నవంబర్ ముగిసేలోపు బైక్ కొనాలనుకుంటున్నారా? పాత ధరలకే సొంతం చేసుకునే ఛాన్స్, ఈ బైక్‌లు బెస్ట్!

ఇటీవలి నవంబర్ ధరల సవరణల తర్వాత 100–125సీసీ సెగ్మెంట్‌లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? నవంబర్ 23–27 మధ్య హీరో స్ప్లెండర్ ప్లస్ ధరలు కాస్త పెరిగాయి. నవంబర్ 30 లోపు బుక్ చేసుకుంటే పాత ధరలకే సొంతం చేసుకోవచ్చని డీలర్లు సూచిస్తున్నారు. డిసెంబర్‌లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొనుగోలుదారులకు నిజమైన ఆదాను అందించే బైక్‌ల వివరాలు ఇక్కడ చూద్దాం.

కమ్యూటర్ సెగ్మెంట్‌లో మైలేజే అత్యంత కీలకమైన అంశం. అందుకే ARAI ధృవీకరించిన మైలేజ్‌తో పాటు వాహనదారులు నిజ జీవితంలో పొందుతున్న మైలేజ్ వివరాలను ఇక్కడ పోల్చాం. వీటితో పాటు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉన్న ఆన్-రోడ్ ధరలు, ఈఎమ్‌ఐ వివరాలను అందించాం. ప్రతిరోజూ 40 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణిస్తూ, పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Best 100-125cc Mileage Bikes in India 2026: Price Hike Alerts and Buying Guide for November

అధిక మైలేజ్ ఇచ్చే 100–125సీసీ బైక్‌లు: ARAI వర్సెస్ రియల్ వరల్డ్ మైలేజ్

మోడల్ ARAI మైలేజ్ యజమానులు చెబుతున్న మైలేజ్
Hero Splendor Plus (100cc) 70 kmpl 62 kmpl
Bajaj Platina 100 70 kmpl 74.6 kmpl
TVS Sport (110cc) 80 kmpl 70 kmpl
Hero HF Deluxe (100cc) 68 kmpl ~70 kmpl
Honda SP125 (125cc) 61.5 kmpl ~54 kmpl

మూలాలు: ARAI మరియు స్ప్లెండర్ ప్లస్ టెస్టింగ్ వివరాల కోసం Autocar India; SP125, TVS Sport, CT/Platina మరియు రైడర్ యావరేజ్ మైలేజ్ కోసం ZigWheels, BikeWale; HF Deluxe కోసం హీరో అధికారిక వెబ్‌సైట్ డేటాను పరిశీలించాం. పోలిక కోసం ARAI మైలేజ్‌ను, సిటీ ట్రాఫిక్‌లో రోజువారీ ప్రయాణ బడ్జెట్ కోసం రైడర్ల సగటు మైలేజ్‌ను ప్రామాణికంగా తీసుకోండి.

తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధరలు, ఈఎమ్‌ఐ వివరాలు

హైదరాబాద్ డీలర్ల వివరాల ప్రకారం స్ప్లెండర్ ప్లస్ ధర వేరియంట్‌ను బట్టి సుమారు ₹96,800 నుంచి ₹1.02 లక్షల వరకు ఉంది. అదే విజయవాడలో ఆర్‌టీఓ, సేఫ్టీ సెస్‌లతో కలిపి ఆన్-రోడ్ ధర ప్రారంభంలో ₹95,853 వరకు ఉంది. ప్లాటినా 100 విషయానికి వస్తే హైదరాబాద్‌ ఆన్-రోడ్ ధర సుమారు ₹87,317గా ఉంది. 36 నెలల వ్యవధి ఉన్న ఈఎమ్‌ఐల విషయానికొస్తే ప్లాటినాకు నెలకు దాదాపు ₹2,995, విజయవాడలో స్ప్లెండర్ ప్లస్‌కు ₹3,288 వరకు ఉంటుంది. ఫైనల్ చేసుకునే ముందు ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లను ఒకసారి సరిచూసుకోండి.

