బంగారం లాంటి బైక్.. ఇప్పుడు రేటు కూడా రూ.24 వేలు తగ్గింది.. ఇక షోరూంలకు పరిగెత్తండి

భారతీయ టూ వీలర్ మార్కెట్లో మళ్లీ పెద్ద సంచలనం రేపింది బజాజ్ ఆటో(Bajaj Auto). ముఖ్యంగా యూత్‎లో భారీ క్రేజ్ ఉన్న బజాజ్ పల్సర్ NS400Z(Bajaj Pulsar NS400Z)ను ఇప్పుడు కొత్త రూపంలో, ఇంకా ముఖ్యంగా తక్కువ ధరలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. పెట్రోల్ ధరలు, బైక్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో... "పవర్ ఉన్న బైక్ కావాలి కానీ బడ్జెట్ లో ఉండాలి" అనుకునే వారికి శుభవార్త అనే చెప్పాలి.

రోడ్ల మీద స్పీడుగా దూసుకెళ్లే యూత్‎కు ఎంతో ఇష్టమైన బ్రాండ్ పల్సర్. ఇప్పుడు బజాజ్ ఆటో తన పల్సర్ అభిమానుల కోసమే ఈ ఆఫర్ తీసుకొచ్చింది. తన ఫ్లాగ్‌షిప్ మోడల్ పల్సర్ NS400Zను సరికొత్త ఇంజిన్ మార్పులతో, భారీగా తగ్గించిన ధరతో మళ్ళీ లాంచ్ చేసింది. మిడిల్ క్లాస్ కుర్రాళ్లు కూడా తక్కువ ధరలో ఎక్కువ పవర్ ఉన్న బైక్ నడపాలనే కలని నిజం చేస్తూ బజాజ్ ఈ డెసిషన్ తీసుకుంది.

Bajaj Pulsar NS400Z Relaunched Slashed Price New 349cc Engine Most Affordable 40BHP Bike

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ (GST 2.0) నిబంధనల ప్రకారం.. 350cc కంటే తక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైకుల మీద ఉన్న ట్యాక్స్ 28% నుంచి 18%కి తగ్గుతుంది. అందుకే బజాజ్ తన NS400Zలోని ఇంజిన్‎ను 373cc నుంచి 349ccకి తగ్గించింది. దీని వల్ల ప్రభుత్వం వేసే ట్యాక్స్ ఆదా అయి బైక్ ధర కూడా భారీగా తగ్గింది. ఎక్స్-షోరూమ్ ధర గతంలో రూ.1,93,900 ఉండగా ప్రస్తుతం మారిన ధర రూ.1,80,092కి చేరింది. అంటే దాదాపు రూ.14,000 ఎక్స్-షోరూమ్ ధర తగ్గింది.

ధర తగ్గడం వల్ల కేవలం షోరూమ్ రేటులోనే కాదు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ప్రీమియంలో కూడా కస్టమర్లకు భారీగా ఆదా అవుతుంది. మొత్తానికి ఒక కస్టమర్ ఈ బైక్ కొనుగోలు సుమారుగా రూ.24,500 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. 40 హార్స్‌పవర్ ఇచ్చే బైక్ ఇంత తక్కువ ధరకు దొరకడం మన దేశంలో ఇదే మొదటి సారి.

Bajaj Pulsar NS400Z Relaunched Slashed Price New 349cc Engine Most Affordable 40BHP Bike

కొత్త బజాజ్ పల్సర్ NS400Zలో 349.13cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ వాడారు. ఇది డామినార్ 400 ఇంజిన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది 40.6 హార్స్ పవర్ శక్తిని (గతంలో 43 PS ఉండేది), 33.2 Nm (గతంలో 35 Nm ఉండేది) టార్క్ అందిస్తుంది. పవర్, టార్క్‌లో కొద్దిగా మార్పులు ఉన్నప్పటికీ, బైక్ వెయిట్, పవర్ రేషియో అద్భుతంగా ఉందని బజాజ్ చెబుతోంది. అంటే పికప్ విషయంలో కస్టమర్లకు పెద్దగా తేడా తెలియదు.

బైక్ ఇంజిన్ కెపాసిటీ తగ్గినప్పటికీ, ఫీచర్లలో కంపెనీ ఎటువంటి రాజీ పడలేదు. పాత మోడల్‌లో ఉన్న అన్ని అత్యాధునిక ఫీచర్లు ఇందులోనూ ఉన్నాయి. ఇందులో 4 రకాల రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ (Traction Control) సిస్టమ్ అందించారు.

Bajaj Pulsar NS400Z Relaunched Slashed Price New 349cc Engine Most Affordable 40BHP Bike

క్విక్ షిఫ్టర్ (Quick-shifter), బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఇక డిజైన్ విషయానికి వస్తే అగ్రెసివ్ లుక్, రేడియల్ టైర్స్, స్ట్రాంగ్ బాడీ వర్క్ అలాగే ఉన్నాయి.

బజాజ్ ఆటో మోటార్ సైకిల్ బిజినెస్ ప్రెసిడెంట్ సారంగ్ కనాడే మాట్లాడుతూ.. "పల్సర్ అంటేనే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే పవర్ ఫుల్ బైక్. ఈ కొత్త 349cc ఇంజిన్‌తో మేము పల్సర్ అనుభవాన్ని మరింత తక్కువ ధరకే కస్టమర్లకు అందజేస్తున్నాం. జీఎస్‌టీ ప్రయోజనాన్ని నేరుగా కస్టమర్లకే బదిలీ చేస్తున్నాం" అని తెలిపారు.

Article Published On: Thursday, April 30, 2026, 20:18 [IST]
English summary
Bajaj pulsar ns400z relaunched slashed price new 349cc engine most affordable 40bhp bike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+