూహాలు అవలంబించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫ్రీడమ్ 125 ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో రూ.91,566 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌గా గుర్తింపు పొందిన ఈ బైక్, తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. పనితీరు విషయానికి వస్తే, ఫ్రీడమ్ 125లో 125సీసీ ఇంజిన్‌ను అందించారు. దీనికి 2 కిలోగ్రాముల సామర్థ్యం గల సీఎన్‌జీ ట్యాంక్‌తో పాటు 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్‌ను అమర్చారు.
దీంతో అవసరానికి అనుగుణంగా సీఎన్‌జీ లేదా పెట్రోల్ మోడ్‌లో ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ బైక్ పెట్రోల్‌పై లీటరుకు 64 కిలోమీటర్ల వరకు, సీఎన్‌జీపై కిలోగ్రాముకు 102 కిలోమీటర్ల వరకు మైలేజీని అందించగలదు. ఒకసారి ట్యాంక్ పూర్తిగా నింపితే గరిష్టంగా 330 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఫీచర్ల పరంగా కూడా ఫ్రీడమ్ 125 ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్‌లైట్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద సీటును అందించారు. దీని వల్ల ఇద్దరు వ్యక్తులు సుదీర్ఘ ప్రయాణాల్లో కూడా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. భద్రత విషయంలో కూడా ఈ బైక్‌కు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 11 భద్రతా పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన ఫ్రీడమ్ 125, వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది.


Click it and Unblock the Notifications