యువత కలల బైక్ బర్త్‌డే.. కస్టమర్లకు అదిరిపోయే గిఫ్ట్! రూ.7,000లతో పాటు ఫ్రీ సర్వీసింగ్!
భారతదేశంలో స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను కొత్త దిశలో నడిపించిన బ్రాండ్‌గా బజాజ్ పల్సర్ (Bajaj Pulsar)కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు దేశీయ మార్కెట్‌లో కమ్యూటర్ బైక్‌లే ప్రధానంగా ఉన్న సమయంలో, పవర్, స్టైల్, పనితీరును కలిపిన స్పోర్టీ మోటార్‌సైకిల్‌ను సామాన్య యువతకు చేరువ చేసిన ఘనత పల్సర్‌కే దక్కుతుంది. ఆకర్షణీయమైన డిజైన్, బలమైన ఇంజిన్, దూకుడు పనితీరు కలయికతో పల్సర్ క్రమంగా యువత కలల బైక్‌గా మారింది. కాలక్రమేణా కస్టమర్ల అభిరుచులు మారుతున్నప్పటికీ, బజాజ్ పల్సర్ కూడా అదే వేగంతో తనను తాను మార్చుకుంటూ వచ్చింది. కొత్త టెక్నాలజీ, మెరుగైన ఇంజిన్ ట్యూనింగ్, ఆధునిక ఫీచర్లు, అగ్రెసివ్ డిజైన్ అప్‌డేట్స్ ఇవన్నీ పల్సర్‌ను మార్కెట్లో ఎప్పటికప్పుడు తాజాగా ఉంచాయి.
ఈ నిరంతర ప్రయాణమే పల్సర్‌ను 25 సంవత్సరాల పాటు భారత మార్కెట్‌లో నిలబెట్టింది. ఇప్పుడు ఈ ఐకానిక్ బ్రాండ్ తన ప్రయాణంలో గొప్ప మైలురాయిని చేరుకుంది. ఈ 25 సంవత్సరాల విజయాన్ని ఘనంగా జరుపుకునేందుకు బజాజ్ ఆటో ప్రత్యేకంగా '25 సంవత్సరాల పల్సర్ సెలబ్రేషన్ ఆఫర్'ను ప్రకటించింది. ఇది ఒక ప్రమోషనల్ ఆఫర్ మాత్రమే కాదు, పల్సర్‌ను ఆదరించిన లక్షలాది యువతకు కంపెనీ అందిస్తున్న ఒక కృతజ్ఞతగా కూడా చెప్పుకోవచ్చు.

ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా, ఎంపిక చేసిన పల్సర్ మోడళ్లపై రూ.7,000 వరకు ప్రయోజనాలను బజాజ్ ఆటో అందిస్తోంది. ఈ సెలబ్రేషన్ ఆఫర్ ద్వారా మరింత మంది యువతకు స్పోర్ట్స్ బైకింగ్‌ను చేరువ చేయాలన్నదే కంపెనీ ప్రధాన లక్ష్యం. పవర్‌ఫుల్ బైక్ కల కొనాలని ఆశపడుతున్న యువతకు, ఈ ఆఫర్ మంచి అవకాశం అని చెప్పాలి. పల్సర్ బైక్‌లు, పనితీరు, స్టైల్ పరంగా కొత్త రైడర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇప్పటికే ఈ 25 సంవత్సరాల పల్సర్ వేడుక ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత బజాజ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి వచ్చింది. కాబట్టి పల్సర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న యువతకు ఇది సరైన సమయంగా మారింది. రెండు దశాబ్దాలకుపైగా భారత రోడ్లపై తన ప్రభావాన్ని చూపించిన పల్సర్, ఇప్పుడు ఈ ప్రత్యేక ఆఫర్‌తో మరోసారి మార్కెట్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది.

ఈ వార్షికోత్సవ ఆఫర్లలో కేవలం డిస్కౌంట్ మాత్రమే కాకుండా, సేవింగ్స్ ప్యాకేజ్, ప్రాసెసింగ్ ఫీజు లేకపోవడం, అలాగే ఐదు ఉచిత సర్వీసులు వంటి అదనపు లాభాలు కూడా ఉన్నాయి. ఇవి బైక్ కొనుగోలు చేసిన తర్వాత కూడా కస్టమర్లకు మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గేలా సహాయపడతాయి. ముఖ్యంగా యువ రైడర్లకు, మొదటిసారి స్పోర్ట్స్ బైక్ కొనుగోలు చేసే వారికి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.
ఈ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉన్న ప్రత్యేక కస్టమర్ ఆఫర్ ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో అమల్లోకి వచ్చింది. మోడల్, ప్రాంతాన్ని బట్టి ప్రయోజనాలు కొద్దిగా మారవచ్చు అని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ శ్రేణి విస్తృత ధర పరిధిలో అందుబాటులో ఉంది. పల్సర్ మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ. 85,633 నుంచి రూ. 1,92,794 వరకు ఉన్నాయి.

ఈ ధర శ్రేణి వల్ల ఎంట్రీ-లెవల్ స్పోర్ట్స్ బైక్‌ను కోరుకునే యువత నుంచి, ఎక్కువ పవర్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కూడిన మోడళ్లను ఆశించే రైడర్ల వరకు అందరికీ సరిపోయే పల్సర్ బైక్ ఒకటి తప్పకుండా లభిస్తోంది. ఇంజిన్ సామర్థ్యాల పరంగా చూస్తే, పల్సర్ శ్రేణి 125cc నుంచి 400cc వరకు విస్తరించి ఉండటం దీని బలమైన ప్రత్యేకత. మొత్తం మీద ప్రస్తుతం పల్సర్ లైనప్‌లో 11 వేర్వేరు మోడళ్లు ఉన్నాయి.
ఈ విభిన్న ఎంపికలు కస్టమర్ల అవసరాలు, బడ్జెట్, రైడింగ్ స్టైల్‌ను బట్టి సరైన బైక్‌ను ఎంచుకునే అవకాశాన్ని ఇస్తున్నాయి. పల్సర్ 125 ఈ శ్రేణిలో ఎంట్రీ-లెవల్ మోడల్‌గా నిలుస్తోంది. స్పోర్టీ లుక్‌తో పాటు తక్కువ ధరలో పల్సర్ అనుభవాన్ని అందించే ఈ మోడల్, మొదటిసారి స్పోర్ట్స్ బైక్ కొనుగోలు చేసే యువతకు మంచి ఎంపికగా ఉంది. దీని తర్వాత పల్సర్ N150, పల్సర్ 150, పల్సర్ N160 మోడళ్లు వస్తాయి.


Click it and Unblock the Notifications








