తాతల కాలం నుంచి ఈ బండి అంటే మనోళ్లకు ఓ అటాచ్‎మెంట్.. మార్కెట్లో దీని స్పీడ్ మామూలుగా లేదు

భారతదేశపు దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించిన సేల్స్ డేటాను విడుదల చేసింది. ఈ గణంకాలు చూస్తుంటే బజాజ్ తన పట్టును మార్కెట్లో ఏమాత్రం కోల్పోలేదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా బజాజ్ పల్సర్ సిరీస్ తన హవాను కొనసాగిస్తూ, మిగిలిన 12 మోడల్స్‌ను వెనక్కి నెట్టి నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. సామాన్యుడి నుంచి స్పోర్ట్స్ బైక్ ప్రియుల వరకు అందరినీ ఆకట్టుకుంటూ బజాజ్ దూసుకుపోతోంది. ఈ సేల్స్ రిపోర్ట్‌లో ఏయే బైక్‌లు ఎలా అమ్ముడయ్యాయి? ఎలక్ట్రిక్ స్కూటర్ల పరిస్థితి ఏంటి? ఏ మోడల్ అట్టడుగున నిలిచింది? వంటి ఆసక్తికరమైన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నెంబర్-1 స్థానంలో పల్సర్ 125
బజాజ్ ఆటో అమ్మకాల జాబితాను ఒకసారి పరిశీలిస్తే, బజాజ్ పల్సర్ 125cc (Pulsar 125cc) గంభీరంగా మొదటి స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 2026లో ఈ ఒక్క మోడల్‌నే ఏకంగా 58,056 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. గతేడాదితో పోలిస్తే దీని అమ్మకాలు 8 శాతం వృద్ధి చెందాయి. తక్కువ బడ్జెట్‌లో పల్సర్ లుక్, మంచి మైలేజీ కావాలనుకునే వారికి ఇది ఇప్పటికీ ఫేవరెట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా యువత ఈ బైక్ కోసం క్యూ కడుతుండటం విశేషం.

Bajaj Pulsar 125 Dominates February 2026 Sales Over 58 000 Units Sold in One Month

ప్లాటినా పరిస్థితి ఏంటి?
రెండో స్థానంలో పల్సర్ 160+200 (NS/RS) సిరీస్ నిలిచింది. దీని అమ్మకాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఫిబ్రవరి నెలలో 31,435 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో అత్యంత విశేషమైన విషయం ఏంటంటే, ఈ మోడల్ అమ్మకాలు ఏకంగా 97 శాతం జంప్ అయ్యాయి. ఇక మధ్యతరగతి ప్రజల మెచ్చిన బండి బజాజ్ ప్లాటినా (Platina) నాలుగో స్థానంలో ఉంది. ఇది 24,390 యూనిట్ల అమ్మకాలతో 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. అటు పల్సర్ 150cc మాత్రం కొంచెం డల్ అయింది. దీని అమ్మకాలు 4 శాతం తగ్గి 13,315 యూనిట్లకు పరిమితమయ్యాయి.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ హవా
ఈ సేల్స్ డేటాలో మరో హైలైట్ బజాజ్ చేతక్ (Bajaj Chetak) ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ మోడల్ ఫిబ్రవరిలో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 28,004 మంది ఈ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న క్రమంలో చేతక్ అమ్మకాలు 32 శాతం వృద్ధి చెందడం గమనార్హం. కేవలం పెట్రోల్ బైకులే కాకుండా ఎలక్ట్రిక్ విభాగంలో కూడా బజాజ్ తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లకు చేతక్ గట్టి పోటీనిస్తోంది.

Bajaj Pulsar 125 Dominates February 2026 Sales Over 58 000 Units Sold in One Month

షాకిచ్చిన పల్సర్ 220, అవెంజర్ 220!
పాతకాలపు మోడల్ అయినా ఇప్పటికీ పల్సర్ 220cc (Pulsar 220) అంటే అభిమానులకు ఉండే పిచ్చి వేరే లెవల్. ఈ బైక్ ఏకంగా 122 శాతం వృద్ధితో 8,459 యూనిట్లు అమ్ముడై ఆరో స్థానంలో నిలిచింది. అలాగే బజాజ్ అవెంజర్ 220cc (Avenger 220) ఏకంగా 454 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. క్రూయిజర్ బైక్ కావాలనుకునే వారికి తక్కువ ధరలో అవెంజర్ తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు. ఫిబ్రవరిలో 1,364 మంది ఈ బైక్‌ను ఇంటికి తీసుకెళ్లారు.

ప్రపంచపు తొలి సీఎన్‌జీ బైక్ ఫ్రీడమ్ స్పీడ్
బజాజ్ నుంచి వచ్చిన వినూత్న ప్రయోగం, ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ (CNG) బైక్ ఫ్రీడమ్ (Freedom) కూడా తన జోరును ప్రదర్శిస్తోంది. ఎనిమిదో స్థానంలో ఉన్న ఈ బైక్ ఫిబ్రవరిలో 1,461 యూనిట్లు అమ్ముడైంది. దీని అమ్మకాలు 42 శాతం పెరగడం విశేషం. పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలనుకునే వారు ఈ సీఎన్‌జీ బైక్ వైపు మొగ్గు చూపుతున్నారు. నెమ్మదిగా దేశవ్యాప్తంగా సీఎన్‌జీ పంప్‌లు అందుబాటులోకి వస్తుండటంతో ఈ బైక్ అమ్మకాలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది.

Bajaj Pulsar 125 Dominates February 2026 Sales Over 58 000 Units Sold in One Month

డోమినార్ పరిస్థితి, అవెంజర్ 180 వైఫల్యం!
ప్రీమియం విభాగంలో డోమినార్ 250 (Dominar 250), డోమినార్ 400 (Dominar 400) వరుసగా పది, పదకొండో స్థానాల్లో నిలిచాయి. డొమినార్ 250 అమ్మకాలు 57 శాతం పెరిగి 551 యూనిట్లుగా నమోదవ్వగా, డొమినార్ 400 మాత్రం కేవలం 386 యూనిట్లతో 2 శాతం వృద్ధిని మాత్రమే చూపించింది. మరోవైపు, పల్సర్ NS 400z అమ్మకాలు 21 శాతం తగ్గి 352 యూనిట్ల వద్ద నిలిచాయి. అయితే, ఈ లిస్ట్‌లో అత్యంత దారుణమైన ప్రదర్శన అవెంజర్ 180cc (Avenger 180) ది. ఫిబ్రవరి నెలలో ఒక్క కస్టమర్ కూడా ఈ బైక్‌ను కొనలేదు. ఫలితంగా ఈ మోడల్ అమ్మకాలు 100 శాతం క్షీణించాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 24, 2026, 17:01 [IST]
English summary
Bajaj pulsar 125 dominates february 2026 sales over 58 000 units sold in one month
Read more on: #bajaj #bajaj pulsar #scooter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+