బజాజ్ పల్సర్ ఫ్యాన్స్‌కు గట్టి షాక్.. లాంచ్ అయి రెండేళ్లు కూడా కాలేదు.. అప్పుడే ప్యాకప్ చెప్పేసింది
బజాజ్ పల్సర్ బైక్ లవర్స్‌కు కంపెనీ ఒక కోలుకోలేని గట్టి షాక్ ఇచ్చింది. తన పాపులర్ పల్సర్ సిరీస్‌లో 125 సీసీ విభాగంలో వచ్చిన పల్సర్ N125 (Pulsar N125) మోడల్‌ను బజాజ్ ఆటో ఇండియాలో నిలిపివేసింది. ఆటోమొబైల్ నివేదికల ప్రకారం.. ఈ బైక్ ఇంకా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నప్పటికీ, డీలర్లకు ఈ బైక్ సప్లయ్‌ను (డీలర్ డిస్పాచ్) కంపెనీ పూర్తిగా ఆపేసింది.
అయితే, ఈ బైక్ ఉత్పత్తిని కంపెనీ పూర్తిగా ఆపలేదు. నేపాల్, పెరూ, కొలంబియా, మొరాకో వంటి ఇతర దేశాలకు ఈ బైక్‌ను ఎగుమతి (Export) చేయడానికి మాత్రమే ప్రస్తుతం ప్రొడక్షన్ కొనసాగిస్తున్నారు. కేవలం భారత మార్కెట్లో మాత్రమే దీని అమ్మకాలను నిలిపివేశారు.

ఈ స్పోర్టీ లుక్ బైక్ అక్టోబర్ 2024 లో భారత మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. కానీ, మార్కెట్లోకి వచ్చిన రెండు సంవత్సరాల లోపే ఈ బైక్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం కస్టమర్ల నుండి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడమే. అయితే పల్సర్ ఫ్యాన్స్ మరీ అంత నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బజాజ్ కంపెనీ ఈ 125 సీసీ బైక్‌ను సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో మళ్లీ మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది.
బజాజ్ కంపెనీ పల్సర్ N125 మోడల్‌ను సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై డిజైన్ చేసింది. పల్సర్ సిరీస్‌లోని మరే ఇతర బైక్‌కు లేని విధంగా దీనికి సరికొత్త ఇంజన్‌ను కూడా ఇచ్చారు. కేవలం 125 కిలోల బరువుతో ఇప్పటివరకు వచ్చిన పల్సర్ బైక్‌లన్నింటిలోనూ ఇది అత్యంత తేలికైన బైక్‌గా నిలిచింది.

టెక్నికల్‌గా ఈ బైక్ చాలా బాగున్నప్పటికీ, దీని డిజైన్ మాత్రం భారతీయ కస్టమర్లకు అస్సలు నచ్చలేదు. పల్సర్ బైక్ అనగానే అందరికీ గుర్తొచ్చే మస్కులర్, లావుపాటి లుక్ కాకుండా.. ఈ N125 మోడల్‌ను చాలా స్లిమ్‌గా, విభిన్నంగా డిజైన్ చేశారు.
ఈ మోడరన్ లుక్ కస్టమర్లను ఆకట్టుకోలేకపోయింది. ఇండియన్ బైకర్లు రోడ్డుపై వెళ్తుంటే గంభీరంగా కనిపించే (భారీ రోడ్ ప్రెజెన్స్ ఉన్న) బైక్‌లనే ఎక్కువగా ఇష్టపడతారు. దీనివల్ల ఇదే సెగ్మెంట్లో ఉన్న హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ (Hero Xtreme 125R), హోండా సిబి125 హార్నెట్ (Honda CB125 Hornet) వంటి ప్రత్యర్థి బైక్‌లు మార్కెట్లో దూసుకుపోయాయి.

అంతేకాకుండా, ఈ రోజుల్లో 125 సీసీ బైక్‌లలో కూడా టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏబీఎస్ (ABS) వంటి ఫ్యాన్సీ ఫీచర్లు కస్టమర్లు కోరుకుంటున్నారు. కానీ పల్సర్ N125 లో ఈ ఫీచర్లు లేకపోవడం కూడా ఒక మైనస్ పాయింట్‌గా మారింది.
ఈ లోపాలన్నింటినీ సరిదిద్ది బజాజ్ కంపెనీ సరికొత్త మోడల్‌ను సిద్ధం చేస్తోంది. నివేదికల ప్రకారం.. 2027 బజాజ్ పల్సర్ N125 మోడల్ వచ్చే ఏడాది అంటే 2027 జనవరి నుండి మార్చి మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించిన ఫోటోల ప్రకారం.. కొత్త బైక్ పాతదాని కంటే చాలా పెద్దదిగా, ప్రీమియం లుక్‌తో, షార్ప్ డిజైన్‌తో రాబోతోంది. ముఖ్యంగా దీని ఫ్రంట్ లుక్ చాలా అగ్రెసివ్‌గా ఉండబోతోంది. పెద్ద హెడ్‌ల్యాంప్ కౌల్, కొత్త బాడీ ప్యానెల్స్ దీనికి క్రేజీ లుక్ ఇవ్వనున్నాయి.
దీనితో పాటు స్ప్లిట్ సీట్ సెటప్, కొత్త రియర్ గ్రాబ్ రైల్స్, ఫుల్లీ కవర్డ్ చైన్ కవర్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, రియర్ మోనోషాక్ సస్పెన్షన్ వంటి ఎన్నో అప్‌డేట్స్ ఇందులో ఉండబోతున్నాయి. ఈ బైక్ ముందు, వెనుక భాగాలలో అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్ స్టాండర్డ్‌గా రానున్నాయి.


Click it and Unblock the Notifications