ఈవీ మార్కెట్లో బజాజ్ సునామీ.. సింగిల్ ఛార్జ్‌తో ఊరంతా చుట్టేయొచ్చు

భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ఇప్పుడు అసలైన యుద్ధం మొదలైంది. ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చలాయించిన ఓలా ఎలక్ట్రిక్ జోరు తగ్గడం, సంప్రదాయ దిగ్గజాలైన టీవీఎస్ (TVS), బజాజ్ (Bajaj) దూకుడు పెంచడంతో రంగం రసవత్తరంగా మారింది.

ప్రస్తుతం మార్కెట్‌లో టీవీఎస్ నంబర్ వన్ స్థానంలో ఉండగా, దాన్ని అధిగమించేందుకు బజాజ్ ఆటో తన అమ్ములపొదిలోని చేతక్(Chetak) అస్త్రాన్ని మరింత పదును పెడుతోంది. జనవరి 14, 2026న రాబోతున్న సరికొత్త వేరియంట్‌తో మార్కెట్ సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి.

bajaj tightens the reins on tv new high-spec chetak ev with bigger battery coming soon

2025 సంవత్సరం ముగిసే సమయానికి టీవీఎస్ మోటార్ కంపెనీ సుమారు 23 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. టీవీఎస్ ఐక్యూబ్ (iQube) మోడల్ స్థిరమైన అమ్మకాలతో దూసుకుపోతోంది. అయితే, బజాజ్ చేతక్ కూడా ఏమాత్రం తగ్గకుండా 21 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుని రెండో స్థానంలో నిలిచింది.

గతేడాది బజాజ్ ఏకంగా 2.70 లక్షల స్కూటర్లను విక్రయించి 40 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇప్పుడు ఈ గ్యాప్‌ను భర్తీ చేసి, అగ్రపీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా బజాజ్ కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది.

bajaj tightens the reins on tv new high-spec chetak ev with bigger battery coming soon

కొత్త చేతక్ 2026 ప్రత్యేకతలు?
జనవరి 14న లాంచ్ కాబోతున్న కొత్త చేతక్ వేరియంట్ గురించి ఆటోమొబైల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఇది ప్రస్తుత ప్రీమియం మోడల్ కంటే భిన్నంగా, అందరికీ అందుబాటులో ఉండే ఎంట్రీ-లెవల్(Entry-level) స్కూటర్‌గా రాబోతోంది.

ఇప్పటివరకు చేతక్ స్కూటర్లలో మిడ్-డ్రైవ్ మోటార్ ఉండగా, ఖర్చు తగ్గించి సామాన్యులకు చేరువయ్యేలా ఈ కొత్త వెర్షన్‌లో హబ్-మౌంటెడ్ మోటార్‌ను వాడబోతున్నారు. దీని వెనుక భాగంలో ఒక హారిజాంటల్ ఎల్‌ఈడీ బార్, ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్లతో కొత్త లుక్ ఇవ్వబోతున్నారు. అలాగే మెటల్ బాడీకి బదులుగా బరువు తక్కువగా ఉండే ప్లాస్టిక్ లేదా ఫైబర్ మెటీరియల్‌ను వాడే అవకాశం ఉంది.

bajaj tightens the reins on tv new high-spec chetak ev with bigger battery coming soon

ప్రస్తుతం ఉన్న 3 kWh, 3.5 kWh బ్యాటరీల కంటే మెరుగైన ఆప్షన్లను బజాజ్ పరిశీలిస్తోంది. ప్రస్తుతం చేతక్ 3503 ఒకే ఛార్జ్‌తో 155 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, కొత్త మోడల్ కూడా సిటీ అవసరాలకు తగ్గట్టుగా 120-150 కి.మీ రేంజ్ ఇచ్చేలా రూపొందిస్తున్నారు.

ఈసారి బజాజ్ దృష్టి కేవలం యువతపైనే కాదు, ఫ్యామిలీ కస్టమర్ల మీద కూడా ఉంది. ఏథర్ రిజ్టా(Rizta)కు పోటీగా ఇందులో 35 లీటర్ల భారీ అండర్-సీట్ స్టోరేజ్, వెడల్పాటి సీటును అందిస్తున్నారు. స్మార్ట్ ఫీచర్ల విషయానికొస్తే.. బ్లూటూత్ కనెక్టివిటీ, కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఈజీ హ్యాండ్లింగ్ వంటివి అదనపు ఆకర్షణలు. ముఖ్యంగా ఇరుకైన సిటీ రోడ్లపై సులభంగా నడిపేలా దీనిని కాంపాక్ట్ డిజైన్‌తో తీర్చిదిద్దుతున్నారు.

bajaj tightens the reins on tv new high-spec chetak ev with bigger battery coming soon

ప్రస్తుతం చేతక్ ధరలు రూ.లక్ష నుంచి రూ.1.35లక్షల వరకు ఉన్నాయి. కానీ ఈ నెల 14న రాబోయే కొత్త వేరియంట్ ధర రూ.85,000 నుంచి రూ.95,000 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇదే జరిగితే, టీవీఎస్ ఆర్బిటర్(Orbiter), హీరో విడా VX2 వంటి బడ్జెట్ ఈవీలకు ఇది గట్టి సవాలు విసరడం ఖాయం.

ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు, అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్ హెచ్చుతగ్గుల నేపథ్యంలో భారతీయులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో బజాజ్ చేతక్ కొత్త అవతారంలో రావడం మార్కెట్‌లో సంచలనం సృష్టించనుంది. టీవీఎస్ తన స్థానాన్ని కాపాడుకుంటుందో లేక బజాజ్ తన కొత్త స్కూటరుతో రేసులో ముందుకెళ్తుందో చూడాలి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 7, 2026, 11:50 [IST]
English summary
Bajaj tightens the reins on tv new high spec chetak ev with bigger battery coming soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+