ఈ వారం పెరిగిన ధరలు, వేరియంట్ వివరాలు

నవంబర్ 23 ప్రాంతంలో హీరో స్ప్లెండర్ ప్లస్ లైనప్‌లోని బైక్‌ల ధరలు స్వల్పంగా పెరిగాయి. పాత ధరలకే బైక్ పొందాలంటే నవంబర్ 30 లోపు బుక్ చేసుకోవాలని తెలుగు రాష్ట్రాల డీలర్లు కోరుతున్నారు. ఇక హోండా షైన్, SP125 ఆన్-రోడ్ ధరలు నవంబర్ మధ్యలో అప్‌డేట్ కాగా, నవంబర్ 24–27 మధ్య ఎలాంటి మార్పులు జరగలేదు. బజాజ్ బైక్‌ల ధరలు కూడా అంతకుముందు జరిగిన సవరణల ప్రకారమే ఉన్నాయి. ఏ బైక్ బుక్ చేసుకునే ముందైనా మీ నగరంలోని ఎక్స్-షోరూమ్ ధరలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.

ఇప్పుడే కొనాలా? డిసెంబర్ ధరల పెంపు వరకు ఆగాలా?

పండుగ సీజన్ సేల్స్ తగ్గకుండా ఉండేందుకు కంపెనీలు నవంబర్‌లో ధరల పెంపును చాలా పరిమితంగా ఉంచాయి. అయితే స్ప్లెండర్ ప్లస్ విషయంలో డీలర్లు నవంబర్‌లోనే బుకింగ్స్ చేసుకోమని చెబుతున్నందున, డిసెంబర్ ప్రారంభంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మైలేజే మీ ప్రథమ ప్రాధాన్యత అయ్యి.. స్ప్లెండర్, ప్లాటినా లేదా TVS Sport బైక్‌లలో ఏదో ఒకటి కొనాలనుకుంటే ఇప్పుడే ధరను లాక్ చేయడం మంచిది. లేదంటే డిసెంబర్ ప్రారంభంలో వచ్చే ఫైనాన్స్ లేదా యాక్సెసరీ ఆఫర్ల కోసం ఆగవచ్చు.

సర్వీసింగ్ సదుపాయం, కలర్ వేరియంట్లు

సర్వీస్ సెంటర్లు దగ్గర్లో ఉంటే బైక్ నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. దేశవ్యాప్తంగా హోండాకు 6,500–7,000 కంటే ఎక్కువ టచ్‌పాయింట్లు ఉండగా, బజాజ్‌కు 3,000 పైగా షోరూమ్‌లు ఉన్నాయి. ఇక హీరో నెట్‌వర్క్ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వేలాది అవుట్‌లెట్లతో విస్తరించి ఉంది. దీనివల్ల రూటీన్ సర్వీస్, స్పేర్ పార్ట్స్ పొందడం సులువవుతుంది. స్ప్లెండర్ ప్లస్ మోడల్ విభిన్న రంగుల్లో లభిస్తోంది. ఒకవేళ కలర్ విషయంలో పెద్దగా పట్టింపు లేకపోతే డెలివరీ త్వరగా అందుతుంది. బుకింగ్ చేసుకునే ముందు డీలర్ వద్ద ఉన్న లైవ్ స్టాక్‌ను తనిఖీ చేయండి.

మీ ప్రయాణం ఎక్కువగా సిటీలోనే ఉండి, పెట్రోల్ బిల్లులను తగ్గించుకోవాలనుకుంటే హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ ప్లాటినా 100, TVS Sport బైక్‌లు అద్భుతమైన ఆప్షన్లు. మరింత రిఫైన్డ్ ఇంజిన్ కావాలంటే Honda SP125 సరైన ఎంపిక. పోలికల కోసం ARAI మైలేజ్‌ను, మీ నెలవారీ బడ్జెట్ కోసం రైడర్లు చెప్పిన రియల్ మైలేజ్‌ను పరిగణనలోకి తీసుకోండి. బైక్ నచ్చితే ఇప్పుడే బుక్ చేసుకోండి లేదా మీ ఈఎమ్‌ఐ బడ్జెట్ దాటకుండా డిసెంబర్ ప్రారంభ ఆఫర్ల కోసం వేచి చూడండి.

Article Published On: Friday, November 27, 2026, 18:13 [IST]
Read more on: #astrology
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+