పెళ్లికూతురిలా బంగారం రంగు వేస్కొని వచ్చింది ..కేవలం రూ.1.22లక్షల్లో Bajaj Pulsar N160 కొత్త వేరియంట్ లాంచ్

భారతదేశ టూ వీలర్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడపోయే పల్సర్ బైకుల్లో బజాజ్ ఆటో సంస్థ ఒక సరికొత్త సంచలనానికి తెరలేపింది. తన పాపులర్ మోడల్ పల్సర్ N160 (Bajaj Pulsar N160) రేంజ్‌లో సరికొత్త ప్రీమియం వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1.22 లక్షలుగా (ఇంట్రడక్టరీ ప్రైస్) నిర్ణయించారు. ఇన్నాళ్లూ భారీ రేసింగ్ బైకులకు మాత్రమే పరిమితమైన క్రేజీ ఫీచర్లను ఈ సరికొత్త పల్సర్‌లో అందించడం విశేషం. కాన్ఫిడెంట్ హ్యాండ్లింగ్, అదిరిపోయే స్పోర్టీ లుక్స్‌తో రోజువారీ ప్రయాణాలను మరింత సుఖవంతం చేయడానికి ఈ బైక్ దూసుకొచ్చింది.

ఈ సరికొత్త పల్సర్ N160 లో కస్టమర్లను ఇట్టే ఆకట్టుకునే అతిపెద్ద అప్‌డేట్ ఏంటంటే.. దీనికి అమర్చిన గోల్డెన్ అప్‌సైడ్-డౌన్ (USD) ఫ్రంట్ ఫోర్క్స్. ఈ గోల్డెన్ కలర్ సస్పెన్షన్ బైక్‌కు ఒక రేసింగ్ లుక్‌ను ఇవ్వడమే కాకుండా, రోడ్లపై సడన్ టర్నింగ్స్ తీసుకునేటప్పుడు, హైస్పీడ్‌లో వెళ్తున్నప్పుడు బైక్ అస్సలు ఊగకుండా అద్భుతమైన స్టెబిలిటీని, రోడ్ గ్రిప్‌ను అందిస్తుంది.

bajaj pulsar n160 new variant launched price specs golden usd forks pulsar ns400z details telugu

బైక్ నడిపే కుర్రాళ్ల సేఫ్టీ కోసం బజాజ్ ఈ వేరియంట్‌లో పవర్‌ఫుల్ ఫీచర్లను జోడించింది. ఇందులో మొదటిసారిగా అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ (Slipper Clutch) టెక్నాలజీని ఇచ్చారు. దీనివల్ల ట్రాఫిక్‌లో గేర్లు డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు వెనుక చక్రం లాక్ అవ్వకుండా చాలా స్మూత్ రైడింగ్ అనుభూతి లభిస్తుంది. అలాగే, ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (Dual-Channel ABS) భద్రతను కూడా కల్పించారు.

bajaj pulsar n160 new variant launched price specs golden usd forks pulsar ns400z details telugu

టెక్నాలజీ లవర్స్ కోసం ఈ బైక్‌లో అప్‌డేటెడ్ నెగటివ్ ఎల్‌సీడీ డిజిటల్ డిస్ప్లేను అమర్చారు. దీని టాప్ ఎండ్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు విభిన్న రోడ్ల కోసం ప్రత్యేకమైన రైడింగ్ మోడ్స్ కూడా లభిస్తాయి. ప్రయాణంలో మొబైల్ ఛార్జింగ్ అయిపోకుండా ఉండేందుకు వీలుగా ఫ్యూయల్ ట్యాంక్ సరిహద్దుల్లోనే ఒక USB Type-C ఛార్జింగ్ పోర్టును కూడా అమర్చారు. రాత్రి వేళల్లో రోడ్లు క్లియర్‌గా కనిపించేందుకు ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, సింగిల్-పీస్ సీట్ సెటప్‌ను ఇచ్చారు.

bajaj pulsar n160 new variant launched price specs golden usd forks pulsar ns400z details telugu

మెకానికల్ విషయానికి వస్తే బైక్ ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో పాత నమ్మకమైన 164.82 సీసీ సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌నే వాడారు. ఇది 15.7 bhp పవర్, 14.65 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. ఈ బైక్ పాత కలర్ ఆప్షన్లయిన పర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, గ్రే మరియు బ్రూక్లిన్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. మార్కెట్లో ఇది టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160, యమహా ఎఫ్‌జెడ్, హీరో ఎక్స్‌ట్రీమ్ 160 4V లతో గట్టిగా పోటీ పడనుంది.

పల్సర్ N160 తో పాటు బజాజ్ ఆటో సంస్థ తన ఫ్లాగ్‌షిప్ బైక్ Bajaj Pulsar NS400Z సరికొత్త వెర్షన్‌ను కూడా మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో సరికొత్త 349 సీసీ ఇంజన్‌ను వాడారు. ఈ అప్‌డేట్ వల్ల ఈ బైక్ ఇప్పుడు 18% జీఎస్టీ పరిధిలోకి రావడంతో దీని ధర భారీగా తగ్గింది. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1,80,092 గా నిర్ణయించారు. ఈ 349cc ఇంజన్ ఏకంగా 40.6 bhp పవర్, 33.2 Nm టార్క్ జనరేట్ చేస్తూ రైడర్లకు నెక్స్ట్ లెవెల్ థ్రిల్‌ను అందిస్తుంది.

Article Published On: Thursday, May 21, 2026, 17:20 [IST]
English summary
Bajaj pulsar n160 new variant launched price specs golden usd forks pulsar ns400z details telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+